విజయనగరం

గిరిజనుల వలసబాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శృంగవరపుకోట, మే 13: శృంగవరపుకోట పంచాయతీలోని పలు గిరిజన గ్రామాలలోని గిరిజనులు ఉపాధి లేక వలసబాట పడుతున్నారు. మండలంలో అడ్డతీగ, ముషిడిపల్లి, మూలబొడ్డవర, మరుపల్లి, ఐతన్నపాలెం, రాయవానిపాలెం గ్రామాలలో 800కుపైగా కుటుంబాలు ఉన్నాయి. వీరిలో సొంతపొలం లేనివారు అధికంగా ఉన్నారు. కాస్తాకూస్తో పొలం ఉందంటే అది మెరకభూమి కావడంతో పంటలు పండే అవకాశాలు లేవు. ఈ భూములలో గతంలో జీడి, మామిడి, టేకు చెట్లు ఉండేవి వాటి ద్వారా ఉపాధి పొందేవారు. ఈ భూమిని జిందాల్ పరిశ్రమ స్థాపిస్తామని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతో ఈ ప్రాంతంలోని గిరిజనులకు ఉపాధి లేకుండా పోయింది. కొంతమంది గిరిజనులు గతంలో పోడువ్యవసాయం చేసేవారు, మరికొంత మంది అటవీ శాఖ వారి వి ఎస్ ఎస్‌లలో పనిచేసేవారు. ప్రభుత్వ పోడువ్యవసాయం రద్దు చేసింది. వి ఎస్ ఎస్‌లు కూడా నిలిచిపోవడంతో ఈ ప్రాంతంలోని గిరిజనులు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. వీరిలో చాలా మందికి జాబ్‌కార్డులు లేక ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన వేతనం గిట్టుబాటుకాక ఉపాధి పనులకు వెళ్లడంలేదని వీరు చెబుతున్నారు. ప్రస్తుతం వీరంతా గుంటూరు జిల్లా క్వారీ పనులకు వెళుతూ రోజుకి ఒక్కొక్కరు 350 రూపాయలు సంపాదించుకుంటున్నామని వీరు చెబుతుతున్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి కోట్లాదిరూపాయలు కేటాయించి వెచ్చిస్తూ గిరిజనులకు ఉపాధి కల్పించడంలో విఫలమవుతుందని దానికి గిరిజనులే ఉదాహరణ. వలసవలన తమ పిల్లలకు విద్యాబోధన కరువు అవుతుందని తమ గ్రామాలలో ఓటరు, రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు కోల్పోతున్నామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వీరు కోరుతున్నారు.