విజయనగరం

ఆదరణలో రైతులకు గడ్డి కటింగ్ యంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 14: ఆదరణ-2లో రైతులు కోసం పచ్చగడ్డిని కటింగ్ చేసే యంత్రాలు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు కటింగ్ యంత్రాలు స్ధానిక ఆండ్ర ప్రాజెక్టు కార్యాలయం వద్ద రైతులకు అవగాహన కల్పించేందుకుగాను సిద్ధంగా ఉంచారు. పాడి పశువులు ఎక్కువగా ఉన్న రైతులు పచ్చగడ్డిని ముక్కలుగా కత్తిరించేందుకు అవసరమైన కటింగ్ యంత్రాన్ని ఆదరణ-2లో ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. కావాల్సిన రైతులు మీ సేవాకేంద్రాలలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి రైతువాటాగా పదిశాతం మొత్తాన్ని డిడి తీసి అధికారులకు సమర్పించాలని అధికారులు తెలిపారు.
బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌గా దేవర
గజపతినగరం, డిసెంబర్ 14: భారతీయ జనతా పార్టీ గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్‌గా దేవర ఈశ్వరరావును నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం దేవర రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. గత 14 సంవత్సరాలనుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని చెప్పారు. అందరిని కలుపుకొని పార్టీకి సేవలు అందిస్తానని అన్నారు. నియోజకవర్గ కన్వీనర్‌గా నియమించినందుకు రాష్ట్ర పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణకు, జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, పాకలపాటి సన్యాసిరాజుకు, పార్టీ ఇన్‌చార్జి కృష్ణారెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

మానవ జీవన మనుగడకు యోగా అవసరం
గజపతినగరం, డిసెంబర్ 14: మానవ జీవన మనుగడకు యోగా, ధ్యానం ఎంతో అవసరమని ప్రముఖ యోగా గురువు పిల్లా సీతారాం అన్నారు. శుక్రవారం స్ధానిక కల్క్భీగవాన్ ధ్యానమందిరంలో ప్రతినిత్యం జరుగుతున్న యోగశిక్షణ 150రోజు పూర్తి చేసుకొన్న సందర్భంగా అందరికీయోగా అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొల్గొన్న సీతారాం మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు అందరూ యోగా విద్యను నేర్చుకొని శారీరక, మానసిక రుగ్మతలకు దూరం కావాలని అన్నారు. ధ్యానంలో వివిధ ప్రక్రియను గూర్చి వివరించారు. యోగా శిక్షకులు శీర వాసుదేవరావు మాట్లాడుతూ ప్రతినిత్యం కొనసాగుతున్న ఉచితయోగా శిక్షణను నగరవాసులు సద్వినియోగం పరచుకోవాలని కోరారు. అనంతరం యోగా గురువు సీతారాంను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రతినిత్యం యోగాశిక్షణ ( ఉచిత) కు హాజరైన సాధకులు తదితరులు పాల్గొన్నారు.

చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు
గజపతినగరం, డిసెంబర్ 14: మండలంలోని జిన్నాం గ్రామంలో గల ప్రాధమిక పాఠాశాలలో శుక్రవారం శ్రీవాసవి సేవాదళం బండారు బాలానంద సంఘం సంయుక్తంగా చిన్నారులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. చిత్రలేఖనం పోటీలో బాణాల కృష్ణ, కడగల ప్రసాద్, బంకపల్లి ప్రసాద్, ఇజ్జురోతు దివ్య, పిన్నింటి రేవతి, విజేతలుగా నిలిచారు. వీరందరికి పుస్తకాలు, ప్రశంసాపత్రాలు, మెడల్స్, బ్యాడ్జీలు బండారు చిన్నరామారావు అందజేశారు. కార్యక్రమ నిర్వహరణకు సహకరించిన ప్రధానోపాధ్యాయులు వరదా అప్పలరాజు, ఉపాధ్యాయులు పాపారావు, దుర్గాబాలాజీలకు చినరామారావు కృతజ్ఞతలు తెలిపారు. బహుమతుల ప్రధానం తరువాత బాలల గేయాలతో అలరించారు. బాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న బండారు సేవలను హెచ్ ఎం అప్పలరాజు కొనియాడారు.

