విజయనగరం

వర్షంలా కురుస్తున్న మంచు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరకముడిదాం, ఫిబ్రవరి 14: గత రెండు రోజులుగా పొగమంచు వర్షంలా కురుస్తుండడంతో మామిడి, జీడిమామిడి పండిస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ మండలం పూర్తిగా వర్షాదారమైనది కావడంతో సుమారు 70 శాతం మంది రైతులు మామిడి, జీడిమామిడి పంటల సాగుపైనే దృష్టి సారించారు. ఈ పంట సాగు నీటి అవసరం అంతగా లేనప్పటికీ పంట పండి ఇంటికి చేరినంతవరకూ దినదిన గండంలా గడపాల్సిందేనని రైతులు ఆవేదన చెందుతున్నారు. పువ్వు పూసే దశలో అనేక క్రిములు పువ్వును నాశనం చేస్తుంటాయని రైతులు వాపోయారు. ఈ క్రిమిల నుండి అనేక రకాల క్రమి సంహారక మందులు వాడి పంటను కాపాడుకునేటప్పటికి తల ప్రాణం తోకకు వస్తుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పువ్వు కాస్త పింజ కడుతుందనుకున్న తరుణంలో ఈ పొగమంచు కురవడంతో పువ్వు మాడి మసైపోతుందని వీరు మొత్తుకుంటున్నారు. మంచు తాకిడి తట్టుకుని మిగిలిన పువ్వు కాస్త పింజకడుతున్న సమయంలో జీడిమామిడి చెట్లపై పిట్టలు దండు పడి నాశం చేస్తాయని రైతుల ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. వీటి బారి నుండి రక్షించిన అనంతరం రైతు పాలిటి ప్రకృతి కనె్నర్రె చేసిందంటే పెనుగాలులు రూపంలో ఏడాది కాలం కాయకష్టం చేసి పండించిన పంట నేలపాలు కావల్సిందే తప్ప మరో ప్రత్యామ్మాయం లేదని మామిడి, జీడిమామిడి పంటలను సాగు చేస్తున్న రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
సంక్షేమ పధకాలు సద్వినియోగం చేసుకోవాలి
గజపతినగరం, ఫిబ్రవరి 14: ప్రభుత్వ సంక్షేమ పధకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆత్మా కమిటీ అధ్యక్షుడు అట్టాడ లక్ష్మునాయుడు కోరారు. గురువారం మండలంలోని పురిటిపెంట గ్రామం పరిధిలో గల పలువురు గీత, రజకులకు పదివేల రూపాయల వంతున ఆర్ధిక సహాయాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గీత, రజకకుటుంబాలకు ఆధరణ ద్వారా పనిముట్లుతోపాటు పదివేల వంతున ఆర్ధిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. పేద, బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధిలో కొనసాగాంటే మళ్లీ చంద్రబాబును సి ఎం చేయాల్శిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. నాడు ఎన్టీ ఆర్ ప్రారంభించిన ఆదరణ పధకాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఎంపిటిసి వైకుంఠం మైథిలీప్రియాంక, టీడీపీ నాయకులు వైకుంఠం ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఫించను వయసు 50 ఏళ్లకు సవరించాలి
గజపతినగరం, ఫిబ్రవరి 14: జానపద కళాకారుల ఫించను వయసు 50 ఏళ్లకు సవరించాలని జానపద కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ రాకోటి రాములు డిమాండా చేశారు. స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో ఎన్నికల సీనియర్ శివశంకర్ గురువారం వినతిపత్రాన్ని అందజేధశారు. ఈ సందర్భంగా ఆయన ఆమ్లాడుతే కళాకారుల సమస్యలు పర్కిరించాలని కోరుతా ఈ నెల 18వతేదిన కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు, పెద్దసంఖ్యలో కళాకారుల హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వవం అన్నివర్గాల వారికి ఎన్నికల వరాలు కరిపిస్తుందని తక్షణమే ముఖ్యమంత్రి కేబినేట్‌లో కళాకారుల సమస్యలపై చర్చించి సమస్యలు పరిష్కరించాలని అన్నారు. లేకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటకే సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టి తహశీల్ధార్‌కు ప్రజాప్రతి నిధులకు వినతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం రాజకీయ సభలకు, ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు కళాకారులను ఉపయోగించుకునొ వారి జీవనోపాధి గురించి మాత్రం పట్టించుకోలేదన్నారు. జిల్లావ్యాప్తంగా వేలాదిమంది కళాకారులు దీనస్ధితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోకన్వీనర్ బొట్టా తవుడు, మండల అధ్యక్షుడు పి.రాము తదితరులు పాల్గొన్నారు.

పంటల ఉత్పాదకతను పెంచడానికి చర్యలు
* గజపతినగరం వ్యవసాయ శాఖ ఎడిఎ అన్నపూర్ణ
గజపతినగరం, ఫిబ్రవరి 14: పంటల ఉత్పాదకతను పెంచడానికి రైతులు చర్యలు చేపట్టాలని గజపతినగరం సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్ అన్నపూర్ణ కోరారు. గురువారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో పంటల ఉత్పాదకతపై రైతులుకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పంటలు మార్పిడి పద్దతిని పాటించడంతో పాటు డ్రమ్ముసీడర్ శ్రీవరి సాగు తదితర పద్దతిలో పంటలు పండించాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ వినియోగించుకోవడం ద్వారా ఖర్చును తగ్గించడంతో పాటు దిగుబడులు పెంచుకోవచ్చాన్నారు. మేలైన వరి విత్తనాలు వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఏపిఒ వీరాస్వామి, ఎడిడి రామారావు, సత్యన్నారాయణ, టి అప్పలనాయుడు, మండల వ్యవసాయ అధికారిణి గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.