విజయనగరం

ఉగ్రవాదం అంతం.. అదే మన పంతం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, ఫిబ్రవరి 18: ఉగ్రవాదం అంతం మన లక్ష్యం కావాలని సామాజిక కార్యకర్త ఉప్పలపాటి సత్య సంజయ్ వర్మ అన్నారు. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో అమరులైన సి ఆర్‌పి ఎఫ్ జవాన్లు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ గజపతినగరంలోని నాలుగు రోడ్లు జంక్షన్‌లో జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి రెండు నిముషాలు వౌనం పాటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికులపై ఉగ్రవాదులు పొట్టన పెట్టుకోవడం దారుణమన్నారు. దేశ రక్షణ కోసం భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. తక్షణమే కాశ్మీర్‌లో నిఘా వ్యవస్ధను పటిష్ట పరిచి శాంతి నెలకొల్పాలని కోరారు. కాశ్మీర్‌లో వీర మరణం పొందిన అమర జవాన్లు ఆత్మలకు శాంతి కలగాలని కోరుతూ వేలాదిమంది విద్యార్ధులు వర్మరాజు నేతృత్వంలో గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వీరంతా జాతీయ పతాకాలు చేటపట్టుకొని భారత్ మాతాకీ జై, అమర వీరులకు జోహర్ తదితర నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో సామాజిక కార్యకర్తలు చల్లా రామారావు, ఎం ఎస్ ఎన్ రాజులతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల, సాయిసిద్దార్ధ, హర్షవర్ధన్ హైస్కూల్, శ్రీ కృష్ణ విద్యాపీఠ్ పాఠశాలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.
అమరవీరులకు ఘన నివాళి
సీతానగరం, ఫిబ్రవరి 18: అమరవీరులకు ఘన నివాళి అర్పిస్తు సీతానగరంలో ప్రజలు, వర్తకులు, ప్రజాప్రతినిదులు ర్యాలీ నిర్వహించారు. సోమవారం సీతానగరం మండల కేంద్రం గుండా కొవ్వుత్తులతో అమరవీరులకు జోహోర్లు అర్పిస్తు ప్రజలు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా టీడీపీ నాయకులు కె కిశోర్‌కుమార్, తిరుపతిరావు, బుడితి శ్రీనివాసరావు, వర్తక సంఘం నాయకులు విశే్వశ్వరరావు, సత్యనారాయణలు మాట్లాడుతూ దేశం కోసం తమప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్న వీరసైనికుల సేవలను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
సైనికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా ర్యాలీ
జామి, ఫిబ్రవరి 18: ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో హైవే రహదారిపై ఉగ్రవాదులు భారత సైనికులపై దుర్మార్గపు దాడికి నిరసనగా అలమండలో ర్యాలీ నిర్వహించారు. మండలంలో అలమండ గ్రామ ప్రాథమిక వైద్య శాల సిబ్బంది అమరావతి కళాశాల విద్యార్థులు, వైద్యుడు తూర్పాటి వెంకటరావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కొంతసేపు వౌనం పాటించారు.
అమర సైనికులకు మా జోహార్లు
కొత్తవలస, ఫిబ్రవరి 18: జమ్మూ కాశ్మీర్‌లో పోల్‌వామా వద్ద జరిగిన ఉగ్రదాడిలో వీర మరణం పొందిన సైనికులకు ఇవే మాజోహార్లు అంటూ అభ్యాస్ పాఠశాల విద్యార్థులు కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ జగదీష్‌తో కలసి విద్యార్థులంతా అమరవీరులకు శాంతి కలగాలని కొవ్వొత్తులు వెలిగించి వౌనం పాటించారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పిరికిబంద చర్యగా పాకిస్తాన్ అండతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని వారికి తగిన సమాధానం భారత్ చెబుతుందని అన్నారు. ఉగ్రదాడిలో మరణించిన సైనిక కుటుంబాలకు అభ్యాస్ పాఠశాల తరపున ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. వీరమరణం పొందిన సైనికుల వంటి 120కోట్లు భారతీయులు ఉన్నారని, త్వరలోనే ఉగ్రవాదులకు సరైన సమాధానం చెబుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
గుర్లలో జనసేన కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ
గుర్ల, ఫిబ్రవరి 18: కాశ్మీర్‌లో జరిగిన దాడిన ఖండిస్తూ జనసేన కార్యకర్తలు మండలంలో పలు గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దురదృష్ట సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. వీర జవానుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాబూరావు, మోహన్, సీనియర్ కార్యకర్తలు రమణ, నూకరాజు, గౌరినాయుడు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.