విజయనగరం

మళ్లీ తెరపైకి రామ మందిర వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 9: దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తాజాగా రామ మందిర వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అన్ని జిల్లాల్లో అయోధ్య రామజన్మభూమి మందిర నిర్మాణ సంకల్ప సభలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం ఇక్కడ పిఎస్‌ఆర్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన సభలో విహెచ్‌పి సంస్థ విభాగ్ కార్యదర్శి ఫల్గుణరావు మాట్లాడుతూ అయోధ్య రామమందిరం నిర్మాణానికి ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలన్నారు. మరో విహెచ్‌పి నేత కృష్ణం రాజు మాట్లాడుతూ కోట్లాది మంది హృదయాలలో కొలువున్న శ్రీరామచంద్రమూర్తి ఆలయాన్ని అక్కడే నిర్మించాలన్నారు. ఈ దివ్య భూమిలో భవ్య మందిర నిర్మాణానికి జరిగిన 74 పోరాటాల్లో నాలుగు లక్షల మందికి పైగా రామభక్తులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. మందిర నిర్మాణానికి ధర్మద్రోహులు మరలా ఆటంకాలు సృష్టిస్తున్నారని, కోర్టు తీర్పులలోను, పురావస్తు శాఖల పరిశోధనలోను అది రామమందిరమేనని తేలిన విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి నేతలు పి.రామారావు, జిల్లా కార్యదర్శి కె.ఉదయ్‌కుమార్ తదితరులు రాముని విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు విహెచ్‌పి నేతలు, మహిళలు పాల్గొన్నారు.

వేతన సవరణ చేయాల్సిందే!
* బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగుల డిమాండ్

ఆంధ్రభూమి బ్యూరో
విజయనగరం, డిసెంబర్ 9: బీఎస్‌ఎన్‌ఎల్ సంస్ధకు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో ఆ సంస్ధ ఉద్యోగులకు వేతన సవరణ నిలిపివేసిన విషయం విధితమే. దీంతో ఆ సంస్ధ ఉద్యోగులు తమకు దక్కాల్సిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని ఆ సంస్ధ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్ ఆఫ్ బీఎస్‌ఎన్‌ఎల్ పిలుపు మేరకు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసే ఉద్యోగులు సమ్మె బాటకు సిద్ధమైనప్పటికీ ఆ తరువాత చర్చలు జరుపుతామని అధిష్టానం హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదావేశారు. ఉద్యోగులు చేస్తున్న ప్రధాన డిమాండ్లలో గత ఏడాది జనవరి 1 నుంచి వేతన సవరణ, పే స్కేల్ మ్యాగ్జిమంపై కాకుండా బేసిక్ పే నుంచి లెక్కించి పింఛన్ కంట్రిబ్యూషన్ చెల్లింపునకు బిఎస్‌ఎన్‌ఎల్‌కు అనుమతించాలని, బీఎస్‌ఎన్‌ఎల్‌కు 4జి స్పెక్ట్రమ్ కేటాయించాలని, బీఎస్‌ఎన్‌ఎల్ రిక్రూటీలకు రెండో పీఆర్సీ ప్రకారం సూపర్ యాన్యువేషన్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చశారు. కాగా, 2011 జనవరి 1 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు నష్టాలు వస్తున్నాయన్న సాకుతో అందులో పనిచేస్తున్న 1.74 లక్షల మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు వేతన సవరణను ప్రభుత్వం నిరాకరించిన విషయం విధితమే. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో కమ్యూనికేషన్ సహాయమంత్రి మనోజ్ సిన్హా బీఎస్‌ఎన్‌ఎల్ వేతన సవరణకు అనుకూలంగా డిఒటి కేబినెట్ నోట్ తయారు చేసి మంత్రి మండలి ఆమోదం కోసం పంపిస్తుందని హామీ ఇచ్చారు. ఆ విధంగా తొమ్మిది నెలలు గడుస్తున్నా మంత్రి హామీ ఇంత వరకు అమలు కాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ నష్టానికి ఉద్యోగులు కారణం కాదని, 2007 నుంచి ఏడేళ్ల పాటు మొబైల్ సర్వీస్ రంగంలో విస్తరించడానికి అవసరమైన ఎక్విప్‌మెంట్ కొనడానికి ప్రభుత్వం అనేక అభ్యంతరాలు పేరుతో అనుమతించకపోవడమే కారణమని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. 2005-06 నాటికి బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటిఎన్‌ఎల్ రూ.2వేల కోట్ల లాభాల్లో ఉన్నారని చెబుతున్నారు. గత యూపీఏ ప్రభుత్వం అవలంభించిన విధానాలనే నేటి ఎన్టీయే ప్రభుత్వం అవలంభిస్తూ ప్రభుత్వ రంగ సంస్ధలను నిర్వీర్యం చేయడానికి సిద్ధపడిందని బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు టెలికం ఆపరేటర్లు 4జీ టెక్నాలజీతో పనిచేస్తుండగా, బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం 2జి, 3జి టెక్నాలజీతో పోటీపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులకు వేతన సవరణ చేసి తమను ఆదుకోవాలని యూనియన్ నాయకులు కోరుతున్నారు.

