విజయనగరం

కచ్చితమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 11: నిర్ణీత సమయంలోనే కచ్చితమైన ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని, ఎలాంటి తప్పులు ఉండరాదని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్లు సక్సేనా, శుక్లా అన్నారు. మంగళవారం న్యూడిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో చనిపోయిన వారి పేర్లు, ఒక వ్యక్తి పేరు రెండు సార్లు రావడం, తప్పుడు పేర్లు, ఉండరాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో డూప్లికేటు, అనుమానిత ఓటర్లు అత్యధికంగా ఉన్నారన్నారు. బిఎల్‌ఒలు ఇంటింటికీ వెళ్లి వాటిని పరిశీలించాలన్నారు. పూర్తి స్థాయి విచారణ చేయకుండా తుది ప్రచురణ చేయవద్దని సూచించారు. నివాసం ఉన్న స్థలంలోనే ఓటు ఉండాలన్నారు. కొత్తగా వచ్చిన వారి పేర్లు చేర్చాలని, బదిలీ అయిన వారి పేర్లు తొలగించాలని, వారి పేర్లు బదిలీ అయిన చోట చేర్చాలన్నారు. ప్రతి అంశంపైన ఫారాలు తప్పకుండా తీసుకోవాలన్నారు. వాటిని పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. నోటీసులు జారీ చేసే పంచనామా కార్యక్రమం చేపట్టాలన్నారు. పోలింగ్ స్టేషన్ వివరాలు, ఎలక్టోరల్ జాబితా, మ్యాప్‌లు, జనాభా తదితర వివరాలు ఇఆర్వో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. పూర్తి స్ధాయి డ్రాఫ్ట్‌రోల్ తయారు చేయాలన్నారు.
జిల్లా ఎన్నికల అదికారులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలన చేసి తుది జాబితాకు సూచనలు జారీ చేయాలన్నారు. కాగా, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సిసోడియో మాట్లాడుతూ రాష్ట్రంలో సవరణ జాబితా వివరాలు గురించి వివరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, జెసి కెవి రమణారెడ్డి, డిఆర్వో వెంకటరావు, ఎన్నికల విభాగం తహశీల్దార్ ప్రసాద్‌పాత్రో, ఎన్‌ఐసి అధికారి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధికి అండగా నిలవాలి

విజయనగరం, డిసెంబర్ 11: సమాజంలో పురుషులతో సమానంగా మహిళలు అభివృద్ధి చెందడానికి అందరు అండగా నిలవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ పి.రామకృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం భారత ప్రభుత్వం రీజనల్ అవుట్‌రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ‘బేటి బచావో.. బేటి పడావో’ అనే కార్యక్రమంపై స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో లింగ వివక్ష, బాల్య వివాహాలు, మహిళల రక్షణ, లింగనిర్ధారణ పరీక్షలు లేకుండా చేయడం లక్ష్యంగా ‘బేటి బచావో..బేటి పడావో’ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారని చెప్పారు. ఐసిడిఎస్ పివో వసంతబాల మాట్లాడుతూ మహిళలు ముఖ్యంగా బాలికల విద్య, పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కిశోర్ బాలిక పధకం, పోషణ అభియాన్ వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కేంద్ర సమాచార సహాయ సంచాలకులు శ్రీనివాస్ మహేష్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం సుమారు రూ.1.86 లక్షల కోట్లు మాతా శిశుసంరక్షణ కోసం వెచ్చిస్తుందన్నారు. డివిఇవో కెవివి విఠల్ మాట్లాడుతూ మహిళలు విద్యా రంగంలో పురోభివృద్ధి సాధించాలని లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వికెవి కృష్ణారావు మాట్లాడుతూ వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను స్ఫూర్తిగా తీసుకొని కష్టపడి చదువుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలికల సంరక్షణ అధికారి విద్యాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఖాదర్‌బాబాకు శుభాకాంక్షలు
విజయనగరం, డిసెంబర్ 11: పట్టణంలోని హజరత్ ఖాదర్ వలీబాబా అతావుల్లా 122వ జయంతిని పురస్కరించుకొని బాబామెట్టలోని ఖాదర్‌నగర్‌లో హజరత్ ఖాదర్ వలీ బాబా దర్గాలో మహ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబాను వైసీపీ నియోజకవర్గ నాయకులు అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్‌లు సందర్శించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అవనాపు విక్రమ్, కాళ్ల గౌరీశంకర్‌లను ఉచిత రీతిన సత్కరించారు.

