విజయనగరం

పైడితల్లమ్మ స్ధలాన్ని రక్షించాలని రాము ఆమరణదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జనవరి 23: గజపతినగరం పంచాయతీ పరిధిలో గల పైడితల్లి అమ్మవారి గుడి స్ధలాన్ని రెవెన్యూ అధికారులు రక్షించాలని కోరుతూ పట్టణానికి చెందిన బూర్లి రాము బుధవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయం ఎదుట ఆమరణదీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గజపతినగరం గ్రామ ఆరాధ్యదేవత పైడితల్లి అమ్మవారి గుడి స్థలాన్ని కబ్జా చేసి పురాతనమైన దేవాలయాన్ని అక్కడ ఉన్న ప్రతిమలను చిందరవందర చేసి స్థలాన్ని ఎవరికో విక్రయించాలనే ఉద్దేశ్యంతో పూర్తిగా చదును చేసిన పోతురాజు నాగమణి, ఆమె కుమారుడు సంతోష్‌కుమార్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు గుడిని పరిరక్షించాలని కోరుతూ ఆమరణ దీక్ష చేపడుతున్నానని తెలిపారు. నాప్రాణం కన్న గుడి పరిరక్షణ మిన్న అని అందరి మనోభావాలను గుర్తించి గుడి విషయంలో తగున్యాయం జరిగే వరకు ఆమరణ దీక్ష కొనసాగిస్తామని హెచ్చరించారు. రాము ఆమరణ దీక్షకు గజపతినగరం పట్టణానికి చెందిన నరవ శంకరరావు, ఎన్.చందు, కర్రి నానాజీ, కర్రి రామునాయుడు మద్దతు తెలిపారు.
డప్పు కళాకారుల ఉద్యమాన్ని విజయవంతం చేయాలి
* ఏపీ డప్పు కళాకారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాకోటి రాములు
గజపతినగరం, జనవరి 23: డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాకోటి రాములు కోరారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేయనున్న డప్పు కళాకారుల అందరికి ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రారంభించాలని కోరారు. డప్పు కళాకారులకు పించన్లు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం పిబ్రవరి నెలాఖరు నుంచి ఇవ్వడానికి అంగీకరించిందని, కాని తొలివారం నుంచే అందరికి ఇచ్చేవిధంగా వారికి అందించాలన్నారు. జిల్లాలో ఆరు వేల మందికిపైగా డప్పు కళాకారులు ఉన్నారని ఆదరణ అంచెంచలుగా తగ్గుతుందని వీరి ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారని అన్నారు. పించను వయసు 45సంవత్సరాలకు సడలించి ఆన్‌లైన్ కొనసాగించాలని కోరారు. ఇప్పటికే వృద్ధాప్య పించను పొందుతున్న డప్పు కళాకారుల పించను డప్పు కళాకారుల పించనుగా మార్పు చేయాలని తెలిపారు. జిల్లాలో ఉన్న డప్పు కళాకారులకు రెవెన్యూ అధికారుల ద్వారా గుర్తించి గుర్తింపుకార్డులు ఇవ్వడంతోపాటు డప్పులు పండగ జరపాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు భీమా సదుపాయం కల్పించాలని అన్నారు. ఇళ్లులేని కళాకారులకు పక్కా ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాకోటి ఆనంద్, మామిడి వెంకటరమణ, బొట్టా తవిటయ్య, ములగాడ రామారావు, కిల్లాడ మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

పరాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళిక సిద్దం
బొండపల్లి, జనవరి 23: గజపతినగరం నియోజకవర్గంలో మూడు మండలాలలో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామని గజపతినగరం మార్కెట్ కమిటీ చైర్మన్ బుద్ధరాజు నరిసింహ వర్మ అన్నారు. బుధవారం బొండపల్లి గ్రామంలో అధికారుల బృందంతో పర్యాటక కేంద్రం అభివృద్దికి ప్రతిపాదించిన కోమటిచెరువును పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో కోటి 30లక్షల రూపాయల వ్యయంతో మూడు మండలాలలో అభివృద్ధి చేపడతామని తెలిపారు. బొండపల్లిలో గ్రామ నడిమధ్యలో ఉన్న కోమటిచెరువును 40లక్షలతో అభివృద్ధి పరిచి సుమారు 570మీటర్లు చెరువుగట్టును వాకింగ్ ట్రాక్‌గాను మలిచి ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా మార్పు చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే రామన్నచెరువును 50లక్షల ఖర్చుతో సుందరికరించనున్నట్లు తెలిపారు. గజపతినగరం మండలంలో చంపావతి నదీ తీరంలో 50లక్షల ఖర్చుతో పార్కును నిర్మించనున్నామని తెలిపారు. గంట్యాడ మండలంలో బోనంగి గ్రామంలో 40లక్షలతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే డాక్టర్ కె. ఎ.నాయుడు కృషి చేశారని త్వరలో గుత్తేదారులు పనులు ప్రారంబించనున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి పి. ఎన్.వి.లక్ష్మినారాయణ, పి. ఆర్. ఈ ఈజి.సత్యనారాయణ, డి ఇ ప్రసాదరావు, జె ఇ పొన్నాడ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.