టీచర్ల పదోన్నతులకు అడ్‌హక్ నిబంధనలు రూపొందించాలి
* ఎపిటిఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి జెసి రాజు విజ్ఞప్తి

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించేలా తక్షణమే అడ్‌హక్ నిబంధనలు రూపొందించాలని ఎపిటిఎఫ్ జిల్లాప్రధానకార్యదర్శి జెసి రాజు డిమాండ్ చేశారు. పట్టణంలో ఎపిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన జిల్లాకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల బోధనాపరంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రప్రభుత్వ తక్షణమే స్పందించాలని ఆయన కోరారు. అలాగే పోస్టుల అఫ్‌‌‌రరగెడేషన్‌కు సంబంధించి కేటరిగి 3లో ఉన్న ఉపాధ్యాయులకు కేటగిరి-2 పోస్టులకు పదోన్నతులు కల్పించాలన్నారు. 72,73,74 జీవోలను అమలు చేయాలని, దుర్మార్గమైన సిపిఎస్, కాంట్రాక్ట్ విధానాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 2018 జూలై ఒకటవతేదీ నుంచి మూలవేతనంపై 50శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఎస్‌జిటిలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో ఎపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎ.సదాశివరావు, ఆర్.కృష్ణ, బలరాంనాయుడు, దామోదరనాయుడు, ధనుంజయరావు, చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి రాందాస్ అతవాలేకు రక్షణ పెంచాలి
* డిహెచ్‌పిఎస్ జిల్లా ప్రధానకార్యదర్శి రమేష్‌బాబు

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన రిపబ్లిక్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర సామాజిక న్యాయశాఖమంత్రి రాందాస్ అతవాలేలేకు రక్షణ పెంచాలని దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్‌పిఎస్) జిల్లా ప్రధానకార్యదర్శి గోకా రమేష్‌బాబు కోరారు. ఆదివారం సాయంత్రం విలేఖరులతో ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర థానేలో అంబెర్నాధ్‌లో కేంద్రమంత్రి రాందాస్ అతవాలేపై దాడి జరగడం అమానుషమని అన్నారు. ఈ దాడికి మహారాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి దోషిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. తక్షణమే అతవాలేకు సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలని, కేంద్రమంత్రి దాడికి నైతక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని అన్నారు. కేంద్రహోంశాఖ స్పందించి తగు చర్యలు తీసుకోకపోతే కేంద్రప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు పుక్కల షణ్ముఖరావు, తెరుపల్లి శ్రీనివాసరావు, రొంగలి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

జీవో 132 తక్షణమే రద్దు చేయాలి
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 9: ఐటిడిఎ పరిధిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు తీవ్రవిఘాతం కలిగించే జీవో 132 తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు అడ్డూరి పైడితల్లి డిమాండ్ చేశారు. ఆదివారం ఇక్కడ సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవోనెంబర్ 132 వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. అందువల్ల జీవోఎంఎస్ నెంబర్ 40 ఉత్తర్వులను తిరిగి కొనసాగించాలని ఆయన కోరారు. ప్రధానోపాధ్యాయుల జీతాలు, ఇంక్రిమెంట్లు, జిపిఎస్ రుణాలు ఇంక్రిమెంట్లు ఆగిపోవడం వల్ల లక్షలాది మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందువల్ల జీవోనెంబర్ 132 తక్షణమే రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని పైడితల్లి డిమాంట్ చేశారు. సీనియర్ ప్రధానోపాధ్యాయులకు డిప్యూటీ డిఇఓలుగా పదోన్నతులు కల్పించాలని, అడ్‌హక్ పద్ధతిలో అన్ని కేటరిగిలకు చెందిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని, 11వ పిఆర్‌సి ప్రకారం 68శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని, 34 శాతం ఐఆర్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు ఎ.ఈశ్వరరావు,ఎస్.నారాయణరావు,కె.అప్పారావుతదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చేశాం ... ఆశ్వీరదించండి
* ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు

