విజయనగరం

బొండపల్లి ఎంపిడివొగా సూర్యనారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొండపల్లి, ఫిబ్రవరి 18: బొండపల్లి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పి.సూర్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఇన్‌చార్జి ఎంపిడివొగా పనిచేసిన కె.కృష్ణమూర్తి నుంచి సూర్యనారాయణ చార్జ్ తీసుకున్నారు. కాగా ఎన్నికల నేపధ్యంలో ఎంపిడివొగా బదిలీ అయిన ఎం.ప్రకాశరావు విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఎంపిడివొగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఇలా ఉండగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలకు ముఖ్యంగా అర్హులకు ప్రభుత్వ పధకాలు అందించేందుకు శ్రమించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో సీనియర్ సహాయకులు తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటా: ఎంపీడీవొ
దత్తిరాజేరు, ఫిబ్రవరి 18: గ్రామాలలో ప్రజా సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని ఎంపీడీవొ సి.హెచ్. శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా కంచిరి మండలం నుంచి బదిలీపై వచ్చి దత్తిరాజేరు ఎంపీడీవొగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. అలాగే రానున్న ఎన్నికల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో ఎమైనా పనులు కావాల్సిన వారు తనను సంప్రదించి తెలియపరిస్తే తక్షణమే పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటిండింట్ పార్థశారద, సీనియర్ అసిస్టెంట్ మోహన్, టైపిస్టు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలి
గజపతినగరం, ఫిబ్రవరి 18: పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలని ఎంపిడివొ ఎన్.జయ మాధవి ఆదేశించారు. సోమవారం స్ధానిక మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పధకాలు సకాలంలో లబ్ధిదారుల అందరికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఇంటి పన్నులు వసూలు శతశాతం వసూలు చేసి గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించాలని చెప్పారు. ఉపాధి హామీ పధకం ద్వారా కూలీల అందరికి పనులు కల్పించి వలసల నివారించాలన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు, ఉపాధి హామీ ఎపివొ కృష్ణవేణి, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

ఎంపీడీవొగా ఎ.వెంకటరత్నం బాధ్యతలు
జామి, ఫిబ్రవరి 18: మండల ఎంపీడీవొగా ఎ. వెంకటరత్నం సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండల ఎంపీడీవొగా పనిచేసి బదిలీపై జామి మండలానికి వచ్చారని చెప్పారు. ఈమె స్థానంలో పనిచేసిన గొర్రిపాటి శ్రీనివాసరావు ఇదే కార్యాయంలో సూపరింటిండింట్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల ఫ్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కరిస్తానని మండల సిబ్బందితోను, నాయకులతోను సమన్వయం ఏర్పరుచుకుని ముందుకు వెళతానని అన్నారు.

గజపతినగరం ఎంపిడివొగా మాధవి బాధ్యతలు స్వీకరణ
గజపతినగరం, ఫిబ్రవరి 18: గజపతినగరం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణిగా ఎన్.జయమాధవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావుతో మండలంలోని పంచాయతీ కార్యదర్శలు పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందనలు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా నుంచి మాధవి ఇక్కడకి బదిలీపై వచ్చారు.

సీతానగరం ఎంపీడీఓగా ఈశ్వరమ్మ
సీతానగరం, ఫిబ్రవరి 18: సీతానగరం ఎంపీడీఓగా ఈశ్వరమ్మ బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సోంపేట నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చానన్నారు. ప్రజలు, ప్రజాప్రతినిదుల సహకారంతో ప్రజలకు సేవలందిస్తానన్నారు. వివిధ శాఖ అధికారులు సహకారం అందించాలన్నారు. ఈమేరకు మండల పరిషత్ పర్యవేక్షకులు పార్వతీశ్వరరావు, సీనియర్ అసిస్టెంట్ వల్లూరి శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ సురేష్, ఎం జగన్మోహనరావు తదితరులు ఎంపీడీఓకు అభినందనలు తెలియజేశారు.