విజయనగరం

పరిశ్రమల కేంద్రంగా కొత్తవలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, ఫిబ్రవరి 20: పరిశ్రమల కేంద్రంగా కొత్తవలస కొత్తరూపు సంతరించుకోనుంది. కొత్తకొత్త సంస్థలు తమ శాఖలను నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకునే విధంగా పలు పరిశ్రమలు ముందడుగు వేస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో చిన్న పరిశ్రమల కేంద్రంగా కొత్తవలస పేరొందింది. 25కుపైగా టైల్స్ మిల్లులు, 15కుపైగా ఆయిల్ మిల్లులు, రెండు జూట్ మిల్లులు, మూడు ఫెర్రో అల్లాయిస్ కర్మాగారాలు ఉండేవి. ఇప్పడు అవి సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి.మరలా తన పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని పలువురు పారిశ్రామిక వేత్తలు అభిప్రాయ పడ్డారు. నూతనంగా బహుళజాతి సంస్థ పతంజలి తమ ఉత్పత్తులను ప్రారంభించేందుకు చినరావుపల్లి వద్ద సుమారు 176 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. అలాగే బలిఘట్టం వద్ద ఎపి ఐఐసి ద్వారా 66 ఎకరాల భూములు పలు కంపెనీలకు కేటాయించారు. రెండు సిమెంట్ కంపెనీలు రానున్నాయని అధికారులు తెలియజేశారు. ఇప్పటికే గిరిజన యూనివర్సిటీ పనులు ప్రారంభించారు. కొన్ని ప్రభుత్వ సంస్థలైన వ్యవసాయ,హౌసింగ్, మార్కెటింగ్ వంటి పలు శాఖలకు సబ్ డివిజన్‌గా కొత్తవలస కేంద్రంగా పనిచేస్తున్నది. రైల్వే జంక్షన్ కొత్తవలసకు కలసి వచ్చే అంశం. విశాఖకు కూతవేటు దూరంలో ఉండడం అభివృద్ధికి కలసి వస్తుందని అంచనా. ట్రాఫిక్ పరంగా కొంత ఇబ్బంది ఉన్నా దానిని అధిగమించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్తవలస అభివృద్ధి రానున్న ప్రభుత్వంపై కూడా ఆధారపడి ఉంది. ఏదేమైనా రానున్న రెండు,మూడేళ్ళల్లో కొత్తవలస పారిశ్రామిక కేంద్రంగా రూపుదిద్దుకోవడం ఖాయమని స్థానికుల అభిప్రాయం. త్వరలో నగర పంచాయతీ కూడా కానున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్‌లు
గజపతినగరం, ఫిబ్రవరి 20: నిరుపేదల ఆకలి తీర్చేందుకు అన్నక్యాంటీన్లు ధ్యేయమని స్ధానిక జెడ్పీటీసీ మక్కువ శ్రీధర్ అన్నారు. బుధవారం గజపతినగరంలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్‌ను జెడ్పీటీసీ శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటీకీ సంక్షేమ పధకాలు అమలులో ఏ మాత్రం వెనకంజ వేయడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు ప్రజల కళ్లలో ఆనందం చూడాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే చంద్రబాబును ఆశీర్వదించాలని కోరారు. అన్న క్యాంటీన్ భవన నిర్మాణం కావడానికి సమయం పడుతుందని, అయితే నియోజకవర్గ కేంద్రంలో కేంద్రాన్ని ప్రారంభించాలనే ధ్యేయంతో తాత్కలికంగా వేరే చోట ప్రారంభించామని అన్నారు. భవన నిర్మాణం పూర్తికాగానే అక్కడికి తరలిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనార్ధనరావు, ఆత్మా కమిటీ చైర్మన్ అట్టాడ లక్ష్మునాయుడు, సి హెచ్‌సి చైర్మన్ మిత్తిరెడ్డి వెంకట రమణ, ఎంపిటిసి నగర ప్రసన్నకుమారి, టీడీపీ నాయకులు మజ్జి రామునాయుడు, కర్రి నానాజీ, మెట్ట శ్రీనివాసరావు, గజపతినగరం కార్యనిర్వహణ అధికారి రామకృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు.