గజపతినగరం, డిసెంబర్ 9: ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని మళ్లీ తమను ఆదరించాలని గజపతినగరం ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు కోరారు. ఆదివారం మండలంలోని గంగచోళ్లపెంట, కొనిసి గ్రామాలలో గ్రామదర్శిని-గ్రామవికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కరించామని ఇవ్వని హామీలను నెరవేర్చిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. అదేవిదంగా ఎన్టీ ఆర్ గృహ నిర్మామణ పనులు వేగవంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లగా కొనిసి ప్రజలు వంతెన లేక తీవ్ర ఇబ్బందులు పడేవారని ఇక నుంచి ఆ కష్టాలు త్వరలో తీరబోతున్నాయని అన్నారు. కేంద్రం కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. నిరుపేద ఆకలి తీర్చేందుకు నియోజకవర్గాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గంగచోళ్లపెంట గ్రామంలో పలువురు చేతివృత్తిదారులకు వాషింగ్‌మిషన్లు ఎమ్మెల్యే నాయుడు పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామాలలోని ప్రధానవీధులలో పర్యటిస్తూ ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కనకల పోలినాయుడు, గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ మిత్తిరెడ్డి వెంకటరమణ, మండ పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాహితం కోరేవారికి సాయం చేయండి
* జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్

కొత్తవలస, డిసెంబర్ 9: సమాజహితం కోరుతూ ప్రజలకు సేవ చేసేవారికి సాయపడాలని జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ తెలిపారు. ఆదివారం మండలంలోని మంగలపాలెం గ్రామంలో గల శ్రీగురుదేవ చారిటబుల్ ట్రస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రకరకాల ప్రజలు ఉన్నప్పటీకీ సమాజహితం కోరేవారు అతి తక్కువ మంది ఉంటారని, అటువంటి వారిలో ట్రస్టు అధ్యక్షుడు రాపర్తి జగదీష్‌బాబు ఒక్కరని తెలిపారు. దివ్యాంగులకు సేవ చేయడం నిజంగా కష్టంతో కూడిన పని అని, సాయం చేస్తున్నవారికి మనందరం సహకరించాలని కోరారు. తన జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రతి ఒక్కరు సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అంతకుముందు ట్రస్టు ద్వారా దివ్యాంగులకు జగదీష్‌బాబు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ట్రస్టు ద్వారా సుమారు 37వేల మందికి కృత్రిమ కాలు, చేతులు అమర్చామని జగదీష్ కలెక్టర్‌కు వివరించారు. దాతల సహాయంతో ట్రస్టు నడుస్తుందని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇవ్వని కృత్రిమ అవయవాలు మంగలపాలెంలో ఇస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఐ ఎ ఎస్ అధికారి ముక్తేశ్వరరావు, తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ను అడ్డుకున్న మంగలపాలెం ప్రజలు
కొత్తవలస, డిసెంబర్ 9: మండలంలోని మంగలపాలెం గ్రామ ప్రజలు ఆదివారం జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను అడ్డుకున్నారు. తమ గ్రామానికి మంచినీటి సమస్య ఉందని, ఫ్లోరైడ్ నీరు తాగి ప్రజలు రోగాల భారిన పడుతున్నారని మహిళలు వాపోయారని తెలిపారు. ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన శుద్ధ జలప్లాంటు ఏర్పాటు చేయలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మాదేవిపేట రచ్చబండ కార్యక్రమంలో మంగలపాలెం గ్రామానికి మంచినీటి సౌకర్యం వెంటనే కల్పిలంచాలని ప్రస్తుత కలెక్టర్‌ను ఆదేశించిన సంగతిని వారు గుర్తు చేశారు. గ్రామం రెండు పంచాయతీలలో ఉందని, ఇద్దరేసి వంతున సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు 22మంది వార్డు సభ్యులు ఉన్నప్పటికీ నీటి సమస్య తీరలేదని గ్రామస్తులు కలెక్టర్ ముందు వాపోయారు. అధికారులతో చర్చించి సమస్యను వెంటనే పరిష్కరిస్తానని వారికి నచ్చజెప్పారు. దీంతో వారు వెనుదిరిగారు. కార్యక్రమంలో లోక్ సత్తా నాయకుడు శ్రీనివాసరావుతోపాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

