విజయనగరం

ఎన్నికలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, మార్చి 12: ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం సబ్ కలెక్టర్, కురుపాం నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి టిఎస్ చేతన్ కోరారు. మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5మండలాలకు చెందిన రెవెన్యూ, పోలీస్, రూట్, సెక్టోరియల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు పంపిణీ చేయకుండా నిఘా ఉంచాలన్నారు. ప్రచారం చేపట్టేటప్పుడు చేస్తున్న ప్రతీ చర్యను గమనించాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల విధి నిర్వహణలో బాధ్యతతో నిలిచి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్లు బాధ్యత వహించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతం అయినందున సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కారం కోసం చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో 5మండలాలకు చెందిన తహశీల్దార్లు, పోలీస్ సిబ్బంది, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.
వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలి
జియ్యమ్మవలస, మార్చి 12: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణీ పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలో గల చినమేరంగి గ్రామంలో వైసీపీ 9వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీని ఏర్పాటుచేసి 8 ఏళ్లు పూర్తిచేసి 9వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీని పూర్తిమెజార్టీతో గెలిపించాలన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కురుపాం నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు 5మండలాల్లో గల కార్యకర్తలు, నాయకులు అకుంఠిత దీక్షతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు శతృచర్ల పరిక్షిత్‌రాజు, 5మండలాల పార్టీ కన్వీనర్లు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కిశోరి బాలికలకు క్విజ్ పోటీలు
కురుపాం, మార్చి 12: పోషణ్ అభియాన్ వారోత్సవాలలో భాగంగా అంగన్వాడీ సిబ్బంది కిశోరి బాలికలకు క్విజ్ పోటీలు నిర్వహించారు. మంగళవారం స్థానిక జడ్పీ పాఠశాలలో కిశోరి బాలికలైన విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సూపర్‌వైజర్ సిహెచ్ అరుణకుమారి మాట్లాడుతూ పోషణ్ అభియాన్‌లో భాగంగా పౌష్టికాహారం వినియోగంపై బాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు. శారీరిక ఎదుగుదలకు బాలికలు పూర్తిస్థాయిలో పౌష్టికాహార పదార్ధాలను వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పద్మావతి, ఎస్‌కె గౌరమ్మ, సరోజ, హెచ్‌ఎం జయరాజు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థులకు ఉచితంగా పరీక్షా సామాగ్రి పంపిణీ
కురుపాం, మార్చి 12: కురుపాంనకు చెందిన కొత్తకోట నారాయణమూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారులు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని ఉచితంగా అందించారు. మంగళవారం కురుపాం, శివ్వన్నపేట జడ్పీ పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 150మంది విద్యార్థులకు అట్టలు, పెన్నలు, ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా తన తండ్రి జ్ఞాపకార్థం వీటిని పంపిణీ చేస్తున్నామన్నారు. 10వ తరగతిలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి ఉన్నత విద్యను పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్, రవీంద్రకుమార్, మురళీకృష్ణ, హెచ్‌ఎంలు జయరాజు, పార్వతి, శ్రీరంజిని, అరుణకుమారి, ఆయాపాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.