విజయనగరం

అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాచిపెంట, డిసెంబర్ 13: అర్హులైన ప్రతీ ఒక్కరూ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని సాలూరు ఏఎంసీ ఛైర్మన్ పిన్నింటి ఈశ్వరరావు అన్నారు. గురువారం పాచిపెంటలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అంచలంచెలుగా అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతులు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ముందుగా శాఖలవారీగా నివేదికలను వెల్లడించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక శ్రీనివాసరావు, ఐసీడీఎస్ పీఓ రమాదేవి, వ్యవసాయ అధికారి గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.
21న ఛలో ఐటీడీఏ
పాచిపెంట, డిసెంబర్ 13: ఈనెల 21న ఛలో ఐటీడీఏ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మర్రి శ్రీనివాసరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం 2005లో వచ్చినప్పటికీ ఈ చట్టం సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలుచేయడంతోపాటు కూలీలకు బకాయిలు అందజేయడం, 150రోజుల పనిదినాలు కల్పించడం, పోడు భూములకు పట్టాలివ్వాలని, నాన్‌షెడ్యూల్డ్ గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఎస్ అప్పలస్వామి, పండయ్య, సీపీఎం మండల కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు.

ఆధునిక పద్ధతులతో దిగుబడులు
పాచిపెంట, డిసెంబర్ 13: వ్యవసాయంలో ఆదునిక పద్ధతులను అవలంభిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఏఓ బి గోవిందరావు తెలిపారు. మండలంలోని కూనంబందవలస గ్రామంలో అతికార కృష్ణ వరిపంటలో పంటలకోత ప్రయోగం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఓ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఫసల్ బీమాపథకం కింద 1001 రకం వరిని పండించామని, తమ సూచనల ప్రకారం ఎకరాకు 29బస్తాలు రైతు సాధించారన్నారు. ముఖ్యంగా నీటి యాజమాన్య పద్ధతులు, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో పంట దిగుబడులు బాగుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఇఓ శైలజ, ఎంపీఇఓ మనోజ్ పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటీకరణను రద్దుచేయాలి
రామభద్రపురం, డిసెంబర్ 13: ప్రభుత్వపాఠశాలలో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరణ చేసే యోచనను విరమించుకోవాలని సీపీఎం మండల కార్యదర్శి బలస శ్రీను డిమాండ్ చేశారు. ఈమేరకు గురువారం ఛలోకలెక్టర్ వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా మధ్యాహ్న భోజనపథకంపై ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారని, వారి పొట్టకొట్టేవిధంగా పథకాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు యోచించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీని వలన విద్యార్థులకు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉందన్నారు. దీనిపై ఈనెల 17న కలెక్టరేట్ ముట్టడి, 19న వంటల బంద్ కార్యక్రమాలను చేపట్టి తమనిరసన తెలపనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ధర్మారావు, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు గోపాలమ్మ, పార్వతి, బంగారులక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

మామిడిపంటలో సమగ్ర సస్యరక్షణ చేపట్టాలి
రామభద్రపురం, డిసెంబర్ 13: మామిడిపంటలో సమగ్ర సస్యరక్షణ, యాజమాన్య పద్ధతులను చేపట్టడం వలన మంచి దిగుబడులు సాధించవచ్చునని రైతు శిక్షణా కేంద్రం శాస్తవ్రేత్త ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మండల పరిధిలోని నాయుడువలస గ్రామంలో శుక్రవారం హార్టీకల్చర్ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణాతరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడిపంటలో పూత, పిందె దశలో తీసుకోవల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. సమగ్ర సస్యరక్షణ ఏవిధంగా చేపట్టాలో వివరించారు. మామిడిలో 3దపాలుగా పురుగుమందులను పిచికారి చేయాలన్నారు. అలాగే లింగాకర్షక బుట్టలను వినియోగించడం వలన పలురకాల తెగుళ్లును నివారించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో హార్టీకల్చర్ అధికారులు వెంకటరత్నం, ఎంపీఇఓలు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో
విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలి
కొమరాడ, డిసెంబర్ 13: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పరిశుభ్రంగా ఉండాలని మాదలింగి పిహెచ్‌సీ వైద్యాధికారి జి రాఘవేంద్రరావు అన్నారు. గురువారం కెమిశిల గిరిజన ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు వైద్యతనిఖీలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతోపాటు పరిసరాల పరిశుభ్రత, చేతులను శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఎంతైన ఉందన్నారు. ఈమేరకు 21మందికి తనిఖీలు చేసి ఉచితంగా మందులు అందించారు. వీరిలో అధికంగా రక్తహీనత, చర్మవ్యాధులు ఉన్నాయన్నారు. ఈయనవెంట వైద్యసిబ్బంది ఉన్నారు.

సభ్యత్వ నమోదు తప్పనిసరి
కొమరాడ, డిసెంబర్ 13: మండలంలో తెలుగుదేశంపార్టీ కార్యకర్త, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా సభ్యత్వనమోదు చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్సీ విజయరామరాజు అన్నారు. ఈమేరకు కొమరాడలో టీడీపీ కార్యకర్తలతో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 31గ్రామపంచాయతీల పరిధిలో గల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వనమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేయించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు నియోజకవర్గంలో 40వేల సభ్యత్వనమోదు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గం ఇన్‌ఛార్జి థాట్రాజ్, మండల కన్వీనర్ సుదర్శనరావు, తెలుగుయువత అధ్యక్షులు ఎన్ ఈశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు మదుసూధనరావు, తదితరులు పాల్గొన్నారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సాలూరు, డిసెంబర్ 13: పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ సంధ్యారాణి అన్నారు. గురువారం పట్టణంలోని 15వార్డు బంగారమ్మకాలనీలో వార్డుదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు సంధ్యారాణి పండ్లు, పసుపుకుంకుమలు అందించారు. ఈకార్యక్రమంలో కమిషనర్ ఎంఎం నాయుడు, అర్భన్ ఐసీడీఎస్ పీఓ విజయలక్ష్మిలు పాల్గొన్నారు.