బాలిక విద్య ప్రోత్సహించడమే ధ్యేయం
గజపతినగరం, ఫిబ్రవరి 20: బాలిక విద్యను ప్రోత్సహించడమే ప్రభుత్వ ధ్యేయమని మండల ప్రాదేశిక సభ్యుడు కరుమజ్టి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని ముచ్చెర్ల గ్రామంలో బడికొస్తా పధకంలో భాగంగా మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్ధినులకు సైకిళ్లు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా బాలికల విద్య విషయంలో తల్లిదండ్రులు చిన్న చూస్తుంటారని తెలిపారు. వారి డ్రాపౌట్స్‌ను నివారించేందుకు దోహపడుతుందని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.నాగేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత వాతావరణంలో పల్లెలు నిలవాలి
బొండపల్లి, ఫిబ్రవరి 20: రానున్న ఎన్నికలు దృష్ట్యా పల్లెలో వేడెక్కుతున్న రాజకీయాలకు క్షణికావేశాలకు పోకుండా పల్లెలలు ప్రశాంతంగా నిలవాలని స్ధానిక ఎస్ ఐ సాగిరాజు కృష్ణవర్మ కోరారు. బుధవారం మండలంలోని బి.రాజేరు, చినతామరాపల్లి గ్రామాలలో ప్రజలతో మమేకయి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రలోభాలకు, పాత కక్షలకు పోరాదన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా యువత తగాదాలకు దూరంగా ఉండాలని తెలిపారు. యువత పల్లెలలో ఆదర్శంగా పని చేయాలని అన్నారు. అలాగే అసాంఘిక కార్యకలాపాలు విడనాడాలని కోరారు. జూదం, మద్యం, కోడి పందాలు వంటి కార్యకలాపాలు గ్రామాలలో బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అనంతరం చట్టాలపై అవగాహన కల్పించి జరగబోవు పరిణామాలను వివరించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు చల్లా చెల్లంనాయుడు, పిల్ల గురునాయుడు, తదితరులు పాల్గొన్నారు.

మిమ్స్ వైద్యశిబిరం విజయవంతం
గజపతినగరం, ఫిబ్రవరి 20: మండలంలోని ముచ్చెర్ల గ్రామంలో బుధవారం మిమ్స్ వైద్యశిభిరం విజయవంతంగా జరిగింది. నెల్లిమర్లకు చెందిన మిమ్స్ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిభిరంలో భాగంగా వైద్య శిభిరం నిర్వహించారు. ఈ శిభిరంలో నేత్రాలకు సంబందించి డాక్టర్ టి. ఆర్.అభిషేక్ బృందం, దంతాలకు సంబందించి రోగులను డాక్టర్ ఎం.వర్ష, డాక్టర్ సత్యదీపికలు పలు రకాల వ్యాధుల గల రోగులను పరిక్షించారు. అవసరమైన మందులను అందజేశారు. శస్త్ర చికిత్సలు అవసరమైన రోగులను మిమ్స్ ఆసుపత్రికి ఉచితంగా చికిత్స కొరకు తరలించడం జరిగింది. మొత్తం 300మంది రోగులను పరీక్షించారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ అధికారి సి హెచ్ విక్గోరియా ఆధ్వర్యంలో జరిగింది.

ఘనంగా వీరజవాన్లకు కొవ్వొత్తులతో ర్యాలీ
పూసపాటిరేగ, ఫిబ్రవరి 20: మండలంలోని కొవ్వాడ గ్రామంలో వీరజవాన్ల మృతికి సంతాపంగా గ్రామానికి చెందిన గ్రామస్తులు వై ఎస్ ఆర్ సిపి యువజన నాయకుడు కోట్లరఘు ఆధ్వర్యంలో భారీ ఎత్తున శాంతి ర్యాలీ బుధవారం జరిగింది. వీర జవాన్ల మృతికి కారణమైన ఉగ్రవాద చర్యను ఖండిస్తూ గ్రామానికి చెందిన 500మంది భారీ జనంతో గ్రామ పురవీధుల్లో కొవ్వొత్తుల ప్రదర్శనతో శాంతి ర్యాలీ జరిగింది. అమరవీరులకు జోహారు, ఉగ్రవాదులను తరిమికొట్టాలంటూ శాంతి ర్యాలీలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కోట్ల పరిసినాయుడు, గ్రామపెద్దలు, యువకులు పాల్గొన్నారు.