వెలుగు సిబ్బంది సమ్మెకు పార్టీలు సంఘీభావం

విజయనగరం, డిసెంబర్ 11: రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న వెలుగు ఉద్యోగుల సమ్మెకు బీజేపీ, వైసీపీలు సంఘీభావం తెలిపాయి. మంగళవారం వెలుగు ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చిరెడ్డి మాట్లాడుతూ 2000లో ఏర్పాటు చేసిన వెలుగు ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్దతిలో నియమించి నేటికి 18 ఏళ్లు గడచిన వారి సర్వీసులను క్రమబద్ధీకరించకపోవడం శోచనీయమన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ వెలుగు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఈ సమస్యను రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు పాండ్రంకి సంతోష్‌కుమార్, పట్టణ ఉపాధ్యక్షుడు ఇమంది నర్సింగరావు, పుష్ప అంకిత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలు

విజయనగరం, డిసెంబర్ 11: అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని జిల్లా యువజన విభాగం నేత ఈశ్వర్ కౌశిక్ అన్నారు. మంగళవారం ఆయన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమాన కరుణాకరరెడ్డిని శ్రీకాకుళంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. రానున్న ఎన్నికల్లో యువత పాత్ర గురించి చర్చించారు. విజయనగరం నియోజకవర్గంతోపాటు జిల్లాలో యువజన, విద్యార్ధి విభాగాల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాల గురించి కౌశిక్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో యువత కీలక పాత్ర పోషించి పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నిర్ధేశించిన కార్యక్రమాలు చేపడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కౌశిక్ వివరించారు.
సమాజ సేవలో భాగస్వాములు కావాలి

విజయనగరం, డిసెంబర్ 11: ప్రతి ఒక్కరు సమాజ సేవలో భాగస్వాములు కావాలని ఉత్తరాంధ్ర వైసీపీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. మంగళవారం ఆయన కొండకరకాంలోని నాగవంశం రిక్రియేషన్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కబడ్డీ క్రీడలకు ఆద్యుడైన భగవాన్ దాస్ సేవలు మరువలేనివని అన్నారు. ఆయన పర్యవేక్షణలో ఎంతో మంది క్రీడాకారులు విజయనగరం ఖ్యాతిని ఇనుమడింపజేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కనకల ప్రసాదరావు, చైర్మన్ రంగారావు దొర, కె.తవిటిరాజు, కార్యదర్శి పి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారి నియామకం
గజపతినగరం, డిసెంబర్ 11: ప్రతి వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారిని ప్రభుత్వం నియమిస్తుందని ఇన్‌చార్జి ఎంపిడివొ జి.జనార్ధనరావు అన్నారు. మంగళవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 250 కుటుంబాలకు లేదా ప్రతి వెయ్యి జనాభాకు ఒక హరిత రాయబారితో పాటు ట్రైసైకిళ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ఎంతమంది అవసరమో ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. చెత్త నుంచి సంపద కేంద్రాలలో పనిచేయడానికి నియామకం చేపడతామని అన్నారు. నివేదికలు ప్రభుత్వానికి పంపిస్తే స్వచ్ఛ్భారత్ మిషన్ ద్వారా హరిత రాయబారులు, ట్రైసైకిళ్ళు మంజూరు అవుతాయని తెలిపారు. అదే విధంగా ఇంటి పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

క్రీడాకారులను ప్రోత్సహించడం లయన్స్ ధ్యేయం
* లయన్స్ జిల్లా పాస్టు గవర్నర్ డాక్టర్ మూర్తి

గజపతినగరం, డిసెంబర్ 11: క్రీడాకారులను ప్రోత్సహించడానికి లయన్స్‌క్లబ్ ఎపుడూ ముందు ఉంటుందని లయన్స్‌క్లబ్ జిల్లా పాస్టు గవర్నర్ డాక్టర్ బి.ఎస్.ఆర్. మూర్తి అన్నారు. మంగళవారం స్ధానిక శేషుమూర్తి గ్రంధాలయంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జాతీయస్ధాయి వెయిట్‌లిప్టింగ్ పోటీలకు వెళుతున్న క్రీడాకారులకు లయన్స్ తరుపున ఆర్ధికసహాయాన్ని డాక్టర్ మూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలోనూ జాతీయస్ధాయి పోటీలకు వెళ్లినవారికి ఆర్ధిక సహాయాన్ని అందజేశామని చెప్పారు. జాతీయస్ధాయి పోటీలలో మన ప్రాంతానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కోచ్ చల్లా రాము మాట్లాడుతూ ఈనెల 14నుంచి 22వతేది వరకు మహారాష్టల్రో నాగపూర్‌లో జరగనున్న జాతీయస్ధాయి సబ్ జూనియర్, జూనియర్‌స్ధాయి పోటీలకు శనపతి పల్లవి కిలోలు, లెంక అనూరాధ 49కిలోలు, తాళ్లపూడి కుమార్‌స్వామి 55కిలోల పోటీలలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బెల్లాన నాగనరేంద్ర, కార్యదర్శి అట్టాడ లక్ష్మనాయుడు, తదితరులు పాల్గొన్నారు.