విజయనగరం

మొక్కజొన్నపంటపై రైతులు ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి,జనవరి 21: మండలంలోని వివిధ గ్రామాలలో ఉన్న రైతులు అధిక శాతం మొక్కజొన్న పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. అధిక పెట్టుబడులతో వరి, చెరకు పంటలను సాగుచేసినప్పటికీ గిట్టుబాటు కావడంలేదని అనే ఉద్దేశ్యంతో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈపంటకు విత్తనం నాటిన నాటి నుండి పంట దశకు వచ్చేంతవరకు ఎటువంటి పెట్టుబడులు అవసరం లేదని అయితే చీడపీడల బారి నుండి రక్షణ కల్పించే విషయంలో కొంత అప్రమత్తంగా ఉంటే అధిక దిగుబడులు సాధించవచ్చునని రైతులు తెలుపుతున్నారు. చీడపీడల నుండి పంటను కాపాడుకునేందుకు మండల వ్యవసాయశాఖ అధికారి పి.కిరణ్‌కుమార్ ఎప్పటికప్పుడు సలహాలు, సంప్రదింపులు చేస్తున్నారని ఈ నేపథ్యంలో మొక్కజొన్నను పండించేందుకు పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండాపోతున్నదని రైతులు తెలుసుకున్నారు. వ్యవసాయశాఖ అధికారుల సలహాలు, సూచనల మేరకు చీడపీడల నుండి తమ పంటను కాపాడుకోగలుగుతున్నామని తెలిపారు. దీనివలన మండలంలో అధిక సంఖ్యలో రైతులు మొక్కజొన్నపంటపై ఆసక్తి చూపుతున్నారు.
గాదె విజయానికి సమిష్టి కృషి చేయాలి
గజపతినగరం, జనవరి 21: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె శ్రీనివాసుల నాయుడు విజయానికి సమిష్టి కృషి చేయాలని పిఆర్‌టియు మండల శాఖ అధ్యక్షుడు గురుగుబిల్లి నాగేశ్వరరావు కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక మండల వనరుల కేంద్రంలో పిఆర్‌టియు గజపతినగరం నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు అయిన ధరఖాస్తులు తిరస్కరించబడిన వాటిని మరల నమోదు ప్రణాళిక గురించి చర్చించాలని అన్నారు. అదే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఐ ఆర్ ప్రకటించే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. ఆర్.కె. శర్మ, జిల్లా మీడియా ఇన్‌ఛార్జ్ బంకపల్లి శివప్రసాద్, రాష్ట్ర కార్యదర్శులు రావాడ రాంబాబు, కొడుకుల ఫణీంద్రుడు,నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బి. లాలబాబుతోపాటు గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, పిఆర్‌టియు సభ్యులు పాల్గొన్నారు.

రికార్డులు సక్రమంగా నిర్వహించాలి
దత్తిరాజేరు, జనవరి 21: గ్రామాలలో రేషన్ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేసి వాటి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి రికార్డులు సక్రమంగా నిర్వహించాలని తహశీల్దార్ కల్పవల్లి తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన డీలర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రేషన్ డిపోలకు వచ్చే లబ్దిదారులతో డీలర్లు సక్రమంగా వ్యవహరించి వారికి సకాలంలో సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ రోజు ఎంత మంది లబ్దిదారులకు సరుకులు పంపిణీ చేస్తున్నారో ఆ వివరాలను రికార్డుల్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని లేని యడల చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. రేషన్ సరుకులకు సకాలంలో డీడీలు తీసి విడిపించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సి ఎస్‌డిటి రవికుమార్, సర్వేయర్ తేజేశ్వరరావుతదితరులు పాల్గొన్నారు.

ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
దత్తిరాజేరు, జనవరి 21: ఈ నెల 25వ తేదీన జరిగిన ఓటరు దినోత్సవం నాడు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని తహశీల్దార్ కల్పవల్లి బి ఎల్‌వొలను ఆదేశించారు. సోమవారం స్థానిక విలేఖరులతో ఆమె మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి శనివారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం వంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలు తెరచి ఉంచాలని అన్నారు. కొత్త ఓటరు నమోదు జాబితాలో తప్పులను సరిచేయడం తదితర సంబంధిత ధరఖాస్తులను స్వీకరించాలని చెప్పారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా గ్రామాలలో ముగ్గులుపోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలని అన్నారు. 25న జరిగే దినోత్సవంలో సీనియర్ సిటిజన్లును సన్మానించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిటి కోటీశ్వరరావు, ఆర్ ఐ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులు కల్పించాలి
దత్తిరాజేరు, జనవరి 21: మండలంలో అన్ని గ్రామాలలో వేతన దారులకు ఉపాధి హామీ పనులు కల్పించాలని ఎపి వొ జి. సుందరరావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఉపాధి పనుల నిమిత్తం ఏ ఒక్కరు వలసలు పోరాదని, ప్రతి గ్రామంలో వేతనదారులకు కావాల్సినంత పని కల్పించాల్సిన బాధ్యతపై క్షేత్ర సహాయకులపై ఉందని అన్నారు. అలాగే జాబ్ కార్డుకు ధరఖాస్తు చేసుకున్నవారికి తక్షణమే జాబ్‌కార్డు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వేతనదారులకు పనులు చేసేటపుడు వారికి కూలీ గిట్టుబాటు అయ్యే విధంగా కొలతలు ఇచ్చి సక్రమంగా పనులు చేయించాలని క్షేత్ర సహాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ జెఇ దేముడు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యార్థి మృతిపై విచారణ
పాచిపెంట, జనవరి 21: పాచిపెంట ఆది ఆంధ్ర పాఠశాలలో 3వ తరగతికి చెందిన విద్యార్థి బాతురూం గోడ కూలి మృతిచెందిన విషయం విధితమే. ఈమేరకు ఆర్‌డబ్ల్యుఎస్ ఇఇ గాయత్రీదేవి సోమవారం విచారణ చేపట్టారు. కూలిన బాతురూం గోడను పరిశీలించి అక్కడ ఉపాధ్యాయులను విచారించారు. ఆ బాతురూంను ఏ సంవత్సరంలో నిర్మించారో అడిగితెలుసుకున్నారు. అయితే విచారణ సమయంలో విద్యార్థి కుటుంబీకులు ఆమెతో వాగ్వివాదానికి దిగారు. విద్యార్థి మృతిచెంది రెండు నెలలు కావస్తున్న విచారణలో జాప్యమేమిటని పలువురు ప్రశ్నించారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వలనే పాఠశాల నిర్వహణ సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఇఇ గాయత్రీదేవి విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లా జడ్జీ శ్రీహరి ఆదేశాలమేరకు విచారణ చేపడుతున్నామని, నివేదికను వారికి సమర్పిస్తామన్నారు.