చేనేత కుటుంబాలను ఆదుకుంటా
* ఎస్.కోట. ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి

కొత్తవలస, డిసెంబర్ 9: నియోజకవర్గంలోని చేనేత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ళ లలితకుమారి అన్నారు. ఆదివారం కొత్తవలస శ్రీరామకల్యాణమండపంలో జరిగిన నియోజకవర్గ స్థాయి చేనేత కుటుంబాల కలయిక సమావేశానికి ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలితకుమారి దంపతులను చేనేత సంఘాల నేతలు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చేనేత కుటుంబాలకు ముఖ్యమంత్రి చాలా సహాయం చేస్తున్నారని తెలిపారు. కులవృత్తి కళ తప్పిన చేనేత కుటుంబాలన్నీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, నాలుగు మండలాలకు చెందిన చేనేత సంఘనాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ఆమె స్పందిస్తూ అందరికీ న్యాయం చేస్తానని, పేదవారి అందరికీ ఇళ్ళపట్టాలు ఇస్తానని, ఇళ్ళు మంజూరు చేస్తానని చెప్పారు. బట్టలు వ్యాపారాలు చేసుకునేందుకు చేనేత కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇస్తామని తెలిపారు. నియోజకవర్గ సమన్వయకర్త రాంప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని వారికి అన్ని విధాల సాయపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాలుగు మండలాల చేనేత సంఘాల నాయకులు కోళ్ళ శ్రీను, రాజన్న, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.

రైల్వేగేటును లాక్కెల్లిన ఆండ్ర బస్సు
* విరిగిన రైల్వేగేటు

గజపతినగరం, డిసెంబర్ 9: రైల్వేగేటుకు సంబందించిన కొక్కెం బస్సు టాప్‌కు తగిలడంతో రైల్వేగేటు విరిగిన సంఘటన మెంటాడ రహదారిలో జరిగింది. సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం ఆండ్ర నుంచి గజపతనగరం వస్తున్న బస్సు సుమారు ఏడుగంటల ప్రాంతంలో రైల్వేగేటు దాటుతున్న సమయంలో గేటుకు సంబందించిన కొక్కెం బస్సుకు తగలడంతో డ్రైవర్ చూడకపోవడంతో కొద్ధిదూరం ఈడ్చుకెళ్లడంతో గేటు విరిగిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గేటు ఎత్తివేసి ఉన్నప్పటికీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడిపి గేటు అంచుపక్కగా నడపడంతో గేటు బస్సుకు తగిలి విరిగిపోయింది రైల్వేగేటుమేన్ అంటుండగా, బస్సు గేటుదాటుతున్న సమయంలో గేటుమేన్ గేటువేయడం వలనే ఈ ఘటన చోటుచేసుకొన్నదని బస్సు డ్రైవర్ అంటున్నారు. అంతే కాకుండా నిత్యం రద్దీగా ఉండి రైళ్లు తిరిగే ఈ మార్గంలో గేటు విరిగిపోవడంతో రైల్వే అధికారులు ఆందోళన చెందారు. రైళ్లు రాకపోకలకు అంతరాయం కలగకుండా అలాగే ట్రాకు మీదుగా వాహననాలు రాకపోకలు రైళ్లు వచ్చే సమయంలో జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేశారు. గజపతినగరం రైల్వేష్టేసన్ మేనేజర్ ద్వారా విషయం తెలుసుకొన్న బొబ్బిలి రైల్వే డివిజనల్ ట్రాన్స్‌పోర్టు ఇన్‌స్పెక్టర్ డి.కృష్ణారావు ఆధ్వర్యంలో సిగ్నెల్ ఇన్‌స్పెక్టర్ ఎస్ సి పాడి యుద్ధప్రాతిపదికన స్ధానికులు సహకారంతో ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో గేటును బాగు చేశారు. దీంతో వాహనాదారులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటనకు సంబందించి బొబ్బిలి రైల్వేపోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

