విజయనగరం

కళాశాల విద్యార్ధులకు ఆరోగ్య తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 18: గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్ధులకు ఆరోగ్య తనిఖీలు సోమవారం నిర్వహించారు. రాష్ట్రీయ బాల శిశు సంక్షేమ కార్యక్రమంలో బాగంగా డాక్టర్ బి.శ్రీలక్ష్మి, డాక్టర్ బి.రవికుమార్‌లు విద్యార్ధులకు పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి బాల సురక్ష పధకం ద్వారా విద్యార్ధులను పరీక్షించి ఏమైనా సమస్యలు ఉంటే పి.హెచ్‌సి, సిహెచ్‌సి, డి ఇ ఐసి కేంద్రాలకు తరలిస్తామని తెలిపారు. ఏడాదిలో రెండుసార్లు విద్యార్ధులకు ఆరోగ్య తనిఖీలు జరుపుతామని అన్నారు. తొలివిడతలో మరుపల్లి, చల్లపేట, మెంటాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల పాఠశాలలు, కళాశాలలకు చెందిన 0-18 సంవత్సరాల పిల్లలకు ఆరోగ్య తనిఖీలు జరుపుతామని అన్నారు. రెండవ విడత ఈనెల ఒకటో తేదిన ప్రారంభించగా ఇంతవరకు 1600మంది విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు యుగంధరి, రమలు తనిఖీలు విజయవంతం కావడానికి సహకరించారు.

ఎంపిఇవొలకు ఉద్యోగ భద్రత కల్పించాలి
గజపతినగరం, ఫిబ్రవరి 18: వ్యవసాయశాఖలో విధులు నిర్వహిస్తున్న ఎంపి ఇవొలకు ప్రభుత్వం ఉద్యోగభద్రత కల్పించాలని ఎంపి ఇవొల సంఘం జిల్లా అధ్యక్షుడు వాడాడ సాయికుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఇక్కడ ఎంపి ఇవొలతో సర్వసభ్యసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ముఖ్యంగా ఎంపి ఇవోలు ఉద్యోగభద్రత లేనందకు ఆవేదన వ్యక్తంచేశారు. వ్యవసాయశాఖ అభివద్ధికి క్షేత్రస్ధాయిలో రైతులకి అనునిత్యం అందుబాటులో ఉండి, రైతులతో మమేకమై సాగుఖర్చులు తగ్గించడంతోపాటు అధికదిగుబడులు పొందుటకు రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తు రైతులు, ప్రజాప్రతినిధులు మన్ననలు పొందిన ఎంపి ఇవోలకు ఉద్యోగభద్రత కరువైందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం రెండెంకల వద్ధి సాధించాం జిల్లాకి అంతర్జాతీయ అవార్డు, రాష్ట్ర అవార్డు సొంతం చేసుకున్న వ్యవసాయశాఖలో కీలకంగా వ్యవహరించిన ఎంపి ఇవొల జీవితాలకు భరోసా కరువైందని అన్నారు. ఇపటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవేతనం నుండి పూర్తి కాంట్రాక్టు పోస్టుగా మార్చి మినిమం టైం స్కేల్ వర్తించేలా చేయాలని కోరారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గజపతినగరం సబ్‌డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఆర్.అన్నపూర్ణకు అందజేశారు.
పశుగ్రాస క్షేత్రాలపై ప్రత్యేక చర్యలు చేపట్టాలి
గజపతినగరం, ఫిబ్రవరి 18: వేసవిని దృష్టిలో పెట్టుకొని పాడి పశువులకు గడ్డి కొరత రాకుండా పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు జరిగిలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్ధానిక తహశీల్ధార్ చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో మండలశాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో అన్నిరకాల అభివద్ధి పనులు మెరుగుపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందజేస్తున్న పసుపు-కుంకుమ చెక్‌లు బ్యాంక్‌లో మహిళకు అందించే విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంక్ అధికారులతో మాట్లాడి డ్వాక్రా మహిళలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైద్యసేవలను గ్రామాలలో పూర్తిస్ధాయిలో అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు, మండల విద్యాశాఖ అధికారి ఎస్.విమలమ్మ, ఎపివొ కృష్ణవేణి, ఐసిడి ఎస్ సూపర్‌వైజర్ విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

డప్పు కళాకారుల జీవోను అమలు చేయాలి
గజపతినగరం, ఫిబ్రవరి 18: డప్పు కళాకారుల కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణమే అమలు చేయాలని ఎపి డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు తంటిపాక రాము డిమాండ్‌చేశారు. సోమవారం సమస్యల పరిష్కరించాలని కోరుతూ గోడపత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డప్పు కళాకారులు, చర్మకారులకు ఫించన్లు ఇస్తామని ప్రభుత్వం మాటలు చెబుతున్నదే తప్పా ఆచరణలో ఏఒక్కరికి ఫించన్లు నేటివరకు ఇచ్చే దాఖలాలు లేవన్నారు. సామాజిక ఫించన్లు పెంచిన ప్రభుత్వం డప్పు కళాకారులకు మాత్రం ఫించను ఎంత ఇస్తారో స్పష్టత ఇవ్వలేదన్నారు. ఫించన్లు కోసం దరఖాస్తు చేసి మూడు నెలలు కావస్తుందన్నారు. కళాకారులకు గుర్తింపుకార్డులు ఇవ్వడంతో పాటు సమస్యలు పరిష్కరించాలని పలుసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. డప్పు కళాకారులకు దుస్తులు, గజ్జెలు, డప్పులు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు దేవాస్ధాన కార్యక్రమాలలో వీరికి సముచితస్ధానం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకుల రాకోటి సింహాచలం, కండి రవి, యజ్జల ఆశ తదితరులు పాల్గొన్నారు.