విజయనగరం

ఆకట్టుకుంటున్న సర్కస్ అద్భుత విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, డిసెంబర్ 10: పార్వతీపురంలోని సౌందర్య సినిమాహాలు వెనుక భాగం విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సతి అనసూయ మాత ఆఫ్రికన్ సర్కస్ ప్రదర్శనలు వీక్షకులకు కనువిందు కలిగిస్తున్నాయి. ఈ సర్కస్ బృందంలో 150మంది ఆఫ్రికన్, రష్యన్ కళాకారులు చేస్తున్న చూపరులకే అబ్బురపరుస్తున్న అత్యంత నైపుణ్యంతో ప్రదర్శించే అత్యంత ఎతె్తైన ప్రదేశంలో ఒక వైపునున్న వ్యక్తి మరోవైపు గల ఊయలను అందుకోవడం చూస్తే ఎంతటి ప్రాక్టీసు ఉంటే తప్ప ఇది సాధ్యపడదనే చెప్పాలి. ఏమాత్రం తేడావస్తే ఏవౌతుందో చెప్పాల్సిన పనిలేదు. అదేవిధంగా ఓ వ్యక్తి తలపై మరోవ్యక్తి తలపెట్టి కాళ్లూచేతులు కిందకు పెట్టి చేసే విన్యాసం విడ్డూరంగానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే సైకిళ్ల ప్రదర్శనలు, మోటారుబైక్ రేస్, హైజండ్‌లో చేసిన జంపింగ్ వంటి విన్యాసాలు వీక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తున్నాయి. కొంతమంది ఒకసారి చూస్తే తనివి తీరదని మళ్లీ చూస్తున్నామని చెబుతున్నారు. ఈ సర్కస్ నిర్వాహకులు, యజమాని రామరాజు ఆధ్వర్యంలో దాదాపు కోటి రూపాయల ఎక్విప్‌మెంట్‌తో అధిక జీతాలు వివిధ దేశాల నుండి వచ్చిన వారికి చెల్లిస్తూ రన్ చేయడం విశేషంగా కన్పిస్తుంది. దాదాపు 25లారీల వరకు ఎక్విప్‌మెంట్ ఉంటుంది. అలాగే ఫ్యామిలీలతో ఉన్నవారికి వేర్వేరు టెంట్‌లు వేశారు. మహిళలందరికీ వేర్వేరు టెంట్‌ల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు నెలరోజులుగా ఆడుతున్న ఈ సర్కస్ విన్యాసాలు ఎంతచూసినా మరచిలేమని ప్రజలు అంటున్నారు. మరికొద్దిరోజులు మాత్రమే ఈ సర్కస్ ప్రదర్శనలు ఉంటాయని తర్వాత మరో పట్టణ ప్రాంతంలో వాటిని తరలిస్తారని నిర్వాహకులు తెలిపారు.

సబ్ కలెక్టర్ బంగ్లా
పునరుద్ధరణపై అధికారుల పరిశీలన
పార్వతీపురం, డిసెంబర్ 10: పార్వతీపురం సబ్ కలెక్టర్ నివాస బంగ్లా పూర్తిగా పాడైన దృష్ట్యా బంగ్లాను పునరుద్ధరించే చర్యలు వేగవంతం చేసే పనిలో భాగంగా గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కెవి ఎన్ ఎస్ కుమార్‌తో పాటు డి ఇ ఇ తిరుమలేసులతో పాటు ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బాలసుందరం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ బృందం పరిశీలించి అంచానాలు రూపొందిస్తున్నారు. ఈ మరమ్మతులకు అయ్యే వ్యయాన్ని ఐటిడిఎ నుండి ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ మంజూరు చేయడానికి అంగీకరించడంతో పనులు వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇటీవల సబ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన టి ఎస్ చేతన్ ఐ ఎ ఎస్ అధికారి కావడంతో ఈబంగ్లా నివాసానికి యోగ్యంగా లేనందువల్ల ప్రస్తుతం ఐటిడిఎ కలెక్టర్ క్యాంపుహౌస్‌లో నివాసం ఉంటున్నారు. సబ్ కలెక్టర్ బంగ్లా మరమ్మతు పనులు పూర్తయితే బంగ్లాకు సబ్ కలెక్టర్ నివాసం మార్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏమైనప్పటికీ సబ్ కలెక్టర్ బంగ్లాను మరమ్మతు పనులు పీవో చొరవ తీసుకోవడం విశేషంగా చెప్పవచ్చు.