విజయనగరం

కెవిబివి పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, డిసెంబర్ 15: కెవిజిబి పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. శనివారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలో ఐటిడి ఎ పరిధిలోని కెజిబిబి పాఠశాలల ప్రత్యేకాధికారులతో పీవో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో మెనూ, పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంటున్నాయన్న సమాచారం ఉందని, వీటిని తక్షణమే మెరుగుపరచుకోకుంటే తగు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే పదవతరగతి పరీక్షల్లో శతశాతం ఫలితాలు సాధించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తగరతులు నిర్వహించాలని, అవసరమైతే జిల్లాపరిషత్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లను రప్పించి విద్యానైపుణ్యాలను గురించి విద్యార్థులకు తెలపాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ పెద్దింటి కిరణ్‌కుమార్, జిసిసి డి ఎం భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు సేవలు శ్లాఘనీయం
పార్వతీపురం, డిసెంబర్ 15: పొట్టి శ్రీరాములు చేసిన సేవలు ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరని ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. శనివారం స్థానిక ఐటిడి ఎ కార్యాలయంలోని గిరిమిత్ర సమావేశం హాలులో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా రెండు నిమిషాలు ఆయన ఆత్మకుశాంతి చేకూరాలని శ్లాఘించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి ఎ.సురేష్‌కుమార్, జిల్లాగిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ పెద్దింటి కిరణ్‌కుమార్, డిప్యూటీ డి ఇవో సత్యనారాయణ, మేనేజర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు సేవలు శ్లాఘనీయం
పార్వతీపురం, డిసెంబర్ 15: పొట్టి శ్రీరాములు చేసిన సేవలు శ్లాఘనీయమని పార్వతీపురం సబ్‌కలెక్టర్ టి ఎస్ చేతన్ పేర్కొన్నారు. శనివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు వంటి వారు దేశానికి చేసిన సేవలు మరువరానివన్నారు. ఈకార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎ.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌కు మళ్లించడానికి చర్యలు తీసుకోవాలి
పార్వతీపురం, డిసెంబర్ 15: పార్వతీపురం పట్టణంలోని ట్రాఫిక్ రద్దీ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా భారీ వాహనాలను వేరే రహదారి మీదుగా మళ్లించే చర్యలు తీసుకోవాలని పార్వతీపురం సబ్‌కలెక్టర్ టి ఎస్ చేతన్ అధికారులకు ఆదేశించారు. శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్ అండ్ బి, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ వాహనాలు పార్వతీపురం పట్టణం మీదుగా వెళ్లడం వల్ల పాదాచారులు, ద్విచక్రవాహదారులు, ఇతర బస్సులు, ఆటోలు వంటి వాహనాలను నడపడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. భారీ వాహనాల కారణంగా ఇరుకైన రోడ్డులో ప్రమాదాలకు నెలవుగా మరుతుందని తన దృష్టికి వచ్చిందని సబ్‌కలెక్టర్ తెలిపారు. అందువల్ల భారీ వాహనాలను రామభద్రపురం నుండి సాలూరు బైపాస్ మీదుగా తరలించే ప్రక్రియ చేపట్టాలని, అలాగే రాయగడ నుండి వాహనాలు పాలకొండ మీదుగా తరలించే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా భారీ వాహనాల కారణంగా సీతానగరం నదిపై ఉండే బ్రిడ్జి కూడా చాలా పురాతనమైనది కావడంతో ప్రమాదపుటంచున ఉన్నందున భారీ వాహనాలను ఈబ్రిడ్జి మీదుగా రాకుండా అడ్డుకోవాలని కూడా పలువురు కోరుతున్నందున ఆదిశగా చర్యలు కూడా ఇందుకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. ఈబ్రిడ్జి మీదుగా ఓవర్‌లోడుతో వస్తున్న వాహనాలు ఒడిసా ఇతర ప్రాంతాలకు నిత్యం వందల కొలది వెళ్లడం బ్రిడ్జి పరిస్థితి కూడా బలహీనంగా ఉండడం వల్ల దీనిపై భారీవాహనాలను అడ్డుకోవాల్సిన ఆవశ్యకతపై తనకు వినతులు అందాయని సబ్‌కలెక్టర్ తెలిపారు. అందువల్ల ఇటు పార్వతీపురం ట్రాఫిక్ సమస్యలు, మరోపక్క సీతానగరం బ్రిడ్జి పరిస్థితి దృష్ట్యా భారీ వాహనాలను మళ్లించాలని సూచించారు. దీనిపై మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి చర్యలు వేగవంతం చేయాలని సబ్‌కలెక్టర్ అన్నారు. ఈసమావేశంలో పార్వతీపురం ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు బాల సుందరబాబు, పార్వతీపురం పట్టణ ఎస్ ఐ యు.మహేష్, సీతానగరం ఎస్ ఐ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.