విజయనగరం

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, జనవరి 21: ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం మండలంలోని సారిపల్లి గ్రామంలో మత్స్యశాఖ 70శాతం రాయితీపై అందించిన లగేజ్ వాహనాన్ని పింగిరి పాపారావుకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే థ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆదరణ పథకం ద్వారా 80శాతం సబ్సిడీతో పరికరాలు అందిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు సువ్వాడ రవిశేఖర్, ఎంపీటీసీ ఎల్లమ్మ, నాయకులు ఆదినారాయణ మాస్టారు, బాబూరావు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
సాగి కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అశోక్
బొండపల్లి, జనవరి 21: ఇటీవల తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు సాగి నారాయణమూర్తి రాజు గుండె పోటుతో ఆకస్మాత్తుగా మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ మేరకు సోమవారం సాయంత్రం విజయనగరం పార్లమెంటు సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు బొండపల్లిలో గల కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు సాగి చిత్రపటం వద్ద పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి సాగి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మంచి విధేయుడుని కోల్పోవడం విచారకరమని అన్నారు. అనంతరం కుటుంబ సభ్యులతోమాట్లాడి ఓదార్పు అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, ఎస్.ఎన్.ఎం.రాజు, టీడీపీ నాయకులు పి.వి.వి.గోపాలరాజు, జడ్పీటీసీ బండారు బాలాజీ, జంపన పెదబాబు, బుచ్చిరాజు, పచ్చమట్ల కృష్ణమూర్తి రాజు, సిరిపురపుజామినాయుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు భీమసింగి ఫ్యాక్టరీ వద్ద చెరకు రైతుల సదస్సు
జామి,జనవరి 21: మండలంలోని భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ వద్ద నేటి మధ్యాహ్నం చెరకు రైతుల సదస్సు నిర్వహిస్తామని ఆంధ్ర రాష్ట్ర చెరకు రైతు సంఘం అధ్యక్షులు రాంబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీమసింగి సహకార చక్కెర కర్మాగారం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ప్రస్తుతం ప్రకటించిన ధరకు కొంత ధరను పెంచి మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఫ్యాక్టరీ అప్పులను మాఫీచేసి ఆధునీకరణకు నిధులు మంజూరు చేయాలని కోరారు. సోమనాథన్ సిఫార్సులు మేరకు రైతులకు టన్ను ఒక్కంటికి 500రూపాయలు పెంచి చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు ఫ్యాక్టరీ కార్మికులను, ఉద్యోగులను, రైతులను ఆకునేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. కేంద్రప్రభుత్వం నిబంధనల కారణంగా చెరకు రైతులు నష్టపోతున్నారని, రైతుకు అనుకూల మద్ధతు ధర ప్రకటించకపోవడంతో చెరకు పంట పండించేందుకు నిరాశ చెందుతున్నారని అన్నారు. చెరకు రైతులకు సంబంధించి అనేక సమస్యలపై చర్చించేందుకు నేడు భీమసింగి చక్కెర కర్మాగారం పరిధిలో రాష్ట్ర చెరకు రైతులు సంఘం సదస్సును నిర్వహిస్తుందని దీనికి చెరకు రైతులంతా హాజరు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చెరకు రైతుల సంఘం నాయకులు డేగల అప్పలరాజు తదితరులు ఉన్నారు.