విజయనగరం

పట్టణంలో తాగునీటికి కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, డిసెంబర్ 15: జిల్లా కేంద్రంలో మంచినీటికి ఇబ్బందులు తలెత్తినా దానిని పరిష్కరించలేకపోయారని బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోదర్ విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో దాదాపు మూడు లక్షల మంది జనాభా ఉండగా కేవలం లక్ష మందికి మాత్రమే నీటిని సరఫరా చేయగలుగుతున్నారని అన్నారు. ఇక పారిశుద్ధ్యం పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉందన్నారు. నేరాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తుందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ పోటీ చేసిన బెనారస్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిగా పనిచేసి అక్కడ ప్రధాని గెలుపొందడంలో సునీల్ దియోదర్ కీలకపాత్ర పోషించారన్నారు. అలాగే త్రిపురలో 2శాతం ఓట్లు ఉన్న బీజేపీకి అక్కడ మూడింట రెండు వంతుల మెజార్టీ రావడంలో ఆయన కీలకపాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి సహ ఇన్‌ఛార్జిగా ఉంటూ రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి, జాతీయ ఎస్సీ మోర్చా అధ్యక్షులు నిమ్మక జయరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.శివప్రసాద్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చిరెడ్డి, బీజేపీ నేతలు లక్ష్మినరసింహం, బూర జగ్గారావు, శంకర్‌లాల్ శర్మ, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతిలో అగ్రగణ్యుడు చంద్రబాబు
* రెండుఫ్యాన్లు, ఒక బల్బులను దోచుకున్న చంద్రబాబు
* బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్ విమర్శ
గజపతినగరం, డిసెంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవినీతిలో అగ్రగణ్యుడుగా పేరు సంపాదించుకున్నాడని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ ఆరోపించారు. శనివారం మండలంలోని మధుపాడ గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే గజపతినగరంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ప్రజలకు మూడు ఎల్ ఇడిలు, రెండు ఫ్యాన్లు అందజేస్తే ఆంధ్రాలో మాత్రం చంద్రబాబు రెండుబల్బులు ఇచ్చి మిగిలినవి దోచుకున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి అవాస్‌యోజన పధకం ద్వారా కేంద్ర ప్రభుత్వం గృహాల లబ్ధిదారులకు లక్షా యాభై వేలువంతున నిధులను మంజూరు చేస్తే టీడీపీ నాయకులు లంచాలపేరుతో 50వేలు లబ్థిదారుల నుండి గుంజుతున్నారని అన్నారు. అలాగే గ్రామాలలో సిసి రహదారులు నిర్మాణాల కోసం కేంద్రం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం నుండి నిధులు విడుదల చేస్తుండగా చంద్రన్నబాట పేరుపెట్టి రాష్ట్రం తన ప్రచారానికి వాడుకుంటుందన్నారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు వేతనాలు కేంద్రమే చెల్లిస్తుండగా రాష్టం ఇస్తున్నట్లుగా ఆర్భాటం చేస్తుందన్నారు. అలాగే ఉపాధి హామీ పధకం కింద కేంద్రం మంజూరు చేస్తున్న నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తుందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సంబందించి ఎయిర్‌పోర్టు అధారిటీ నిర్మించడానికి ముందుకురాగా రాష్ట్రం తన స్వప్రయోజనాలు కోసం ప్రైవేటు సంస్ధకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు దొంగలుగా మారి మారి లబ్ధిదారుల నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. చట్టబద్దతలేని కమిటీ సభ్యుల అని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి పావని, గజపతినగరం నియోజకవర్గ కన్వీనర్ దేవర ఈశ్వరరావు, బీజేపీ నాయకులు ఆరిశెట్టి రామకృష్ణ, ఎం ఎస్ ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి ధనుర్మాసవ్రత మహోత్సవాలు
గజపతినగరం, డిసెంబర్ 15: గజపతినగరంలోని శ్రీ సీతారామ శ్రీకల్యాణ వేంకటేశ్వర అయ్యప్పస్వామి ఆలయంలో ఈ నెల 16వతేది నుంచి జనవరి 14వతేది వరకు ధనర్మాసవ్రత మహోత్సహోవాలు నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. 16వతేది సాయంత్రం ఆరు గంటలకు ధనుర్మాసం (నెలగంట) పెట్టుటతో ప్రారంభిస్తారు. 17నుంచి జనవరి 14వరకు ప్రతీ రోజూ తెల్లవారుజామున 4.15గంటల నుంచి సుప్రభాతసేవ, అర్చన, సేవాకాలం, నివేదన, మంగళా శాసనం, పాశుర విన్నపం, తీర్ధప్రసాద వినియోగం జరుపుతారు. 18వతేదిన ముక్కోటి ఏకాదశి ( ఉత్తర ద్వార దర్శనం), 19న శ్రీకృష్ణ భగవానునికి కచేలుడు అటుకులు సమర్పించినరోజున కుచేలదినం నిర్వహిస్తారు. 20న ఆంజనేయస్వామి వారికి విశేషపూజలు, 22న శ్రీవారికి ఏడు రకాల ఫలాలతో అలంకరణ, 27న 108 వెండి పుష్పములతో శ్రీవారికి అర్చన, 28న శ్రీవారికి మంచి సువాసన కలిగిన పుష్పములతో అలంకరణ నిర్వహించగా జనవరి 1వతేదిన ఆంగ్ల సంవత్సరాది విశేషపూజలు, 3వతేదిన భక్తులచే సహస్రదీపాలు వెలిగించే కార్యక్రమం, 5న విశేషపూజలు 8న భక్తులచే హారతి వెలిగించే కార్యక్రమం, 9న గోపూజ, 11న 108పాత్రలతో ప్రసాద నివేదన, 12న నవనీతోత్సవం(శ్రీ భూ సమేత శ్రీవారికి వెన్నతో అలంకరణ), 13న గోదాదేవిని పెండ్లి కూతుర్ని చేయుట 14న గోదా కల్యాణం నిర్వహిస్తారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని ఈ మహోత్సవాలు విజయవంతం చేయాలని కోరారు.

