విజయనగరం

గిరిజన గ్రామాలకు ఫైబర్ నెట్ సౌకర్యాలకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం, మార్చి 12: గిరిజన గ్రామాలకు ఫైబర్‌నెట్ సౌకర్యం కోసం చర్యలు తీసుకుంటున్నట్టు పీవో డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మంగళవారం ప్రాజెక్టు అధికారి ఫైబర్‌నెట్ బృందంతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గిరిజన గ్రామాలకు, గూడలకు, ఇళ్లకు గిరినెట్ సౌకర్యం కల్పించడానికి చర్యలు నిమిత్తం గిరినెట్ సి ఇవో, ఎండి, ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ధినేష్ కుమార్ బృందానికి సంబంధించి కమర్షియల్ ఇడి హరికృష్ణ, జి ఎం సతీష్ పీవోను కలిసి వివరాలు తెలిపారు. ఈ ఫైబర్ నెట్ ద్వారా గిరిజన గ్రామాల్లో ప్రతి ఇంటికి టివి,్ఫన్, నెట్ సౌకర్యం రానుందని కనీసం రెండునెలల సమయంలో ఈఅవకాశం పీవో తెలిపారు. ఈఫైటర్ నెట్ ద్వారా గిరిజన గ్రామాలకు ఎంతో సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
శతశాతం పల్స్‌పోలియో విజయవంతం
తెర్లాం, మార్చి 12: మండలంలో గల 32 గ్రామపంచాయతీలలో శతశాతం చిన్నారులకు పోలియోచుక్కలు వేశామని తెర్లాం, పెరుమాళి వైద్యాధికారులు రెడ్డిరవికుమార్, కె మాధవిలు తెలిపారు. గత మూడు రోజులుగా మండలంలో అన్ని గ్రామాల్లో చిన్నారులందరికీ పోలియోచుక్కలు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతానికి మాజీ సర్పంచ్‌లు, ప్రజాప్రతినిదులు సహకరించారన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యారోగ్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

దివ్యాంగుల స్వచ్ఛ్భారత్ కార్యక్రమం
తెర్లాం, మార్చి 12: దివ్యాంగుల స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో స్థానిక రెగ్యూలర్ పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న జడ్పిటీసీ నర్సుపల్లి వెంకటరామలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులు వారి శక్తిమేరకు పరిసరాలను పరిశుభ్రం చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. దివ్యాంగులు అన్నిరంగాల్లో ముందంజలో ఉన్నారన్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. ఈ కార్యక్రమంలో సహిత విద్య సమన్వయకర్త శైలకల్పనతోపాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈశ్వరరావు, ఐఇఆర్‌టీలు ఎస్ పాపారావు, సూర్యారావులు పాల్గొన్నారు.

అగ్నిబాధితులకు ఆర్థిక సహాయం
తెర్లాం, మార్చి 12: మండలం లోచర్ల గ్రామంలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు 7వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని పెరుమాళి ఆదర్శ పాఠశాల తరుపున అందించామని ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఈశ్వరరావు తెలిపారు. ఈమేరకు అగ్నిబాధితులకు తమవంతు సహాయ సహకారాలు అందించామన్నారు. ఈ నిదులను విద్యార్థుల నుంచి సేకరించామన్నారు. బాధితులకు విద్యార్థులు విరాళాలు అందించడం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. అలాగే మరిన్ని చేయూత కార్యక్రమాలను చేసేందుకు తమతోపాటు విద్యార్థులు కూడా ముందంజలో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

6నెలలుగా జీతాలు అందక అవస్థలు
పార్వతీపురం, మార్చి 12: గత ఆరునెలలుగా తమకు జీతాలు అందక అవస్థలు పడుతున్నామని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఐటి ట్రెయినీ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు వారు మంగళవారం పార్వతీపురం ఐటిడి ఎ పీవో డాక్టర్ జి.లక్ష్మీశను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని మొత్తం ఆయాపాఠశాలల్లో 18పాఠశాలల్లో ఐటి విభాగానికి ట్రెయినీ నైపుణ్య వికాసం పథకంలో భాగంగా ఐసిటి అనే సంస్థ ద్వారా నియమితులయ్యామని వారు తెలిపారు. అయితే తమకు ప్రభుత్వం ఆరునెలల నుండి జీతాలు చెల్లించకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్న విషయం ఐటిటి ఏజెన్సీ వారిని అడిగితే ఎపి ఎస్ ఎస్ డిసి బిల్లులు విడుదల కాలేదని చెపుతున్నారని తెలిపారు. అందువల్ల తమకు వేతనాలు అందేవిధంగా చర్యలుతీసుకోవాలని పీవో డాక్టర్ జి.లక్ష్మీశను కలిసి వినతి పత్రం అందించారు.