నాసిరకంగా ముఖ్యమంత్రి ‘ఐ’విజన్ కేంద్రాల కంటి అద్దాలు

గజపతినగరం, డిసెంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాష్ట్రంలో శతశాతం దృష్టిలోప నివారణ చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఐ విజన్ కేంద్రాలను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించడం జరిగింది. జిల్లాలోని ప్రధమంగా అప్పటి జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో విజన్ కేంద్రాన్ని లాంచనంగా ప్రారంభించారు. గతంలో దృష్టిలోప నివారణ కోసం జాతీయ ఆరోగ్యమిషన్ నుండి నిధులను కేటాయించడం జరిగేది. ఇప్పుడు కూడా దాని నుండే నిధులను కేటాయిస్తూనే గతంలో పర్యవేక్షణ వైద్య ఆరోగ్యశాఖ పర్యవేక్షణలో ఉండగా ఇపుడు అపోలో ఫార్మశీ ఈ నిర్వహణ బాధ్యతను అప్పగించింది. గతంతో పోల్చుకుంటే దృష్టిలోప నివారణ గాని సమస్యలను గుర్తించే విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంతోపాటు రోగులకు అత్యాధునిక పరికరాలతో సమస్యను గుర్తించే చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ దృష్టిలోపం ఉన్న రోగులకు ప్రభుత్వం పంపిణీ చేసే కంటి అద్దాలు విషయంలో మాత్రం తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అపోలోపార్మశీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఈ విజన్ కేంద్రాలను పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ రోగులను పరీక్షించి తగిన సలహాలు, సూచనలు చేయడంతోపాటు అవసరమైన రోగులుకు కంటి అద్దాలను అందచేయడం జరుగుతున్నది. జిల్లాలో ఏడు ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రులలో ఈ ఐ విజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. శృంగవరపుకోట, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం, చీపురుపల్లి, విజయనగరం, బొబ్బిలిలలో ఈ కేంద్రాలను ఏర్పాటుచేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 13జిల్లాలో 115 ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రులలో అపోలో సౌజన్యంతో ఈ ఐ విజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దృష్టిలోపం ఉన్న కంటి రోగులకు ఆపరేషన్‌ను అవసరంలేని వారికి నిపుణులు సూచనలు మేరకు కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేయడం జరగుతున్నది. బయట మార్కెట్‌లో 800 నుండి వెయ్యిరూపాయలు విలువచేసే కంటి అద్దాలను రోగులకు ఉచితంగానే పంపిణీ చేస్తున్నారు. ఒక్కొక్క కంటి అద్దానికి ప్రభుత్వం జాతీయ ఆరోగ్యమిషన్ నుండి 270 రూపాయలను అపోలో సంస్ధకు ఇవ్వడం జరుగుతున్నది. ఇచ్చిన 270 రూపాయలలోనే కంటి అద్దాలను రోగికి అవసరమైన రీతిలో తయారు చేసి ఇస్తున్నది. దీంతో కంటి అద్దాలు చూసినప్పటికి బాగానే ఉన్నప్పటికి పట్టుమని పదిరోజులు కూడా ఉండటంలేదని విరిగిపోయి ముక్కలు అవుతున్నాయని రోగులు అంటున్నారు. ఉచితంగా కదా అని ఈ కేంద్రాలకు వస్తే నాసిరకం కంటి అద్దాలును అప్పచెబుతున్నారని దీనివలన ఏమి ప్రయోజనం అని అంటున్నారు. తిరిగి రోగి కంటి అద్దాలు తీసుకొనేందుకు కేంద్రాలు వద్దకు వస్తే రోగి ఆధార్ నంబర్‌తో రిజిష్టర్ అవడం వలన పదినెలలు వరకు తిరిగి రోగి కంటి అద్దాలు మార్చకోవడంగాని, పరీక్ష చేయించుకొనే అవకాశంగాని లేకపోవడంతో కేంద్రాలు తీరుపట్ల పెదవి విరుస్తున్నారు.

