విజయనగరం

రాజరాజేశ్వరిదేవికి పౌర్ణమి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, జనవరి 21: మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభూగా వెలసిన రాజరాజేశ్వరిదేవి అమ్మవారికి పుష్యమాస పౌర్ణమి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి క్షీరాభిషేకం తులసిదలార్చనసేవ, కుంకుమ పూజలను రాజరాజేశ్వర స్వామివారికి బిల్వదలార్చన సేవలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పుష్యమాసంలో పౌర్ణమి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించిన భక్తులకు దరిద్రము, రుణబాధలు తొలగిపోవునని తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాలు నుంచి తరలివచ్చారు. అదేవిధంగా లలితా సహస్తన్రామ పారాయణం అమ్మవారి సన్నిధిలో నిర్వహించారు.

భూకంపాలు అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన ప్రదర్శనలు
గజపతినగరం, జనవరి 21: భూకంపాలు అగ్నిమాపక ప్రమాదాలపై అవగాహన ప్రదర్శనలు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి మహేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది నిర్వహించారు. సోమవారం కోమటిపల్లి గ్రామంలో విద్యార్ధులకు అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదాలు, భూకంపాలు భవనాలు కూలిపోవుట తదితర ప్రమాదాలు జరిగినపుడు భవంతిలో ఉండే ప్రజలను ఏవిధంగా సురక్షితంగా ప్రాణాపాయం లేకుండా కిందికి తీసుకొని రావడం, ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తులను ప్రధమ చికిత్స ద్వారా ఏ విధంగా కాపాడవచ్చునో కొన్ని పద్దతుల ద్వారా చేసి చూపించారు. అగ్నిప్రమాదాలపై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు విద్యార్ధులకు అవగాహన తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో లీడింగ్ ఫైర్‌మేన్ గణేష్‌కుమార్, డ్రైవర్ ఆపరేటర్ రామసూర్యరావు, సిబ్బంది ప్రసన్నకుమార్, స్వామి, నాయుడు, బి.ఎస్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర మాజీ సైనికుల సెల్ కన్వీనర్‌గా దేవర నియామకం
గజపతినగరం, జనవరి 21: బీజేపీ ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికోద్యోగుల సెల్ రాష్ట్ర కన్వీనర్‌గా దేవర ఈశ్వరరావును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నియమించారు. ఈ మేరకు నియామక పత్రాన్ని సోమవారం దేవరకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని మాజీ సైనికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకుంటుందని, తాను ప్రతీ జిల్లా పర్యటించి సైనిక కుటుంబాల గురించి ప్రభుత్వానికి తెలియజేస్తానని తెలిపారు. అవార్డు గ్రహీతులకు త్వరలో సత్కారాలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సునీల్ దియోదర్, రవీంధ్రరాజు, రాష్ట్రంలోని 13జిల్లాల కన్వీనర్లు, కోకన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
ముచ్చర్లలో జ్ఞానదీపం పరీక్షలు
గజపతినగరం, జనవరి 21: మండలంలోని ముచ్చర్ల పాఠశాలలో బాలలకు జ్ఞానదీపం పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ పరీక్షలో ఏ.వాసవి, ఏ.సుస్మితలు ప్రధమస్ధానంలో నిలిచారు. పరీక్షలో వి.పైడిరాజుకు ద్వితీయస్ధానం, ఎం.సిద్దు తృతీయస్ధానం నిలిచారు. వీరికి హెచ్ ఎం సమక్షంలో పెద్దబాలశిక్ష ప్రశంసాపత్రం, మెడల్, బ్యాడ్జీలను మాజీ జెడ్పీటీసీ గార తవుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలాభ్యున్నతకి బండారు కృషి అభినందనీయమని అన్నారు. ప్రతీ గ్రామంలో నిరంతరం శ్రమిస్తూ బాలలను ప్రోత్సహిస్తూ నిస్వార్ధంగా సేవలు చేస్తూ అంతర్జాతీయ కీర్తి ఘడించి బండారు మన ప్రాంతంవాడు కావడం మనకు గర్వకారణమని తెలిపారు. ఇప్పటికే పలుసార్లు పాఠశాలకు పలుసార్లు విచ్చేసి బాలలను ఉత్తేజపరుస్తూ కార్యక్రమాలు నిర్వహించడం అనందాయకమని ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు అన్నారు. పరీక్ష నిర్వాహకులుగా ఉపాధ్యాయులు లెంక రామారావు, ఆరిశెట్టి అప్పలరాజు సహకారాన్ని అందించారు.

