విజయనగరం

జగ్జీవన్ జ్యోతిని వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, డిసెంబర్ 15: ఎస్సీ లబ్ధిదారులకు అందిస్తున్న జగ్జీవన్ జ్యోతి పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిణి పి.రత్నం కోరారు. శనివారం గజపతినగరంలోని ఎస్సీ కాలనీలో జగ్జీజీవన్ పధకంపై ఎస్సీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగ్జీవన్ పధకం ద్వారా వంద యూనియట్లు వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నదని తెలిపారు. ఈ పధకంపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అయితే 125యూనిట్లు వినయోగిస్తే 25 యూనిట్లు మాత్రమే బిల్లు చెల్లించాలని చెప్పారు. అదే విధంగా 125యూనిట్లు దాటిన విద్యుత్ వినయోగదారులు మొత్తం బిల్లులు చెల్లించవలసి ఉంటుందని అన్నారు. ఈ పధకం గురించి ప్రతి ఒక్క ఎస్సీ లబ్ధిదారునికి తెలిసేవిధంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సహాయ సాంఘిక సంక్షేమాధికారి బి.రామానందం, గజపతినగరం వసతిగృహ సంక్షేమాధికారులు డి.రాధామణి, అప్పలనాయుడు, మీనాక్షి, అనూరాధ తదితరులు పాల్గొన్నారు.

దళారీవ్యవస్ధ నిర్మూలనకు కేంద్రాలు దోహదం
* ఎమ్యెల్యే నాయుడు
గజపతినగరం, డిసెంబర్ 15: దళారీవ్యవస్ధ నిర్మూలనకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు దోహదపడతాయని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ. నాయుడు అన్నారు. శనివారం గజపతినగరంలోని ప్రాధమిక సహకార వ్యవసాయ పరపతి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతి ఏడాది పండించిన పంటలకు గిట్టుబాటుధర లేక దళారీలపాలు అవుతున్నందున టీడీపీ గత ఐదేళ్లనుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి అండగా ఉంటుందన్నారు. అన్నదాతలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికాభివృద్ధి చెందాలని కోరారు. ప్రస్తుతం తుపాన్ ప్రభావం ఉన్నందున ధాన్యం కొనుగోలును రేయిబళ్లు సేకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, సొసైటీ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావిశ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, బుద్ధరాజు రామ్‌జీ, సి ఇవొ డి.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు విద్యతోపాటు వైజ్ఞానికత పెంపొందించాలి
* జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి
బొండపల్లి, డిసెంబర్ 15: విద్యార్థులకు విద్యతోపాటు వైజ్ఞానికతను పెంపొందించాలని జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి అన్నారు. శనివారం స్థానిక మండల వనరుల కేంద్రం ఆవరణలో మండల విద్యాశాఖాధికారి కూనిబిల్లి సింహాచలం ఆధ్వర్యంలో మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో చిన్నతనం నుంచే విద్యతోపాటు వైజ్ఞానాన్ని కూడా అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వం తీర్చిదిద్దుతుందని, ఉపాద్యాయులు పిల్లల విద్యాసామర్థ్యాల పెంపుకు మరింత కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది జిల్లాలో 2,820 ప్రాథమిక పాఠశాలల్లో 9,750మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం సంతోషదాయకమని అన్నారు. జిల్లాలో మండల స్థాయిలో ప్రథమంగా బొండపల్లి ఎం ఇవొ సింహాచలం ఇటువంటి ప్రదర్శన ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి ఎం.కొత్తవలసకు చెందిన కె.లిఖిత, ద్వితీయ బహుమతి కె. అనీల్ కుమార్, తృతీయ బహుమతి బి.రాజేరు పాఠశాలకు చెందిన పి.సూర్యకిరణ్‌లు సాధించారు. మండలంలో 23పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలు ఆవిష్కరించారు. బి.రాజేరు ఎంపిపి పాఠశాలకు చెందిన రెండవ తరగతి విద్యార్థి టి.సూర్యకిరణ్ ప్రదర్శించిన దంత సంరక్షణ ఆవశ్యకతపైనా, ఎం.కొత్తవలస పాఠశాలకు చెందిన కె.లిఖిత చెత్త నుంచి సంపద కేంద్రం నిర్వహణ ఆవశ్యకతను తెలుసుకుని విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో బొండపల్లి, అంబటవలస ఉన్నత పాఠశాలల ప్రధానోపాద్యాయులు సన్యాసిరాజు, సూర్యారావులతోపాటు జడ్పీటీసీ బండారు బాలాజీ, ఎంపీడీవొ ఎం.ప్రకాశరావు వివిధ పాఠశాలల ఉపాద్యాయులు పాల్గొన్నారు.

రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు గరివిడి విద్యార్థిని
గరివిడి, డిసెంబర్ 15: రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీల్లో ఆడేందుకు గరివిడి శ్రీదుర్గాప్రసాద్ షరాఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థిని ఎ. అశ్విని ఎంపికైందని ప్రిన్సిపాల్ కె.చంద్రవౌళి పట్నాయిక్, వ్యాయామ ఉపాద్యాయుడు శ్రీనివాసరావుశనివారం తెలిపారు. కృష్ణాజిల్లా గుణదలలో ఈ నెల 16,17తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలలో ఆడేందుకు అశ్వని ఎంపికైందని జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడికి సమాచారం అందిందని చెప్పారు. రాష్ట్ర స్థాయి త్రోబాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని అశ్వనిని ప్రిన్సిపాల్ చంద్రవౌళి పట్నాయిక్, వ్యాయామ ఉపాద్యాయులు శ్రీనివాసరావు, అద్యాపక సిబ్బంది అభినందించారు.