రాజరాజేశ్వరిదేవి అమ్మవారి ఆలయానికి రంగుల శోభ
బొండపల్లి, డిసెంబర్ 9: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారి ఆలయానికి సంపూర్ణంగా ఆలయ ప్రధాన మండపంతోపాటు గర్భగుడిలో రంగులు వేసే పని పూర్తి అయ్యిందని ఆలయ ధర్మకర్త ఆదుర్తిరామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఏప్రిల్ 21,22,23 తేదీల్లో జరుగు అమ్మవారి 351వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేవుపల్లి గ్రామానికి చెందిన మలేషియా దేశవాసి మహదాస్ మోహన్ విరాళంగా అందజేసిన మూడు లక్షల రూపాయలతో అమ్మవారి ఆలయంలో నిర్మించిన అష్టలక్ష్మిల విగ్రహాలకు, నవదుర్గల విగ్రహాలకు, నవగ్రహ మండపానికి, కనకమహాలక్ష్మీ, సంతోషిమాత, దుర్గాదేవి, విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి, మేథాదక్షిణామూర్తి, పోతురాజుస్వామి విగ్రహాలకు గర్భగుడికి అమ్మవారి ప్రధాన మండపంలో ఉన్న శ్రీచక్రమునకు అతి సుందరంగా పెద్దాపురానికి చెందిన గడపాసత్యనారాయణ కళాకారుడిచే ఆలయానికి రంగులు వేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఆలయంలో నిర్మించ తలపెట్టిన ధ్వజస్థంభంప్రతిష్టకు, ఆలయ అభివృద్ధి పనులకు భక్తులు విరాళాలు అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం ఆలయాన్ని సందర్శించిన విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడు దూసి కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వయంభూగా వెలసి త్వరలో 351వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న రాజమ్మ ఆలయం భవిష్యత్తులో మన జిల్లాకే తలమానికంగా తయారు అవుతుందని ప్రశంసించారు.

పాదయాత్రతో అయ్యప్ప దర్శనానికి భక్తులు
బొండపల్లి, డిసెంబర్ 9: జ్యోతి స్వరూపుడు అయ్యప్పస్వామి దర్శనానికి దీక్షబూనిన భక్తులు ఇరుముడితో పాదయాత్రగా ఆదివారం బయలుదేరారు. మండలంలోని కనిమెరక గ్రామానికి చెందిన అయ్యప్పస్వామి భక్తులు ఆలయంలో 41రోజులు దీక్ష పూర్తిచేసిన పలువురు భక్తులు కుటుంబ సభ్యులు స్వామి దర్శనానికి పాదయాత్రగా పయనమయ్యారు. గురుస్వామి బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో కనిమెరక నుంచి రాజమండ్రి సమీపంలో గల ద్వారపూడికి కొత్తవలస, పెందుర్తి మీదుగా కాలినడకన యాత్రకు శ్రీకారం చుట్టారు. వీరిని దారిపొడవున భక్తులు కలశతీర్థంతో పూజలు అందించి మొక్కులు తీర్చుకున్నారు.