హాస్టల్లో మెనూను సక్రమంగా అమలుచేయాలి
సాలూరు, డిసెంబర్ 13: బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో మెనూప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఎమ్మెల్సీ సంధ్యారాణి కోరారు. గురువారం బంగారమ్మకాలనీలోని ఎస్టీ బాలికల, బీసీ బాలుర హాస్టల్‌ను కమిషనర్‌తో కలిసి పరిశీలించారు. ఈమేరకు విద్యార్థుల సమస్యలను అడిగితెలుసుకున్నారు. బీసీ హాస్టల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. అనంతరం వంటకాలను పరిశీలించారు.

ఆర్యవైశ్యలకు ప్రత్యేక కార్పోరేషన్
* జిల్లా కార్యవర్గ సమావేశంలో కోలగట్ల
సాలూరు, డిసెంబర్ 13: రాష్ట్రంలోని ఆర్యవైశ్యలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం స్థానిక రామలీల కళ్యాణమండపంలో నిర్వహించిన ఆర్యవైశ్యసంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యలలో ఎక్కువగా నిరుపేదలే ఉన్నారని, వారిని ఆదుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆర్యవైశ్యలకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు వైసీపీ కట్టుబడి ఉందన్నారు. ఆర్యవైశ్యలలో రాజకీయచైతన్యం రావాలన్నారు. సామాజిక కార్యక్రమాలలోవారు ముందండాలన్నారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం జిల్లా ఉపాధ్యక్షునిగా గోపిశెట్టి నాగేశ్వరరావు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్సీ నాగేశ్వరరావుకు కండువావేశారు. సేవాదృక్పధంతోనే ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టానని నాగేశ్వరరావు తెలిపారు. అనంతరం పేద ఆర్యవైశ్యలకు నాగేశ్వరరావుసహకారంతో గ్రైండర్లు, ఫ్యాన్లు అందించారు. ఈకార్యక్రమంలో ఆర్యవైశ్యసంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
వాహన తనిఖీలు
గుమ్మలక్ష్మీపురం, డిసెంబర్ 13: ఎల్విన్‌పేట మూడు రోడ్ల కూడలి జంక్షన్‌లో ఎల్విన్‌పేట పోలీసుల ఆధ్వర్యంలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా పార్వతీపురం నుంచి గుమ్మలక్ష్మీపురం మీదుగా ఒరిస్సా వెళ్లే వాహనాలను, గుణుపూర్, బత్తిలి మీదుగా పార్వతీపురం వైపు వచ్చే వాహనాలను గురువారం తనిఖీ చేసి అనుమానితులను పలు ప్రశ్నలు వేసి సమాధానాలను రాబట్టారు. అదేవిధంగా ద్విచక్రవాహనాలను కూడా తనిఖీ చేసి లైసెన్స్, సీబుక్‌లు లేనివారికి అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపేవారు హెల్మ్‌ట్లును విధిగా ధరించాలన్నారు. ఈ తనిఖీలో కానిస్టేబుల్స్ శేఖర్, నాయుడు, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

17న రాష్ట్ర వ్యాప్త గిరిజన విద్యాసంస్థల బంద్
గరుగుబిల్లి, డిసెంబర్ 13: గిరిజన ప్రత్యేక డీఎస్సీని నిర్వహించకపోవడం పట్ల ఈనెల 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామని గిరిజన సంఘం నాయకులు అవినాస్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రమేష్, చంద్రమోహన్‌లు తెలిపారు. ఈమేరకు ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను గురువారం విడుదల చేశారు. గిరిజన యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో గిరిజన విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, డీఎస్పీని నిర్వహిస్తే కొంతవరకు నిరుద్యోగ సమస్య తగ్గుతుందన్నారు. అదేవిధంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాల్గవ తరగతి ఉద్యోగులను రెగ్యూలర్ ప్రాతిపధికన భర్తీచేయాలని, ఏజెన్సీలో పెరుగుతున్న సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 17న రాష్టవ్య్రాప్తంగా గిరిజన విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, గిరిజన సంఘం నాయకులు సహకరించాలని కోరారు.
పండిట్ ఉపాధ్యాయుల పోస్టుల
ఉన్నతీకరణకు ఉత్తర్వులు జారీ చేయాలి
* ఎపిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సదాశివరావు
విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 13: రాష్ట్రంలో పండిట్, పిఇటి పోస్టులను ఉన్నతీకరిస్తూ ప్రభుత్వం తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఎపిటిఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఎ.సదాశివరావుడిమాండ్ చేశారు. పట్టణంలో ఎపిటిఎఫ్ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయుల డ్రాయింగ్ అధికారాలను తగ్గిస్తూ విడుదల చేసి జీవోనెంబర్ 132ను రద్దు చేయాలన్నారు. ప్రధానోపాధ్యాయుల అధికారాల్లో కోత విధించడం సరైన పద్ధతి కాదని అన్నారు. జీవో నెంబర్ 610 ద్వారా వివిధ జిల్లాల్లో మిగిలిన ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలన్నారు. జిల్లా ప్రధానకార్యదర్శి జెసి రాజు మాట్లాడుతూ కమిటీలతో కాలయాపన చేయకుండా సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆదర్శపాఠశాలల సిబ్బందికి 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించి వారిని కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పరిగణించాలని కోరారు. గత నాలుగునెలలుగా బకాయి ఉన్న వీరి జీతాలను తక్షణమే చెల్లించాలన్నారు. ఎయిడెడ్ పాఠశాలల సిబ్బందికి