వైకాపా కుటుంబాలు దేశంలో చేరిక
గజపతినగరం, డిసెంబర్ 15: తెలుగుదేశం పార్టీ చేపడుతున్న సంక్షేమ పధకాలకు ఆకర్షితులై వివిధ కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని స్ధానిక ఎమ్మెల్యే డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని ముచ్చెర్ల గ్రామంలో పది కుటుంబాలు వైకాపాను వీడి ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి వారందరిని ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రావి శ్రీధర్, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, బుద్ధరాజు రామ్‌జీ, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

విదేశీ విద్యా పధకంను వినియోగించుకోవాలి
గజపతినగరం, డిసెంబర్ 15: విదేశీ విద్యా పధకాన్ని విద్యార్ధులు వినియోగించుకోవాలని గరివిడి ఎ ఎస్ డబ్ల్యువో బోని రామానందం కోరారు. శనివారం స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి (విదేశీ విద్యా పధకం)పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ అనంతరం విదేశాలలో చదువుకొనే విద్యార్ధుల కోసం ప్రభుత్వం 15 లక్షల రూపాయలు అందజేస్తుందని అన్నారు. విద్యాభివృద్ధికోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నదని ఈ పధకాన్ని అర్హులైన విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వసతిగృహం సంక్షేమ అధికారులు డి.రాధామణి, అప్పలనాయుడు, మీనాక్షి తదితరులు పాల్గొన్నారు.
స్వచ్చ సంక్రాంతికి ప్రజలు సహకరించాలి
గజపతినగరం, డిసెంబర్ 15: స్వచ్చ సంక్రాంతికి ప్రజలు సహకరించాలని ఇన్‌చార్జి ఎంపిడివొ జి.జనార్ధనరావు కోరారు. శనివారం గజపతినగరంలో స్వచ్చ సంక్రాంతిపై అవగాహన ర్యాలి నిర్వహించడంతోపాటు పలు చెత్త కుప్పలను గుర్తించి శుభ్రపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చ సంక్రాంతి కార్యక్రమం ఈ నెల 15నుంచి 22వరకు ఈ కార్యక్రమం చేపడతామని తెలిపారు. మండలంలో గజపతినగరం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఎంపిక చేశామని అన్నారు. ఇలా అన్ని గ్రామాలలో 17నుంచి 22వరకు చెత్త కుప్పలను గుర్తించి వాటి తొలగించే కార్యక్రమాలు చేపట్టంతోపాటు ఆన్‌లైన్‌లో పొందుపరచాలని అన్నారు. ఇందుకు ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని అన్నారు. కార్యక్రమంలో గజపతినగరం పంచాయతీ కార్యనిర్వహణ అధికారి రామకృష్ణనాయుడు, రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, పలువురు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.