విజయనగరం

పనిచేయని అధికారులపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (్ఫర్టు), మే 13: పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన నిర్థేశించిన గడువులోగా పనులు చేయని అధికారులపై చర్యలు తప్పవని మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. శుక్రవారం తన ఛాంబర్‌లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడంలో కొంతమంది అధికారులు తాత్సారం చేస్తున్నారని చెప్పారు. ఇక నుంచి ప్రజా సమస్యలపై తాత్సారం చేసిన అధికారులను ఉపేక్షించే ప్రసక్తి లేదని అన్నారు. మున్సిపల్ గ్రీవెన్స్, వార్డు పర్యటనలలో వచ్చిన వినతులు, సిటిజన్‌ఛార్టర్ ప్రకారం నిర్థేశించిన గడువులోగా పరిష్కరించే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని విభాగాల పనితీరును ఇక నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని చెప్పారు. అదేవిధంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మూడునెలలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ మైలపిల్లి పైడిరాజు పాల్గొన్నారు.