విజయనగరం

ఈవ్‌టీజింగ్ నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాడంగి, డిసెంబర్ 10: మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ సురేంద్రనాయుడు అన్నారు. మండల కేంద్రంలో లైంగిక వేధింపులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థినులు చదువుకోవాలన్న లక్ష్యంగా సుధూర ప్రాంతాల నుంచి వస్తుంటారని, అటువంటి వారిని సోదరీమణుల వలనే ఆదరించాల్సిన బాధ్యత ప్రతీ విద్యార్థిపై ఉందన్నారు. అలా కాకుండా ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ర్యాలీలో కళాశాల, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు
కురుపాం, డిసెంబర్ 10: నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రాజకుమారి హెచ్చరించారు. సోమవారం మండలంలోని గుమడ, కల్లికోట నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గుమడ, కల్లికోట, కొట్టు తదితర ప్రాంతాల నుంచి ఇసుకను ట్రాక్టర్లపై 3 యూనిట్ల కంటే అధికంగా తీసుకువెళ్లరాదన్నారు. గృహ నిర్మాణాలు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఇసుకను తరలించాలే తప్ప వ్యాపారాల నిమిత్తం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ట్రాక్టర్ల నిర్వాహకులతో మాట్లాడుతూ రోజుకు ఒక ట్రాక్టర్ ఇసుకను మాత్రమే తీసుకువెళ్లాలని, అదనంగా తీసుకువెళితే 50వేల రూపాయల అపరాధ రుసుం విధిస్తామన్నారు. అదేవిధంగా మంగళవారం నియోజకవర్గం పరిధిలో గల తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఓటర్ల నమోదుకార్యక్రమంలో భాగంగా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులతో సబ్ కలెక్టర్ ఛేతన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు హాజరుకావాలన్నారు.

రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని సంపాదించాలి
కొమరాడ, డిసెంబర్ 10: రైతులు పంటల సాగులో తక్కువ పెట్టుబడులు పెట్టి అధిక ఆదాయం పొందేలా కృషి చేయాలని కృషీ విజ్ఞాన శాస్తవ్రేత్త ఏ నీలమ అన్నారు. ఈమేరకు కృషీ కళ్యాణ్ అభియాన్-2 కార్యక్రమాన్ని సోమవారం కూనేరులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిదులతో నిర్వహిస్తున్న కృషీ కళ్యాణ్ అభియాన్ పథకంలో భాగంగా రైతులకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కూరగాయల పంటలు, పెరటి కోళ్లపెంపకం, పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టాలన్నారు. అదేవిధంగా మండలంలోని గంగరేగువలస గ్రామంలో కూడా రైతులకు అవగాహన సదస్సును నిర్వహించి రైతులు సాగుచేస్తున్న టమోటా, కూరగాయల పంటలలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి విజయభారతి, ఏఇఓ ఎన్ పావని, శాస్తవ్రేత్త హరి, తదితరులు పాల్గొన్నారు.

భగవంతుని ప్రేమ స్వరూపమే సూర్యుడు
సాలూరు, డిసెంబర్ 10: భగవంతుని యొక్క అపార ప్రేమ స్వరూపమే సూర్యభగవానుడని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. సోమవారం స్థానిక కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఆదిత్య హృదయం, సూర్యదేవుని అనుగ్రహం అనే అంశంపై అనుగ్రహబాసనం చేశారు. ఈ కార్యక్రమానికి ముందుగా ఆశ్రమ అధినేత సద్గురు ముద్దు సత్యనారాయణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూర్యునిలో ఉన్న వెలుగు సాక్షాత్తు భగవంతుడేనన్నారు. సర్వప్రాణులను రక్షించేది సూర్యభగవానుడేనన్నారు. అందరూ చూడగలిగే భగవంతుడి సూర్యుడొక్కరేనన్నారు. సూర్యోదయంలో ఆరాతీస్తే ఆరోగ్యంతోపాటు అనుగ్రహం లభిస్తుందన్నారు. ఆదిత్య హృదయం పారాయణతో సర్వశుభాలు, సర్వపాపనాశనం, చింత, శోకం, బాహ్య, అంతర్గత దుఃఖాలను పోగొడుతుందన్నారు. ఆదిత్య హృదయం పారాయణం చేసి రాముడు రావణుడిపై యుద్ధం చేసి విజయం సాధించారన్నారు. 84 రకాల గణాలతో సూర్యరథం నడుస్తుందన్నారు. 18 పురాణాలు, రామాయణం, మహాభారతంలో సూర్యుని గురించే ప్రస్తావించాయన్నారు. దర్శించి నమస్కరించేవారు మహార్షులని, భావించి నమస్కరించేవారు మనుషులన్నారు. ఇష్టదైవాన్ని సూర్యునిలో దర్శిస్తే ముక్తిలభిస్తుందన్నారు. ఆకాశంలో కనిపించే సూర్యుడు శ్రీచక్రమన్నారు. భారతీయులంత సూర్యోదయానికి ముందే గృహాలను శుభ్రం చేసుకుని సూర్యోపాసన చేయాలన్నారు. సర్వజీవులకు మూలశక్తిని అందించే భగవంతుడు సూర్యుడేనన్నారు. హిందూమతం అంటే జ్ఞానమన్నారు. సూర్యమండలారాధన చేయాలన్నారు. భగవంతుడు మూడు జ్యోతులతో కనిపిస్తాడన్నారు. సూర్యడు, చంద్రుడు, అగ్ని రూపాలలో అనుగ్రహిస్తాడన్నారు. సూర్యుడిలో ఉన్న వెలుగు సాక్షాత్తు భగవంతుడేనన్నారు. రాముడు పుట్టిన నేలలో రాముడి గుడి కట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నామన్నారు. మతాలు, కులాలను ఉద్దరిస్తామన్న ఉన్నారే కానీ దేశాన్ని ఉద్దరిస్తామన్నవారు లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్రేయం కళాపీఠం అధ్యక్షులు జె ఈశ్వరరావు, శారదాసత్‌సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.