అర్హుల అందరికి ఫించన్లు అందించాలి
గజపతినగరం, జనవరి 21: అర్హుల అందరికి ఫించన్లు అందించాలని స్ధానిక ఇన్‌చార్జి ఎంపిడివొ ఎం.ప్రకాశరావు ఆదేశించారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రెట్టింపు ఫించన్లు సక్రమంగా అందజేయాలని తెలిపారు. ఇంటి పన్నులు వసూలు వేగవంతం చేసి వంద శాతం వసూలు చేయాలని చెప్పారు. గ్రామాలలో పారిశుద్ధ్య పట్ల ప్రత్యేక శ్రద్ద కనబరచాలని అన్నారు. ప్రజలకు మంచినీటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికపుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు, ఏపీవొ కృష్ణవేణమ్మ, ఆర్ డబ్ల్యు ఎస్ జె ఇ దుర్గ్భావాని, మండల విద్యాశాఖ అధికారి ఎస్.విమలమ్మ, వివిధ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

వాసవిట్రేడర్స్‌కు ఉత్తమ పారిశ్రామిక వేత్త పురస్కారం
గజపతినగరం, జనవరి 21: ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేయడమేకాకుండా బ్యాంకుల ఆర్ధిక లావాదేవీలు సక్రమంగా చేస్తున్నందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ శ్రీ వాసవిట్రేడర్స్ పురిటిపెంట, గజపతినగరం పార్టనర్స్ అయిన ఆరిశెట్టి సత్యనారాయణ, ఆరిశెట్టి గణపతిరాజు(రాజా)లను ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా ఎంపిక చేసి పురస్కారం అందజేశారు. ఈమేరకు పురస్కారాన్ని ఏపీ ఎస్ ఎఫ్‌సి విజయనగరం అసిస్టెంట్ మేనేజర్ ఆర్.సత్యనారాయణ అందజేశారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం పురస్కారాలను అందిస్తుందని తెలిపారు. ఈ మేరకు జిల్లాలో ముగ్గురిని ఉత్తమ పారిశ్రామిక వేత్తలను ఎంపిక చేసిందని తెలిపారు. కార్యక్రమంలో బైరెడ్డి సత్యనారాయణ, తిరుపతి పాల్గొన్నారు.

గ్రామాలలో ఉపాధి పెరగాలి
కొత్తవలస, జనవరి 21: గ్రామాలలో ఉపాధి పెరగాలని తద్వారా ప్రతి ఒక్కరూ ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఎస్‌బి ఐ మేనేజర్ పనికుమార్ తెలిపారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో ఒక్కరోజు శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్‌లలో ఎంప్లాయిమెంట్ పెరగాలని అందుకు తగ్గట్టుగా వినియోగదారులకు ఎస్‌బి ఐ సహకరిస్తుందని తెలిపారు. గ్రామాలలో యువత ఎక్కువగా ఉన్నారని వాళ్లు ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడకుండా స్వశక్తితో ఉపాధి సంపాదించాలన్నారు. ఎంపిడివొ రవికుమార్ మాట్లాడుతూ బ్యాంకులు సహకరిస్తే స్వయం ఉపాధి ద్వారా అనేక మంది యువకులకు చేయూత ఇవ్వొచ్చని తెలిపారు. ఉపాధి కోసం పైచూపులు చూడకుండా స్వయం ఉపాధి పధకంలో యూనిట్లు స్ధాపించుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు ద్వారా గ్రామాలలో సర్వే నిర్వహించి స్వయం ఉపాధి పధకాలను అందజేస్తామని వారు చెప్పారు. కార్యక్రమంలో ఇవొ పి ఆర్‌డి అప్పలనాయుడు, పంచాయతీ ఇవొ అప్పారావు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.