గ్రామదర్శిని అందరు వినియోగించుకోవాలి
గజపతినగరం, డిసెంబర్ 14: గ్రామదర్శిని-గ్రామవికాసం ప్రజలకొరకు నిర్వహించబడుతున్నదని దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాలని మండల ప్రత్యేక అధికారి ఎస్.వెంకటరావుఅన్నారు. శుక్రవారం మండలంలోని గ్రహపతిఅగ్రహారం గ్రామంలో శుక్రవారం గ్రామదర్శిని కార్యక్రమం జరిగింది. తొలుత గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని, పాఠశాలను అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం జరిగిన సమావేశంలో ప్రత్యేక అధికారి వెంకటరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలను తెలపాలని తద్వారా అధికారులు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకుంటారన్నారు. అయితే గ్రామాలలోనికి వచ్చే అధికారులకు ప్రజల సహకారం అందించాలని కోరారు. ఎంపిడివొ ఎం.ప్రకాశరావు మాట్లాడుతూ నేరుగా గ్రామాలకు అధికారులు వస్తున్నారని అయితే ప్రజలు సామాజిక సమస్యలను తెలియపరచాలన్నారు. కార్యక్రమంలో ఇవొపి ఆర్‌డి రవికుమార్, మండల విద్యాశాఖ అధికారి కూనిబిల్లి సింహాచలం, ఎపివొ రవిబాబు, తదితరులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదంలో రెండు లక్షలు ఆస్తినష్టం
బొండపల్లి, డిసెంబర్ 14: బొండపల్లి ఎస్సీ కాలనీలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు ఇళ్లు దగ్ధం కాగా సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగిందని రెవెన్యూ అధికారుల అంచనా. గ్రామానికి చెందిన గొండేల గౌరి, వెలుగు కృష్ణమ్మలకు చెందిన తాటాకు మిద్దెళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద విషయాన్ని తెలుసుకొన్న గజపతినగరం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఇంటిలో ఉన్న వస్తువులు బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. గొండేల గౌరి పిల్లలకు చెందిన పది, ఇంటర్ దృవపత్రాలు అగ్నికి ఆహుతయ్యాయని కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఆర్.ఐ సత్యనారాయణ సంఘటనా స్ధలానికి చేరుకొని జరిగిన నష్టాన్ని అంచనావేశారు. కార్యక్రమంలో ఎంపిటిసి శ్రీనివాసరావు, వర్రి సన్యాసిరావు, బొండపల్లి బుచ్చిబాబు వి ఆర్వో గణపతి తదితరులు పాల్గొన్నారు.

స్వచ్చ సంక్రాంతిని విజయవంతం చేయాలి
గజపతినగరం, డిసెంబర్ 14: గ్రామాలలో వారంరోజులపాటు నిర్వహించనున్న స్వచ్చ సంక్రాంతి కార్యక్రమం విజయవంతం చేయాలని గజపతినగరం ఇన్‌చార్జి ఎంపిడివొ జి.జనార్ధనరావు ఆదేశించారు. శుక్రవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 15వతేది నుంచి 22వరకు గ్రామాలలో ఎటువంటి చెత్తాచెదారాలు లేకుండా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ముందుగా శనివారం గజపతినగరంలో ప్రయోగత్మాకంగా చేపడతామని, కార్యదర్శులు అవగాహన చేసుకోవాలని అన్నారు. ఈనెల 17నుంచి 22వరకు అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. స్వచ్చ సంక్రాంతిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఉపాధి హామీ పధకం ఏపివొ కృష్ణవేణి, ఆర్ డబ్ల్యు ఎస్ జె ఇ దుర్గ్భావాని, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.