విజయనగరం

మధ్యాహ్న భోజనాన్ని పాతపద్దతిలో నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, డిసెంబర్ 15: మధ్యాహ్న భోజన పథకాన్ని పాతపద్ధతిలో నిర్వహించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ అన్నారు. శనివారం ఆయన నెల్లిమర్ల ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాల క్రిందట టీడీపీ ప్రభుత్వమే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు పేద కుటుంబాలకు చెందినవారని, వారికి పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అలాగే ఈ పథకాన్ని నిర్వహించడానికి డ్వాక్రా సంఘాలకు అప్పజెప్పిందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం మాట మార్చి ఈ పథకాన్ని డ్వాక్రా సంఘాలు సక్రమంగా నిర్వహించలేకపోతున్నాయని, ఇపుడు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పజెప్పడం ఎంతవరకు సమంజసమని అన్నారు. ఈ పథకాన్ని జిల్లాలో అమలు చేయడానికి ఫైలెట్ ప్రాజెక్టుగా నెల్లిమర్ల, విజయనగరం, డెంకాడ మండలాలకు మధ్యాహ్న భోజనం సరఫరా చేయడానికి నవప్రయాస్ సంస్థకు అప్పజెప్పిందని అన్నారు. అయితే ఈ పథకం ప్రారంభమై మూడు రోజులు అవుతుందని, ఉడకని అన్నం, పల్చని పప్పు సరఫరా చేస్తున్నదని చెప్పారు. గతంలో వంటమ్మలు సమయపాలనలో భోజనం అందించడంతోపాటు వేడి పదార్థాలు పిల్లలకు పెట్టేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే మెనూ కూడా సక్రమంగా నిర్వహించడంలేదని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించ వద్దు అని ఈ నెల 16,17తేదీలలో జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద రిలే దీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 19న ఈ పథకం జిల్లాలోని ఇతర పాఠశాలల్లో వంట బంద్ కార్యక్రమం నిర్వహిస్తామని, అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సమావేశంలో సి ఐటియు మండల నాయకులు కిల్లంపల్లిరామారావు, మధ్యాహ్న భోజనం కార్మికులు గౌరీ, పార్వతిలు పాల్గొన్నారు.

ఎండిఎంను పరిశీలించిన డిఇవొ
నెల్లిమర్ల, డిసెంబర్ 15: నవప్రయాస్ ద్వారా అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని డిఇవొ నాగమణి పరిశీలించారు. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో డిఇవొ నాగమణి వంటలు మధ్యాహ్న భోజన వంటలను రుచి చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. అలాగే సమయానికి భోజనం అందించడంతోపాటు రుచికరమైన పద్దార్థాలు విద్యార్థులకు అందించాలని కోరారు. అలాగే మెనూ సక్రమంగా పాటించాలని ఆదేశించారు. గత రెండు రోజులు కన్నా నేడు భోజనం మెరుగ్గా ఉందని అన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిఇవొ వెంట ఎం ఇవొ అంబళ్ల కృష్ణారావుఉన్నారు.
శతశాతం ఫలితాలు సాధించాలి
పార్వతీపురం, డిసెంబర్ 15: త్వరలో నిర్వహించనున్న పదవతరగతి పరీక్షా ఫలితాల్లో శతశాతం ఫలితాలు సాధించాలని పార్వతీపురం ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ గిరిజన సంక్షేమశాఖ ఉన్నత పాఠశాలల హెచ్ ఎంలను ఆదేశించారు. శనివారం స్థానిక ఐటిడి ఎ గిరిమిత్ర సమావేశం హాలులో ఏర్పాటు చేసిన జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలల హెచ్ ఎంలు, ఎటిడబ్ల్యువ్లోల సమావేశంలో మాట్లాడుతూ పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులకు మరింత విద్యానైపుణ్యాలు పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారిలో సబ్జెక్టులో మంచి పట్టు సాధించే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ద వహించాలని, ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న భోజన వసతులు సక్రమంగా ఉండే విధంగా చూడాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ పెద్దింటి కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు హెచ్ ఎంలు, ఎటిడబ్ల్యువోలు పాల్గొన్నారు.