విజయనగరం

దేవుపల్లిలో స్వచ్చ సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, డిసెంబర్ 14: మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఎంపిడివొ ఎం.ప్రకాశరావు ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్చ సంక్రాంతి చేపట్టారు. జిల్లా పరిషత్ సి ఇవొ ఆదేశాలు మేరకు గ్రామంలో గల చెత్త కుప్పలను, పెంటలను కార్యదర్శులు శ్రమదానం చేసి తొలగించారు. గ్రామ కార్యదర్శులు చెత్తకప్పలను గుర్తించి తొలగించే విధానాన్ని ప్రయోగత్మాకంగా చేసే బాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పలువురు కార్యదర్శులు పాల్గొన్నారు.
నీరు-చెట్టు నాయకులకు- ఉపాధి హామీ ప్రజలకి
జామి, డిసెంబర్ 14: నీరు-చెట్టు నిధులు నాయకులకి, ఉపాధి హామీ పనుల నిధులు ప్రజలకు పంచిపెడుతూ రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేశారని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టిబాబ్జీ అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన జామిలో విలేఖరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన సభలు, సమావేశాలు, సన్మానాలతో గడిపివేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అన్నారు. ప్రాంతాల వారీగా ఆయా ఏరియాల్లో ఉన్న ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీ పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడంలో విఫలమవుతున్నారని అన్నారు. చోడవరం చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి ఆ ఏరియా ఎమ్మెల్యే పీలా గోవింద్ ముఖ్యమంత్రితో మాట్లాడి 33కోట్లు నిధులు సమకూర్చగలిగితే భీమసింగి ఫ్యాక్టరీ పరిధిలో గల ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నప్పటికీ ఫ్యాక్టరీని ఆదుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విజయనగరం జిల్లాకు వచ్చినపుడు పది హామీలు ఇచ్చారని నాలుగున్నరేళ్ళ కాలం గడుపుతున్నా అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ధర్మపోరాట దీక్ష చేసినపుడు జిల్లాలో 26 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించారని, నేటికీ వాటి కార్యాచరణ జరగలేదని అన్నారు. 2017-18 రాబోయే 19సంవత్సరం నాటికి కూడా ఖరీఫ్ రబీ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని అన్నారు. అయినప్పటికీ రైతులను ఆదుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదని చెప్పారు. మొక్కజొన్నకు మద్దతు ధర లేదని, వరిపంట పూర్తిగా పండలేదని, చెరకు ఎండుతోందని అన్నారు. జిల్లాలో తాటిపూడి, పెద్దగెడ్డ, జంఝావతి, తోటపల్లి ఎండిపోయాయని తెలిపారు. వీటికిప్రత్యామ్నాయంగా అధికారులు, నాయకులు ఎటువంటి ఆలోచనలు చేయలేదని అన్నారు. ఇటువంటి పరిస్థితులతో జిల్లాలో ప్రజలు బయానక వాతావరణంలో అభద్రతా భావంతో జీవిస్తున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.

పోలీసుల చొరవతో ఎట్టకేలకు తీరిన ట్రాఫిక్ సమస్య
జామి, డిసెంబర్ 14: మండల కేంద్రమైన జామి బస్ స్టాండు వద్ద ఎట్టకేలకు ట్రాఫిక్ సమస్య పోలీసుల చొరవతో నెరవేరింది. ఈ ప్రాంతంలో డైలీమార్కెట్‌ను గత కొనే్నళ్ళుగా నిర్వహిస్తున్నారు. దీని కారణంగా బస్‌స్టాండ్ నుండి ఉదయం 6.30 గంటల ప్రాంతం నుండి 9.30గంటల వరకు ట్రాఫిక్‌కు అంతరాయం వాటిల్లడంతో ప్రయాణీకులు, వాహనచోదకులు నానా అవస్థలు పడేవారు. ఈ మార్కెట్ రోజురోజుకు అభివృద్ధి చెందడంతో మరింత ట్రాఫిక్ పెరిగిపోయింది. దీంతో కొంతమంది ప్రయాణీకులు, వాహన చోదకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జామి ఎస్సై చంద్రశేఖర్ ఎట్టకేలకు చొరవ తీసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో పడ్డారు. సుమారు రెండు రోజులుపాటు రోడ్డుపై వాహనాలు నిలుపకుండా వ్యాపారాలు చేయనీయకుండా నియంత్రించారు. గురువారం నిర్వహించే వారపుసంత ప్రదేశంలో బజారుసెంటర్ వద్ద మరికొద్దిరోజులు ఈ డైలీ మార్కెట్‌ను కూడా నిర్వహించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గతంలో వారపుసంతను నిర్వహించే ప్రదేశంలో ఆప్రదేశాన్ని మెరుగుపరచి అక్కడే డైలీ మార్కెట్‌ను నిర్వహించుకోవాలని రైతులకు సూచించారు.

జామి అగ్రహారం భూముల
రైతుల సమస్యలు పరిష్కరించాలి
జామి, డిసెంబర్ 14: మండల కేంద్రమైన జామిలో ఉన్న 2,200 ఎకరాలు అగ్రహారం భూముల రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని జెసి సీతారామారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన రైతులు జెసిని కలసి తమ సమస్యలను విన్నవించారు. ఎన్నో ఏళ్ళగా తాతముత్తాతల నుండి సాగుచేస్తూ వస్తున్న తమ భూములపై తమకు హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మండల కేంద్రంలో 2,200 ఎకరాలు అగ్రహారం భూములు ఉన్నాయని, వీటిలో సుమారు 1300 ఎకరాల్లో సర్వే నిర్వహించి రైతులను గుర్తించారని చెప్పారు. మిగిలిన 900 ఎకరాల్లో త్వరతగతిలో సర్వే పూర్తిచేసి పట్టాదారు పాస్-పుస్తకాలు అందజేయాలని జెసికి విజ్ఞప్తి చేశారు. మండలంలోని పక్క గ్రామమైన మోకాసాకొత్తవలసలో ఉన్న ఇనాం భూములకు సర్వే నిర్వహించి రైతులకు పట్టాలు అందజేస్తామని జెసికి రైతులు గుర్తు చేశారు. దీంతో జెసి స్పందిస్తూ అదేవిధంగా జామి అగ్రహారం రైతులు కూడా పాస్-పుస్తకాలు అందించేలా చర్యలు తీసుకోవాలని జామి తహశీల్దార్ భాస్కరరావును ఆదేశించారు. కార్య క్రమంలో వైసీపీ నాయకులు నెక్కలి సత్యనారాయణ, తదితర రైతులు, అధికారులు ఉన్నారు.