విజయనగరం

అర్హులందరికి పట్టాలు పంపిణీ చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, జనవరి 21: మండలంలో ఇళ్లు నిర్మించుకునేందుకు స్ధలంలేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలు అందజేస్తామని స్ధానిక తహశీల్ధార్ కోరాడ శ్రీనివాసరావు తెలిపారు. మండల పరిధిలో 14పంచాయతీలలో గల ప్రభుత్వ భూమి గుర్తించామని అందులో పేదలకు పట్టాలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. 1061మందిని ఇప్పటికే గుర్తించామని, వీరందరికి లేఅవుట్ వేసి స్ధలాలు పంపిణీ చేస్తామని అందుకు సంబందించిన పత్రాలను ఆర్డీవొకు పంపించామని తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే స్ధానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి చేతులమీదుగా పట్టాలు అందిస్తామని చెప్పారు. దళారులను నమ్మవద్దని పట్టాలు కోసం ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దని తెలిపారు.

జీవనజ్యోతి పాఠశాలలో బాలికల గ్రిక్స్ పోటీలు
కొత్తవలస, జనవరి 21: మండలంలోని బలిఘట్టాం వద్ద గల న్యూహోప్ జీవనజ్యోతి పాఠశాలలో ఈ నెల 23నుంచి 25వరకు బాలికల గ్రిక్స్ పోటీలు నిర్వహిస్తామని పాఠశాల చైర్మన్ తెలిపారు. ఈపోటీలకు అన్నిపాఠశాలల నుంచి సుమారు వేయిమంది బాలికలు వస్తారని పాఠశాల యాజమాన్యం తెలిపింది. 25వతేదిన విజేతలకు డి ఇవొ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు.

మూడవ విడత తరల్ మెటీరియల్ సిద్ధం
గజపతినగరం, జనవని 21: మూడవ విడత తరల్ మెటీరియల్ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని స్థానిక మండల విద్యాశాఖాధికారి ఎస్. విమలమ్మ తెలిపారు. సోమవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇంత వరకు రెండు విడతలు తరల్ మెటీరియల్ అందజేశామని, మూడవ సారి పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మండలంలోని 46 పాఠశాలలకు ఈ మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.

బొప్పడాం విద్యార్థులకు టివి రామన్ అవార్డు
నెల్లిమర్ల, జనవరి 21: మండలంలోని బొప్పడాం ఉన్నత పాఠశాల విద్యార్థులకు విజ్ఞాన ప్రదర్శనలు, జాతీయ స్థాయి టివిరామాన్ అవార్డు సాధించారని హెచ్ ఎం కె. రాజేశ్వరరావు చెప్పారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఈ నెల 15నుంచి బెంగుళూరులో జరిగిన దక్షిణభారత వైజ్ఞానిక ప్రదర్శన 2019పోటీల్లో బొప్పడాం విద్యార్థులు హైడ్రో పవర్ దిల్ స్వచ్ భారత్ ప్రాజెక్టును ప్రదర్శించి ఉత్తమ అవార్డును సాధించారని తెలిపారు. అలాగే సర్ టివిరామాన్ అవార్డును విద్యార్థులు డి. భాస్కర్, ఎం. ఉమామహేశ్వరరావు, గైడ్ టీచర్ ఎ. నరేష్‌లకు అందజేశారు. ఈ ప్రాజెక్టుకు ఎన్‌సి ఆర్‌టి తరపున ఐదువేలు నగదు బహుమతి లభించిందని చెప్పారు.

కార్మికుల సమస్యలపై రాజధానిలో ధర్నా
నెల్లిమర్ల, జనవరి 21: నెల్లిమర్ల జూట్‌మిల్లు లాకౌట్ అరబిందో వేతన ఒప్పంద సమస్యలపై రాష్ట్రప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ రాజధానిలో ధర్నా నిర్వహించారు. సోమవారం ఇప్టూ నాయకులు మల్లిక్ ఆధ్వర్యంలో కార్మికులు విజయవాడలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఇప్టూ రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రసాద్ మాట్లాడుతూ అరబిందో యాజమాన్యం వేతనం ఒప్పందం అడిగిన పాపానికి కార్మికులపై అక్రమకేసులు బనాయించిందని చెప్పారు. అలాగే నెల్లిమర్ల జూట్‌మిల్లు యాజమాన్యం 30 ఏళ్ళల్లో ఎనిమిది సార్లు అక్రమంగా లాకౌట్ విధించిందని అన్నారు. ఈకార్యక్రమంలో ఎఐటియుసి గౌరవ అధ్యక్షులు శలసాని రామారావు, సిఐటియు రాష్ట్ర కోశాధికారి ఎ.వి.నాగేశ్వరరావు, కొండయ్యలు ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు.
లేబర్ కమిషనర్‌కు వినతి
కార్మికుల సమస్యలపై ఇప్లూ రాష్ట్రప్రతినిధి వర్గం రాష్టశ్రాఖా కార్మిక కమిషనర్‌కి అరబిందో, నెల్లిమర్ల, నీలంజూట్‌మిల్లు సమస్యలపై చట్టప్రకారంగా తగుచర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అరుణ, ఈస్టుకోస్టు, బొబ్బిలి జూట్‌మిల్లులను తెరిపించాలని డిమాండ్ చేశారు. కార్యాక్రమంలో పి. ప్రసాద్, పోలారీ, ఎం.వెంకటేశ్వర్లు, యు.వెంకటేశ్వర్లు, నెల్లిమర్ల ఇప్టూ నాయకులు మల్లిక్, మామిడి నారాయణరావు, అరబిందో యూనియన్ నాయకులు అప్పలనాయుడు, నీలంజూట్‌మిల్లు యూనియన్ నాయకులు నీలంరాజు, వెంకయ్యలు ఉన్నారు. వీటిపై రాష్ట్ర కార్మిక శాఖా కమిషనర్ వరప్రసాద్ స్పందిస్తూ త్వరలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

జాతీయ స్థాయి పోటీల్లో నెల్లిమర్ల క్రీడాకారుల ప్రతిభ
నెల్లిమర్ల,జనవరి 21: జాతీయ స్థాయి కేల్ ఇండియా ఛాంపియన్ షిప్ పోటీల్లో నెల్లిమర్ల క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని పిడి బొమ్మన రామారావు తెలిపారు. సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 17వరకు మహారాష్ట్ర పూణేలో జరిగిన జాతీయ స్థాయి కేర్ ఇండియా ఛాంపియన్‌షిప్, ఖోఖో పోటీల్లో బుడుమూరు గౌరు అండర్-21 విభాగంలో తృతీయ స్థానం సాధించారని అన్నారు. అలాగే అండర్-17విభాగంలో జమ్మునితీష్‌కుమార్ ద్వితీయ స్థానం సాధించాడని చెప్పారు. వీరి ఇరువురికి కాంశ, వెండి పతకాలతోపాటు తృతీయ స్థానం పొందిన వారికి ఐదు లక్షలు, ద్వితీయస్థానం సాధించిన టీమ్‌కు ఏడు లక్షల రూపాయలు నగదు బహుమతులు అందాయని చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచిన క్రీడాకారులను పిడి బొమ్మనరామారావు, ప్రిన్సిపాల్ కె. అప్పారావు, అద్యాపకులు అభినందించారు.