మాసాల గెడ్డపై వంతెన నిర్మాణం జరిగేనా?
పాచిపెంట, డిసెంబర్ 9: మండలంలో పద్మాపురం, ఈతమానువలస మధ్యలోగల మాసాల గెడ్డపై వంతెన నిర్మాణం జరిగేనా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ వంతెన లేకపోవడంతో పాదచారులు, వాహనచోదకులు ప్రతీ ఏడాది ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో నీటి ప్రవాహం ఉదృతం ప్రవహిస్తుందని, ఆ సమయంలో రాకపోకలు నిలిచిపోతాయని ఆయాప్రాంత వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గెడ్డ అంతా బురదమయం కావడంతో ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంటుందని వారు అంటున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణం చేపడితే పై గ్రామాలతోపాటు వెలగవలస, మూలవలస, మెట్టవలస, తదితర సుమారు 10 గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఆయాగ్రామాలకు 108వాహనం కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరికి ఎటువంటి వ్యాధులు వ్యాపించిన డోలికట్టి గెడ్డను దాటించాల్సిందేనని గిరిజనులు వాపోతున్నారు. ఇక్కడ వంతెనను నిర్మించాలని పలుమార్లు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన హామీలు ఇస్తున్నారే తప్ప కార్యరూపం దాల్చడం లేదని గిరిజనులు అంటున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే భంజుదేవ్ దృష్టికి తీసుకువెళితే వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని గిరిజన పెద్దలు పేర్కొన్నారు. వచ్చే ఏడాదికైన వంతెన నిర్మాణం చేపడతారని ఆయాప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మూతపడిన పత్తికొనుగోలు కేంద్రం
సాలూరు, డిసెంబర్ 9: స్థానిక ఏఎంసీ మార్కెట్‌యార్డులో సీసీఐ(కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాన్ని గత 24వ తేదీన ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 2లక్షల క్వింటాళ్లు పత్తి ఉత్పత్తి జరుగుతుంది. ప్రధానంగా సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం మండలాల్లో పత్తిసాగు అధికంగా ఉంటుంది. ఈ మండలాల్లో సుమారు లక్ష క్వింటాళ్ల వరకు పత్తి ఉత్పిత్తి జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో పత్తి ఉత్పత్తి అధికంగా ఉన్నందునే రైతుసంఘాల వినతుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు కేంద్రాన్నిప్రారంభించారు. గత రెండు సంవత్సరాలుగా ఒక్క క్వింటా పత్తిని కొనుగోలుచేసిన దాఖలాలు లేవు. గత నెల 24న ఏఎంసీ ఛైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఇప్పటి వరకు కిలో పత్తిని కూడా కొనుగోలుచేయలేదు. కొనుగోలు కేంద్రాన్ని ఎప్పుడు చూసిన మూసే ఉంటుంది. ఈ కేంద్రాన్ని ప్రారంభించినప్పటికే ఈప్రాంతంలో 90శాతం పత్తి అమ్మకాలు జరిగిపోయాయి. ప్రైవేటు వ్యాపారులు యదేచ్ఛగా కొనుగోలు చేశారు. రైతులు కూడా పత్తివ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గుచూపించారు. వంద, రెండు వందలను తగ్గించిన ప్రైవేటు వ్యాపారులు వెంటనే సొమ్ము చెల్లిస్తారనే నమ్మకం రైతుల్లో ఉంది. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో సవా లక్ష షరతులతో రైతుల నుంచి పత్తి కొనుగోలు చేస్తారనే అభిప్రాయం రైతుల్లో ఉంది. తేమశాతం, ఇ.క్రాఫ్ బుకింగ్ వంటి నిబంధనలు పత్తిరైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇక్కడ పత్తికొనుగోలు కేంద్రం ఉన్న లేనట్లేనని రైతులు భావిస్తున్నారు. సీసీఐ అధికారులు అధికారికంగా చెప్పుకోవడానికే ఇక్కడ కేంద్రాన్ని తెరిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుకు దక్కని మద్ధతు ధర
పత్తిరైతులకు ప్రభుత్వ మద్ధతు ధర ఎండమావిగా మారింది. పత్తికొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేసి దళారీ వ్యవస్థను నిర్మూలించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న కొనుగోలు కేంద్రాలు ఉత్సవ విగ్రహాలగానే ఉన్నాయి. ప్రభుత్వ మద్ధతు ధర క్వింటాకు 5,450 రూపాయలు కాగా రైతులకు ఆ ధర అందని పరిస్థితి ఉంది. ప్రైవేటు వ్యాపారులు తూనికల్లో మోసాలు చేసిన వారినే రైతులు ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క క్వింటాకు రైతు 200, 300 రూపాయల వరకు నష్టపోయే పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఉన్న అమ్ముకోలేని దుస్థితి జిల్లాలోని పత్తిరైతులకు తలెత్తింది.

గణిత ప్రతిభా పరీక్షలకు స్పందన
సాలూరు, డిసెంబర్ 9: పట్టణంలోని శ్రీసత్యసాయి జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన గణిత ప్రతిభా పరీక్షలకు అనూహ్య స్పందన లభించింది. 17 హైస్కూల్స్ నుంచి 640మంది పదవ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. మేథ్స్‌క్లబ్ సభ్యులు కొల్లి గిరిబాబు, కెవి సత్యనారాయణలు తొలిత గణిత శాస్తవ్రేత్త రామానుజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిభా పరీక్షల పత్రాలను విడుదల చేశారు. విద్యార్థులలో పోటీతత్వం, గణితం పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు గత 18 సంవత్సరాలుగా మేథ్స్‌క్లబ్ నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 22న విజేతలకు బహుమతులు అందజేస్తామని సభ్యులు గిరిబాబు, సత్యనారాయణ తెలిపారు.
హెచ్‌ఎం సస్పెన్షన్ అన్యాయం
సాలూరు, డిసెంబర్ 9: పాచిపెంట ఎస్సీకాలనీలోని మండల ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలిన సంఘటనలో పాఠశాల హెచ్‌ఎం బోయిన మచ్చెను సస్పెండ్ చేయడం అన్యాయమని ఆపస్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు జె రామినాయుడు అన్నారు. గోడ కూలిన సంఘటనలో 3వతరగతి విద్యార్థి డోల శశిధర మృతిచెందడం విచారకరమన్నారు. 50శాతం ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. 40శాతం పాఠశాలలకు తగిన సౌకర్యాలు లేవన్నారు. హెచ్‌ఎం సస్పెన్షన్‌పై త్వరలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌ను ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు కలుస్తారన్నారు. వెంటనే హెచ్‌ఎం సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్డిని నిర్మించిన కాంట్రాక్టర్, సంబంధిత ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలని ఆపస్ రాష్ట్ర సహాయ అధ్యక్షులు జె రాంనాయుడు ఒక ప్రకటనలో కోరారు.
తూర్పుకాపులంతా ఐక్యతతోనే
అభివృద్ధిసాధించుకోవాలి

