విజయనగరం

విజయనగరాన్ని సాంస్కృతిక రాజధానిగా తీర్చిదిద్దుతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ (్భగాపురం), ఫిబ్రవరి 14: భోగాపురంలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర జిల్లాలకే తలమానికంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. భోగాపురంలో నిర్మించబోయే విమానాశ్రయ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ విమానాశ్రయ ఏర్పాటు వలన ఉద్యోగ అవకాశాలతో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలు మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. విమానాశ్రయాన్ని ఆనుకుని ఉన్న తీర ప్రాంతరం కూడా ఉండడంతో ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వరకు బీచ్ రోడ్డును వేసి పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. కళలకు పుట్టినిల్లుగా భావించే విజయనగరాన్ని సాంస్కృతిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయాక ఆదాయం అంతా తెలంగాణకు, అప్పులు రాష్ట్రానికి వచ్చినప్పటికీ కేంద్రం సహకరించకపోయినా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశానని తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రధాని మోడీ తన సొంత రాష్టమ్రైన గుజరాత్ అభివృద్ధి చెందలేదని, అమరావతి అభివృద్ధి చెందడాన్ని చూసి ఓర్వలేకున్నారని విమర్శించారు. మోడీ, కేసీ ఆర్, జగన్, ముగ్గురో మోడీలు కలసి తనపై ఎన్ని కుట్రలు పన్నినా ఏమీ చేయలేరని అన్నారు. జిల్లాకు చెందిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్న హయాంలో వోక్స్‌వేగన్ కార్ల పరిశ్రమ పూణేకు తరలిపోగా తమప్రభుత్వ హయాంలో అనంతపురంలో కార్లు పరిశ్రమ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. అంతకుముందు జిల్లా మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ విమానాశ్రయానికి చెందిన అసైన్డ్ భూములను జిరాయితీ భూములకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలని సిఎం దృష్టికి తీసుకువెళ్ళగా అందుకు సి ఎం చంద్రబాబు సమ్మతించారు. జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ కృషితో జిల్లాకు అవార్డులు లభించాయని కలెక్టర్‌ను ప్రశంసించారు. అలాగే రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు అసైన్డ్ భూములకు ప్రత్యేక పరిహారం చెల్లించేలాని ముఖ్యమంత్రిని కోరారు. దీనితో సిఎం కూడా హామీ ఇవ్వడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సుజయ్ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాసరావు, కింజరాపు అచ్చింనాయుడు, కిడారి శ్రావణ్‌కుమార్, జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యేలు మీసాల గీత, పతివాడ నారాయణస్వామినాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కె. ఎ.నాయుడు, మృణాళిని, లలితకుమారి, ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసుల నాయుడు, ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, జిల్లా టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహంతి చిన్నంనాయుడు, ఐవిపి రాజు, స్థానిక ఎంపిపి కర్రోతు బంగారురాజు, నెల్లిమర్ల ఎంపిపి సువ్వాడ వనజాక్షి, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ బి.నరసింగరావు, టిడిపి ఉపాధ్యక్షులు సువ్వాడ రవిశేఖర్, టిడిపి నాయకులు పడాల అరుణ, భంజ్‌దేవ్, ఎస్‌ఎన్‌ఎం రాజు, మున్సిపల్ చైర్మన్లు ప్రసాదుల రామకృష్ణ, తూముల అచ్యుతావల్లి, కరణం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు
పూసపాటిరేగ, ఫిబ్రవరి 14: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులకు గురువారం పైలాన్ ఆవిష్కరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానుండడంతో ముందస్తు వ్యూహంలో భాగంగా బీజేపీ నెల్లిమర్ల నియోజకవర్గ కన్వీనర్ పతివాడ రమణ, పూసపాటిరేగ మండల బీజేపీ కన్నీవనర్ మొంగం సత్యనారాయణతోపాటు సిపిఎం నాయకుడు బచ్చట సూర్యనారాయణలను పోలీసులు ముందస్తుగా అరెస్టుచేసి అదుపులోకి తీసుకున్నారు. సిఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉంటాయేమోనని భావించి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పలువురు నాయకులు, ప్రజాసంఘాలు అందుకు సంఘీభావంగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆందోళనకు దిగే సమయంలో పోలీసులు అరెస్టు చేసిన నాయకులను విడిచిపెట్టారు.

సిఎం సభకు భారీ జనసందోహం
పూసపాటిరేగ, ఫిబ్రవరి 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు పైలాన్ ఆవిష్కరించగా ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. ఉదయం 10.30గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మధ్యాహ్నం 1.45గంటలకు ఆలశ్యంగా వచ్చినప్పటికీ మహిళలు ఓపిగ్గా ఉన్నారు. సభ ముందు పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, పలు కళాసంస్థలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి నిర్వహించే సభలో ప్రత్యేకంగా భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోతు బంగారురాజును ఈ ప్రాంత సమస్యలపై తరుచు ప్రస్తావిస్తుంటారని, అలాగే ఎమ్మెల్యే పతినాడ నారాయణస్వామి కూడా పెద్దవారు అయినప్పటికీ తన శక్తికి మించి ఈ ప్రాంత సమస్యలపై పనిచేస్తున్నారని ప్రత్యేకంగా కితాబు ఇచ్చారు.