విజయనగరం

ఓటర్ల జాబితాలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి, డిసెంబర్ 12: బొబ్బిలి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అధికారులు, ఏజెంట్లు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గణపతిరావు కోరారు. స్థానిక శ్రీసూర్యారెసిడెన్సీలో నియోజకవర్గస్థాయి బూత్‌లెవెల్ అధికారులు, ప్రజాప్రతినిదులు, ఏజెంట్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుందని, వారి పేర్లును నమోదుచేయాలన్నారు. అలాగే మృతిచెందిన వారి పేర్లును ఓటర్ల జాబితాల నుంచి తొలగించడంతోపాటు రిపీట్ అయిన వారి పేర్లను కూడా తొలగించాలన్నారు. తొలగించే ముందు 13,14 నోటీసులు జారీచేయాలన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులను సవరించి ఫొటోలు వంటివి మార్పులు చేయాలన్నారు. నిబంధనల ప్రకారం తూ.చా. తప్పకుండా ఏజెంట్లు, అధికారులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అనంతరం వైసీపీ నాయకులు శంబంగి వెంకటచినప్పలనాయుడు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఎటువంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తిన ఓటర్లు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి, రామభద్రపురం, తెర్లాం, బాడంగి తహశీల్దార్లు గణపతిరావు, రత్నకుమార్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికైన వారందరికీ ఉద్యోగాలు అందిస్తాం
బొబ్బిలి, డిసెంబర్ 12: స్థానిక రాజాకళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఎంపికైన విద్యార్థులకు విద్యాసంవత్సరం పూర్తయిన వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని హెటిరో డ్రగ్స్ హెచ్‌ఆర్ మేనేజర్ వెంకటగోపీరెడ్డి తెలిపారు. ఈమేరకు రాజాకళాశాలలో ఆ సంస్థ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్‌లో 40మంది విద్యార్థులు ఎంపికయ్యారు. దీంతో బుధవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపికైన వారందరికీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, కో- ఆర్ఢినేటర్ వీరంద్రకుమార్‌లు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతోపాటు పలురకాలైన స్కిల్స్‌పై శిక్షణలు అందిస్తున్నామన్నారు. ఇటీవల పలు సంస్థలు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో రాజాకళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఎంపికవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ పర్సన్ కలీం, కళాశాల ప్రతినిది బదరీ, నాగేంద్రకుమార్, శరత్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలి
తెర్లాం, డిసెంబర్ 12: చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ ఎస్ శ్రీనివాసరావు కోరారు. స్థానిక శ్రీవెంకటేశ్వర జూనియర్ కళాశాల ఆవరణలో మహిళా రక్షక్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు కల్పిస్తున్న చట్టాలపై అవగాహన పెంచుకోవడంతోపాటు నిర్భయ, ఆయుష్, వంటి కేసులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎవరైన ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు విద్యార్థులంతా దూరంగా ఉండాలన్నారు. ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చిన మహిళారక్షక్ సిబ్బందికి తెలియజేయాలన్నారు. అనంతరం కళాశాల నుంచి కిలోమీటర్ల దూరంలో ఉన్న తెర్లాం గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జి రామకృష్ణనాయుడు, వైస్ ప్రిన్సిపల్ తెంటు రామారావు, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అర్హులైన ప్రతీ ఒక్కరికీ నవరత్నాలను అమలు చేస్తాం
తెర్లాం, డిసెంబర్ 12: వైఎస్సార్ కాంగ్రెస్ చేపడుతున్న నవరత్నాల పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త శంబంగి వెంకటచినప్పలనాయుడు కోరారు. మండలం లోచర్ల గ్రామంలో బుధవారం ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతీ ఒక్కరికీ నవరత్నాల పథకాలను అమలుచేస్తామన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి చేపడుతున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందని, రాబోయే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అనంతరం బాడంగి వైసీపీ నాయకులు ఎన్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ టీడీపీ అవినీతి కోరల్లో కూరుకుతుందని, ఆ పార్టీ నాయకులు ఇసుక, మట్టి దోపీడిలలో మునిగితేలుతున్నారన్నారు. అటువంటి వారి అరాచకాలను ఓట్లుతోనే అరికట్టాలన్నారు. ప్రతీ కార్యకర్త వైసీపీ బలోపేతానికి సైనికుల్లా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు ఎన్ బాబ్జీరావు, ఎస్ శ్రీనివాసరావు, మాజీ జడ్పిటీసీ బి అప్పలనాయుడు, టి అప్పలనాయుడు, ఎస్ సత్యనారాయణ, ఎం వెంకటరమణ, జి దాలయ్య, రామారావు, తదితరులు పాల్గొన్నారు.