విజయనగరం

బిసిలపై వైసీపీ డిక్లరేషన్ అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో బిసిలకు ఏ పార్టీ చేయని విధంగా వైసీపీ డిక్లరేషన్ చేసిందని ఎస్.కోట నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. బిసిల్లో ఉన్న 136 కులాలకు ఉప ప్రణాళికలు నిధులు కేటాయిస్తూ వారి అభ్యున్నతికి వైసీపీ కృషి చేస్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం అమోఘమని అన్నారు. భారత దేశంలో ఏపార్టీ ఇవ్వని ప్రాముఖ్యతను వైసీపీ బిసిలకు ఇస్తుందని ఆయన తెలిపారు. బిసిల్లో జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ డిక్లరేషన్‌ను మెచ్చుకున్నారని శ్రీనివాసరావు గుర్తు చేశారు. అనంతరం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ బిసిలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బిసి రిజర్వేషన్ పట్ల టీడీపీకి చిత్తశుద్ధి లేదని ఆయన తెలిపారు. మొదటి అసెంబ్లీ సమావేశంలోనే బిసిల చట్టం తెస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. బిసి వేదికగా జరిగిన సమావేశంలో ఒక ఎమ్మెల్సీ స్థానం బిసి ప్రతినిధికి ప్రకటించడం వైసీపి చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదని అన్నారు. బొంతల వెంకటరావు మాట్లాడుతూ జిల్లాలో ఐదుగురు బిసి ఎమ్మెల్యేలు ఉంటే ఏ ఒక్కరికి కూడా టీడీపీ మంత్రి పదవి ఇవ్వలేదని, అగ్రవర్ణాల వారికే మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. తూర్పాటి వరలక్ష్మి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 45 నుండి 60 వయస్సు మధ్యలో గల ప్రతి బిసి మహిళకు 75వేలు వచ్చే విధంగా ప్రణాళికలు రచించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల పార్టీ నాయకులు కొండలరావు, గొరపల్లి రవికమార్ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీతోనే బీసీలకు న్యాయం
సాలూరు, ఫిబ్రవరి 18: రాష్ట్రంలోని బీసీలకు వైసీపీతోనే న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో టీడీపీ బీసీలకు చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల ముందు బీసీలపై గ్రామకాపరస్తు సీఎం చంద్రబాబునాయుడు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి బీసీలకు న్యాయం చేశారన్నారు. ఇటీవల ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో బీసీల అభివృద్ధికి వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి స్పష్టమైన ప్రణాళిక ప్రకటించారన్నారు. బీసీల అభివృద్ధికి 10వేల కోట్లతో ప్రణాళిక రూపొందిస్తామని టీడీపీ చెప్పిన ఆచరణలో అమలుచేయలేదన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే బీసీలకు రాజ్యాధికారం దక్కుతుందన్నారు. ఒకసారి జగన్‌కు సీఎంగా అవకాశం ఇచ్చి చూడాలని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. మరో నెలరోజుల్లో టీడీపీ గద్దె దిగడం ఖాయమని ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. ఈ సమావేశంలో వైసీపీ సీనియర్ నాయకులు జర్జాపు ఈశ్వరరావు, పువ్వల నాగేశ్వరరావు, వి అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

బిసిల డిక్లరేషన్‌పై వై ఎస్ జగన్‌కు హర్షం వ్యక్తం
జామి, ఫిబ్రవరి 18: వై ఎస్సార్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం ఏలూరులో నిర్వహించిన బిసి గర్జనలో భాగంగా బిసిల డిక్లరేషన్‌పై మండల వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన జామిలో కొత్తలవారి కోవెల వద్ద ఉన్న దివంగత నేత వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైసీపీ నేతలంతాకలసి పాలాభిషేకం చేసి పూలమాలలువేశారు. వైఎస్సార్ జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు గొర్లె రవికుమార్ ఆధ్వర్యంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. వై ఎస్ జగన్మోహన్ రెడ్డి బిసిల సంక్షేమానికి పాటుపడిన దివంగత నేత రాజశేఖరరెడ్డితనయుడుగా ఏలూరులో జరిగిన సభలో బిసిలకు వరాల జల్లు కురిపించారని అన్నారు. బిసిలకి ఏడాదికి 15కోట్లుచొప్పున ముఖ్యమంత్రి అయ్యాక ఐదేళ్ళపాటు 75వేల కోట్లు కేటాయిస్తామని చెప్పడం, అంతేకాకుండా చట్టబద్ధత కల్పిస్తామని చెప్పాడం, బిసి ఉపకులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని అనేక ప్రకటనలతో బిసి వర్గీయులకు చేరువయ్యారని దీనికి వై ఎస్సార్ మండల నాయకులంతా హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాండ్రంగి సంజీవి, గుడివాడ రాజేశ్వరరావు, ముకుంద శ్రీను, గేదెల వెంకటరావు, షేక్ పీర్ సాహెబ్, నెక్కలి సత్యనారాయణ, తోటమధు తదితర నాయకులతోపాటు కార్యకర్తలు ఉన్నారు.

బిసి కులాలకు న్యాయం జగన్‌తోనే సాధ్యం
గజపతినగరం, ఫిబ్రవరి 18: రాష్ట్రంలో బిసి కులస్ధులకు న్యాయం జరగాలంటే వై ఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి తప్పదని వై ఎస్ ఆర్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ గార తౌడు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావులు అన్నారు. సోమవారం గజపతినగరం జాతీయ రహదారి పక్కన గల వై ఎస్ ఆర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బిసిలకు తీరని అన్యాయం చేసిందని, చట్టబద్దతలేని హామీలివ్వడం దారుణమని అన్నారు. తమ పార్టీ బిసిలకు అగ్రస్ధానం కల్పిస్తుందని యాదవులు మృతి చెందితే ఏడు లక్షలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే పదిలక్షలు రూపాయలు చెల్లిస్తామంటూ బహిరంగ సభలో ప్రకటించడం హర్షదాయకమని కొనియాడారు. సమావేశంలో పి ఎసి ఎస్ అధ్యక్షుడు కరణం ఆదినారాయణ, మాజీ ఎ ఎంసి చైర్మన్ పల్లి సంజీవరావు, వైసీపీ ఎస్సీసెల్ నాయకులు పొట్నూరు పుష్పనాధం, కడుబండి రమేష్‌నాయుడు, తదితరులు పాల్గొన్నారు