విజయనగరం

ఆధ్యాత్మకతతోనే మానవ మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీపురుపల్లి, డిసెంబర్ 6: ఆధ్యాత్మకతతోనే మనిషి జీవనం సాధ్యమవుతోందని, ప్రస్తుత కాలంలో ఆధ్యాత్మకత ఎంతో అవసరమని ఉత్తరాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి అన్నారు. కర్లాం గ్రామంలో భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో గత ఐదురోజులుగా జరుగుతున్న నవగ్రహ హోమశాలను ఆయన గురువారం సందర్శించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆచారాలు, సంప్రదాయాలకు విలువలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజం భాగుపడాలంటే కాషాయం, ఖద్దరు, ఖాకీ వ్యవస్థలు బాధ్యతతో సమర్ధవంతంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతం ఉందన్నారు. స్వామి వివేకానంద దేశానికి ఇచ్చిన సందేశాలను, సూక్తులను ప్రస్తుత యువత పాటిస్తే దేశం పురోగతి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మద్యం, టీవీ సీరియళ్లు, సెల్‌ఫోన్‌లు అందరిలోను నైతికతను దెబ్బతీసేలా ప్రభావితం చేస్తున్నాయని వివరించారు. వీటి నుంచి భయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గురువు, దేవుడుపై ప్రతీ ఒక్కరూ విశ్వాసాన్ని ఉంచి సంకల్పంతో కృషి చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని సూచించారు. దేశానికి నిజమైన సేవకుల్లో రైతులు, సైనికులు మాత్రమే ప్రధమస్థానంలో ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముందు నిర్వాహకులు ఆయన్ని ఘనంగా స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకువచ్చారు. అనంతరం నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. మండలంలోని కర్లాం గ్రామంలో భగవాన్ రమణమహర్షి ఆశ్రమం వేదమంత్రాలతో పులకరించింది. గత ఐదురోజులుగా జరుగుతున్న నవగ్రహ హోమం గురువారం పూర్ణాహుతితో ముగిసింది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో యాగశాల నవగ్రహ మంత్రనామ జపంతో ఆధ్యాత్మికత సంతరించుకుంది. శ్రీకాకుళానికి చెందిన శ్రీ రాజరాజేశ్వరిదేవీ పీఠాధిపతి సుసరాపు దర్గాప్రసాద్ శర్మ పర్యవేక్షణలో నేతేటి బాలసుబ్రహ్మాణ్యశర్మ, హనుమాన్ ఉపాసకులు వేమకోటి సుధీర్‌శర్మ, బంకుపల్లి ఉమాశంకరశర్మ, ఆరవెల్లి వెంకటరమణ శర్మ, బంకుపల్లి బుచ్చిబాబు, శ్రీ గణపతి ఉపాసకులు బొమ్మురెడ్డి చంద్రశేఖర్ సారధ్యంలో గురువారం వైభవంగా నవగ్రహ మండపాధిష్టాన దేవతలకు పూజలు, హోమాలు అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పడాల అరుణ, జెడ్పీటీసీ దంపతులు మీసాల వరహాలనాయుడు, సరోజిని, చీపురుపల్లి శాసనసభ్యురాలు తనయుడు కిమిడి నాగార్జునలను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణాన రామకృష్ణంనాయుడు దంపతులు, ఎంపిటీసీ కెల్ల నారాయణమ్మ దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బీజేపీతోనే శాశ్వత అభివృద్ధి
పూసపాటిరేగ, డిసెంబర్ 6: స్వాతంత్య్ర భారతావనిలో శాశ్వత అభివృద్ధి చేసింది బీజేపియేనని ఆ పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్ పతివాడ రమణ అన్నారు. బోగాపురంలోని ముంజేరులో బీజేపీ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవాణా మార్గాలను సులభతరం చేసేందుకు బీజేపీ కోట్లాది రూపాయలు వెచ్చిస్తుందన్నారు. ఇప్పటికే బోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు భూసేకరణ పూర్తయ్యిందన్నారు. నాలుగు రోడ్ల జాతీయ రహదారులను ఆరు రోడ్లుగా విస్తరిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరినాద్, జిల్లా కార్యదర్శి వాసు మండల నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.