మక్కువ, డిసెంబర్ 9: తూర్పుకాపు కులస్థులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధిని సాధించుకోవాలని మండల తూర్పుకాపు సంఘం అధ్యక్షులు చోడవరపు రామకృష్ణ అన్నారు. స్థానిక సువర్ణముఖి నది ఒడ్డున తూర్పుకాపు కులస్థుల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుకాపులంతా ఐక్యతతో ఉండి మనకు అవసరమైన అభివృద్ధిని సాధించుకోవాలన్నారు. అలాగే వృద్ధులకు పింఛన్లు, విద్యార్థుల భవిష్యత్‌కు తోడ్పాటునందించాలన్నారు. అలాగే తూర్పుకాపులలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చిన అందరూ కలిసికట్టుగా ఆదుకోవాలని సూచించారు. అనంతరం విశ్రాంత ఉపాధ్యాయులు బూరాడ సూర్యారావు మాట్లాడుతూ గతంలో మనలో ఐక్యత లేకపోవడంతోనే వెనుకబడి ఉన్నామని, ఐక్యతతో ఉంటే మనం ఏదైన సాధించుకోవచ్చునన్నారు. ప్రతీ ఒక్కరికీ అందుబాటు ఉంటూ వారి కష్టసుఖాల్లో పంచుకోవాలన్నారు. అలాగే సంక్షేమపథకాల అందడంలోను, ఆర్థికపరంగా అందరికీ చేదోడువాదోడుగా ఉండాలన్నారు. ఈ మేరకు మజ్జిగౌరి తూర్పుకాపు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షులుగా సిహెచ్ రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా గౌరినాయుడు, సిహెచ్ శాంతమూర్తి, పువ్వల భాస్కరరావు, జనరల్ సెక్రటరీగా సిహెచ్ ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీలుగా బి ప్రసాద్, సిహెచ్ శ్రీహరి, ట్రెజరర్లుగా ఆర్ రవికుమార్, కె రామకృష్ణతోపాటు 16మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుకాపులంతా పాల్గొన్నారు.

వాటర్ షెడ్డు పనుల పరిశీలన
కురుపాం, డిసెంబర్ 9: మండలంలోని మొండెంఖల్, ఉదయపురం, నీలకంఠాపురం ప్రాంతాల్లోని వాటర్ షెడ్డు పనులను ఆశాఖ ప్రాజెక్టు మేనేజర్ ఆర్ పోలినాయుడు పరిశీలించారు. ఆదివారం గ్రామాల్లో జరుగుతున్న కాలువలు, బావులు, చెరువులు ఇతర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందేందుకు వాటర్ షెడ్డు ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. దీని కోసం నిదులు కూడా వెచ్చిస్తున్నామన్నారు. పంట పొలాల్లో ఇంకుడు గుంతలు, చెరువులు, చిననీటి కుంటలను తవ్వించేందుకు ఎక్కువగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు వాటర్ షెడ్డు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బిజెపీ ఇంటింటి ప్రచారం
కురుపాం, డిసెంబర్ 9: మండలంలో బిజెపీ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆదివారం బిజెపీ రాష్ట్ర నాయకులు ఎన్ ధూలికేశ్వరరావు ఆద్వర్యంలో రంగుపురం, షేకుపాడు, గుమ్మిడిగూడ, దండుసూర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమలుచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుందన్నారు. ప్రతీ ఒక్కరికీ పెన్షన్, బీమా సౌకర్యం, ఇళ్లు, తదితర సంక్షేమపథకాలను అమలుచేస్తుందన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సక్రమంగా నిర్వహించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ నిదులతో కొన్ని పథకాలను అమలుచేసిన అవి వారివిగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రాబోయే ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో బిజెపీ తరుపున నిమ్మక జయరాజు పోటీ చేస్తారని, ఆయన్ను ఆదరించి గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపీ నాయకులు గౌడు బాలంక