విజయనగరం

రాబోయే ఎన్నికలను ఛాలంజ్‌గా తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ, ఫిబ్రవరి 20: మండలంలో జరగబోయే స్థానిక ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికలను మండలంలో ఉన్న శాఖాధికారులంతా ఛాంజ్‌గా తీసుకుని పనిచేయాలని తహశీల్దార్ రామారావు అన్నారు. తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎన్నికలు విధులు నిర్వహించబోయే రూట్ ఆఫీసరు, పైస్థాయి విధులు నిర్వహించబోయే అధికారులు పోలీస్ స్టేషన్లను సక్రమంగా ఉన్నాయాలేదా, లోపాలు లేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని చెప్పారు. అనంతరం ఎన్నికల ఓటింగ్ యంత్రాలను ప్రత్యక్షంగా చూపించి ఓటింగ్ వేసే విధానం వాటి జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎండీవొ నర్సింహరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సరుకులను సక్రమంగా విడిపించుకోకపోతే చర్యలు
పూసపాటిరేగ, ఫిబ్రవరి 20:మండలంలో గల రేషన్ డిపోల డీలర్లు నిత్యావసర సరుకులు సక్రమంగా విడిపించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ రామారావు హెచ్చరించారు. మండల డీలర్ల సమావేశం పూసపాటిరేగలో భోగాపురం సిఎస్‌డిటి విజయభాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తహశీల్దార్ రామారావు మాట్లాడుతూ డీలర్లు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని వస్తువులను విధిగా విడిపించాలని అన్నారు. నిత్యావసర వస్తువుల విషయంలో డీలర్లు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ డిపోల్లో సమయపాలనతోపాటు ధరల పట్టీలను బోర్డులో విధిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశానికి ఎక్కువ శాతం మంది డీలర్లు హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా ఎన్నికల విధులకు అధికార సిబ్బందికి సహకరించాలని ఈ సందర్భంగా ఆన్నారు. ఈ కార్యక్రమంలో జి ఎస్‌డిటి విజయ్‌భాస్కర్ డీలర్లు పాల్గొన్నారు.

జగన్‌తోనే రాష్ట్భ్రావృద్ధి
* మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు
నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సిఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. బుధవారం మొయిద, నారాయణపట్టణం, కొండవెలగాడ గ్రామాలలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. వైసీపీ నవరత్నాలను కాపీ కొట్టి ఒక్కొక్కటి సిఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని అన్నారు. పింఛన్లు పెంపు, డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ నిధులు, అన్నదాత సుఖీభవ, నిధులు లబ్దిదారులకు వస్తున్నాయంటే జగన్మోహన్‌రెడ్డి చలవేనని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీచేయకుండా మోసం చేశారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిఎం సిఎం అయితే బిసిలకు ఇతర అణగారిన కులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమత్స సాంబశివరాజు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సింగ్‌బాబు, జడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంభళ్ళ శ్రీరాముల నాయుడు, మండల శాఖ అధ్యక్షుడు చనుమళ్ల వెంకటరమణ, నాయకులు నక్కాన వెంకటరావు, మహంతి గణపతి తదితరులు పాల్గొన్నారు.

దళితులపై అనుచిత వ్యాఖ్యలు తగవు
* వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు
నెల్లిమర్ల, ఫిబ్రవరి 20: దెందులూరు శాసన సభ్యులు ప్రభాకర్ దళితులపై అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజానికి సిగ్గుచేటని వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగాన శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అత్యున్నతమైన పదవి అయిన రాష్టప్రతి దళిత వ్యక్తి అని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలని అనుకోరని గతంలో చెప్పినట్లు గుర్తుచేశారు. అలాగే టీడీపీ నాయకులు వర్ల రామయ్య ఎస్సీలు భాగా చదవుకోరని అనడం చాలా బాధాకరమని అన్నారు. రాజ్యాంగ రచయిత అంబేద్కర్ దళిత వ్యక్తి అని గుర్తు చేశారు. దళితులను అగౌరవ పరుస్తున్న నాయకులు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో రేగాన శంకరరావు, రేగాన సంతోషి, అచ్చిబాబు, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ఏర్పాట్లకు పీవో పరిశీలన

పార్వతీపురం, ఫిబ్రవరి 20: ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను పార్వతీపురం ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఐటిడి ఎ ప్రాజెక్టు అధికారి డాక్టర్ జి.లక్ష్మీశ, సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్‌లు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్నికల మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌కు అవసరమయ్యే స్థల ఏర్పాట్లు పరిశీలించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌తో పాటు రిసెప్షన్ సెంటర్‌ను తనిఖీలు చేశారు. ఈకార్యక్రమంలో పార్వతీపురం తహశీల్దారు కరణం వెంకట ఈశ్వరరావు, డిప్యూటీ తహశీల్దారు గొట్టాపుశ్రీరామ్మూర్తి, సత్యలక్ష్మీకుమార్, సర్వేయర్ యజ్ఞేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నా క్యాంటిన్ పరిశీలన
పార్వతీపురం, ఫిబ్రవరి 20: పార్వతీపురంలోని బెలగాంలో నిర్వహిస్తున్న అన్నాక్యాంటిన్ నిర్వహణను బుధవారం ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశ, సబ్ కలెక్టర్ టి ఎస్ చేతన్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు క్యాంటిన్‌లోని భోజన, అల్పాహార ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు నిర్వాహకులను తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్న భోజన సమయంలో క్యాంటిన్‌లో భోజనం చేస్తున్న ప్రజలకు భోజన సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న వారితో కూడా మాట్లాడి ఇలాంటి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. పేదల కోసం ఏర్పాటు ఈక్యాంటిన్ వల్ల ఎంతో మంది పేదలకు ప్రయోజనం చేకూరుతుందని వారు అభిప్రాయపడ్డారు.