విజయనగరం

బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ పోస్టులకు దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, డిసెంబర్ 14: బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్ల పోస్టులకు ఆసక్తి గల మహిళా అభ్యర్థుల నుండి ఈనెల 17వ తేదీ సాయంత్రం 5గంటలలోగా తమ దరఖాస్తులు పార్వతీపురంలోని ఐటిడి ఎ కార్యాలయానికి అందించాలని పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో కోరారు. కొమరాడలో 7 పోస్టులు, కురుపాంలో 11పోస్టులు, గుమ్మలక్ష్మీపురంలో 17,జియ్యమ్మవలసలో 4పోస్టులు వంతున భర్తీకి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈపోస్టులకు దరఖాస్తు చేసినవారు 10వ తరగతి పాసై, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండి, స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం రావాలన్నారు. అలాగే వెలుగు మహిళా సంఘంలో సభ్యులయి ఉండాలన్నారు. గిరిజన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. దరఖాస్తు దారులు విద్యార్హత, కుల ధ్రువీకరణ, ఆధార్‌కార్డు, రేషన్ కార్డుల, పాస్‌పోర్టుసైజు ఫొటోలు రెండు,వెలుగు సభ్యత్వ ధ్రువపత్రంలు జతచేయాలని పీవో కోరారు. మరిన్ని వివరాలకు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. ఐటిడిఎ.సివోఎంకు సంప్రదించాలని పీవో కోరారు.
మెనూ సక్రమంగా అమలు చేయకపోతే చర్యలు
ఎఎస్‌డబ్ల్యువో పార్వతి హెచ్చరిక
పార్వతీపురం, డిసెంబర్ 14: సాంఘిక సంక్షేమ హాస్టళ్లల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని పార్వతీపురం సహాయ సాంఘిక సంక్షేమశాఖాధికారిణి బూరి పార్వతి హెచ్ డబ్ల్యువోలను ఆదేశించారు. శుక్రవారం పార్వతీపురం ఎఎస్‌డబ్ల్యువో కార్యాలయంలో తన పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజన వసతులు, అల్పాహారం కల్పించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పదవతగరతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థుల విద్యపై ప్రత్యేక శ్రద్ధతీసుకుని శతశాతం ఫలితాల సాధనకు కృషి చేయాలన్నారు. హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ ఓవర్‌సీన్ విద్యోన్నతి పథకంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి పలు కళాశాలలకు వెళ్లి విదేశీ విద్యకు ప్రభుత్వం కల్పిస్తున్న రూ.15లక్షల ప్రోత్సహాన్ని గురించి వివరించాలన్నారు.

మాతా,శిశు సంరక్షణకు ఉమ్మడి బాధ్యత తీసుకోవాలి
ఐటిడిఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశాలు
పార్వతీపురం, డిసెంబర్ 14: సబ్‌ప్లాన్ పరిధిలోని మాతా,శిశు సంరక్షణకు ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటిడి ఎ పరిధిలోని వైకె ఎంలోగల యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో ఎ ఎన్ ఎం, ఆశా, అంగన్‌వాడీ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సక్రమంగా పిల్లలకు, గర్భిణీలకు పోషకాహారం అందించే విధంగా చూడాలని, సక్రమంగా పౌష్టికాహారం అందించే విధంగా తగిన పర్యవేక్షణ బాధ్యతలు ఐసిడియస్ పీవో,పర్యవేక్షకులు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రక్తహీనత వంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని, వ్యాధి నిరోధక టీకాలు వంటి వాటితో పాటు గర్భిణీలను సకాలంలో ఆసుపత్రులకు తరలించి వారికి సక్రమంగా వైద్య సహాయం అందించే చర్యలు ఎ ఎన్ ఎంలు తీసుకోవాలని పీవో ఆదేశించారు. గ్రామాల్లో ఆశావర్కర్లు గర్భిణీల ఆరోగ్యం పట్ల సమాచారం తెలుసుకుని ఆయాప్రాధమిక ఆరోగ్యకేంద్రాలకు తీసుకువెళ్లి వైద్యసహాయం అందించేలా చూడాలన్నారు. ఈవిధంగా ఆయాశాఖల ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని మాతా,శిశుసంక్షరణ గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటిడి ఎ డిప్యూటీ డి ఎంహెచ్ ఒ డాక్టర్ ఎం ఎం రవికుమార్‌రెడ్డి, డాక్టర్ కృష్ణంరాజు, ఐసిడి ఎస్ పీవో విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు
పెన్నులు, పుస్తకాల పంపిణీ
బొబ్బిలి(రూరల్), డిసెంబర్ 14: విద్యార్థులకు పంపిణీ చేస్తున్న పుస్తకాలు, పెన్నలను సద్వినియోగం చేసుకోవాలని అభిమాని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి రాజగోపాలనాయుడు కోరారు. మండలం సిహెచ్ బొడ్డవలస పాఠశాలలో 80మంది విద్యార్థులకు శుక్రవారం వీటిని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల పిల్లలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. బొబ్బిలి గ్రూపుఅడ్మిన్ చింతాడ గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వపాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పూర్తిస్థాయిలో సహాయ సహాకారాలు అందిస్తామన్నారు.
విలువలతో
కూడిన విద్యను అందించాలి
బొబ్బిలి(రూరల్), డిసెంబర్ 14: విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని మండల విద్యాశాఖాదికారి సిహెచ్ లక్ష్మణరావు కోరారు. మండలం కృష్ణాపురం పాఠశాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలకు ఉపాధ్యాయులు సక్రమంగా విదులకు హాజరై విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతలు నిర్వహించి వారిని 3ఏ2గ్రేడ్‌లోకి తీసుకురావాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సక్రమంగా అమలుచేయాలన్నారు.
తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
గరుగుబిల్లి, డిసెంబర్ 14: అల్పపీడనం దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల తహశీల్దార్ డి ఎల్లారావు అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు ఈనెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా మోస్తర్ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈమేరకు రైతులు పంట పొలాల్లోని పంటలను కుప్పలుగా వేసుకోవాలన్నారు. అదేవిధంగా తుఫాన్ అనంతరం వరి నూర్పులు చేపట్టాలని తెలియజేశారు. తుఫాన్ కారణంగా మండల పరిధిలోని ఆయాగ్రామాల రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.

గ్రామాల్లోని సమస్యలను తెలియజేయాలి
గరుగుబిల్లి, డిసెంబర్ 14: గ్రామాల్లోని సమస్యలను ప్రజలు తెలియజేస్తే పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని మండల పరిధిలోని శివ్వాం గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి కె రాహుల్ అన్నారు. మండల పరిధిలోని శివ్వాం గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్‌డబ్ల్యు ఎస్‌శాఖ ద్వారా చేపడుతున్న పనుల గురించి సమావేశంలో వివరించారు. మండల ప్రత్యేక అధికారి ఎస్‌వి రమణమూర్తి మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న గ్రామదర్శిని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదేవిధంగా ప్రజలు తెలియజేసిన సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ డి ఎల్లారావు, ఎంపీడీఓ జి పార్వతి, ఇఓపీఆర్‌డీ ఎంవి గోపాలకృష్ణ, ఎంఇఓ నాగభూషణరావు, ఏఇ సిహెచ్ అంబేద్కర్, ఉపాధి ఏపీఓ రామకృష్ణనాయుడు, తదితరులు పాల్గొన్నారు.