విజయనగరం

స్వచ్చ్భారత్‌లో దివ్యాంగులు బాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మార్చి 12: స్వచ్చ్భారత్‌లో దివ్యాంగులు భాగస్వామ్యలు కావాలని సహిత విద్య జిల్లా సమన్వయకర్త సైల కల్పన కోరారు. మంగళవారం స్ధానిక భవిత కేంద్రంలో స్వచ్చ్భారత్‌పై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు కూడా సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతూ ప్రతి సామాజిక అంశంలో ముందు ఉండాలని కోరారు. పాఠశాలతోపాటు ఇంటి ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచితే వ్యాధులు దరిచేరవని తెలిపారు. మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. అదే విధంగా వాతావరణంలో వస్తున్న మార్పులను నియంత్రించి ప్రకృతివైపరీత్యాలు నివారించగలుగుతుందని తెలిపారు. దివ్యాంగులు సామాజిక అంశాలలో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. మండల విద్యాశాఖ అధికారి ఎస్.విమలమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు దివ్యాంగులను ప్రతిరోజూ పాఠశాలకు పంపించి వారిలో దాగి ఉన్న విజ్ఞానాన్ని వెలికితీయాలని కోరారు. అంతకు ముందు భవిత కేంద్రం ఆవరణలో మొక్కలు నాటారు. అదే విధంగా పలు నినాదాలు చేస్తూ ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో ఎమ్మార్టీలు కర్రి రామునాయుడు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలతోనే ప్రజల జీవితాలలో వెలుగులు
గజపతినగరం, మార్చి 12: నవరత్నాలతోనే ప్రజల జీవితాలలో వెలుగులు సాధ్యమని మాజీ జెడ్పీటీసీ గార తవుడు అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని రామన్నపేట గ్రామంలో రావాలి జగన్-కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. బాబు అవినీతి పాలనతో విసుగెత్తారని అన్నారు. రాజన్న పాలనకు మించి పాలన అందించేందుకు జగన్మోహనరెడ్డి సిద్దంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబును ఇంటిబాట పట్టించాలని పిలుపునిచ్చారు. జగన్‌తోనే సంక్షేమ పథకాలు సాధ్యపడతాయని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై బాబుకు గుణపాఠం చెప్పాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గేదెల జగదీష్, కరణం ఆదినారాయణ, కనకల సుబ్రహ్మణ్యం, పల్లి సంజీవరావు, మండల సురేష్, ఆల్తిరామునాయుడు, కర్రి రామునాయుడు, పైడిపునాయుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు జాకేరు గ్రామంలో రామాలయ ఐదవ వార్షికోత్సవ వేడుకలు
వేపాడ, మార్చి 12: మండలంలోని జాకేరు గ్రామంలో బుధవారం శ్రీ సీతారామాలయ ఐదవ వార్షికోత్సవం వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహణతోపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా మహిళలకు భజనపోటీలు జరుగుతాయని, తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల జిల్లా స్థాయి యడ్ల పరుగుపందాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. గురువారం పోతుల పందాలు నిర్వహిస్తారని మాజీ సర్పంచ్ బుద్ద చిన్నమ్మలు, బుద్ద అప్పలనాయుడు, ఆలయ కమిటీ మెంబర్లు తెలిపారు.

ఓటు వినియోగం - ఓటు నమోదు ప్రచార రథం
వేపాడ, మార్చి 12: వేపాడ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం తహశీల్దార్ సుమబాల ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇవిఎంల ద్వారా ఓటు వినియోగంపై నూతనంగా ఓటరు నమోదు గురించి విస్తృతంగా ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిటి ఎ. ఉమామహేశ్వరరావు, సర్వేయరు సూర్యప్రకాశరావు, ఎ ఎస్‌వొ ఆర్.కె.రాజు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛత సాధనలో మేము సైతం
బొండపల్లి, మార్చి 12: పర్యావరణ పరిరక్షణ స్వచ్ఛత సాధనలో మేము సైతం అంటూ భవిత కేంద్రం విద్యార్థులు ముందు నిలిచారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో దివ్యాంగులు జాతీయ పూలమొక్కల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పరిసరాలు పరిశుభ్రత పాటిస్తాం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తాం అంటూ ర్యాలీచేపట్టారు. అనంతరం కేంద్రం ఆవరణలో పూలమొక్కలు నాటారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సహిత విద్యా ఉపాద్యాయులు సన్యాసిరావు, గీత తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో గరివిడి విద్యార్థి ప్రతిభ
గరివిడి, మార్చి 12: స్థానిక శ్రీదుర్గాప్రసాద్ షరాఫ్ అటానమస్ డిగ్రీ కళాశాలలో ప్రథమ బిఎస్సీ చదువుతున్న రెడ్డి రవితేజ అనే విద్యార్థి జాతీయ త్రోబాల్ పోటీల్లో విజయనగరం జిల్లా తరపున ఆడి ప్రతిభ కనబరచడం హర్షణీయమని ప్రిన్సిపాల్ కె. చంద్రవౌళి పట్నాయిక్ అన్నారు. మంగళవారం ఇక్కడ కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు. హరియానాలో జరిగిన జాతీయ స్థాయి త్రోబాల్ పోటీల్లో రవితేజ విజయనగరం జిల్లా నుంచి ఎంపిక కావడమే కాకుండా పోటీల్లో ప్రతిభను కనబరచి జాతీయ స్థాయి క్రీడాకారుల మన్ననలు అందుకున్నారని ఆయన అన్నారు. అదే విధంగా గత నెలలో కృష్ణా జిల్లా త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు అర్హల సాధించాడని వివరించారు. ఈ అభినందన సభలో కళాశాల వ్యాయామ ఉపాద్యాయుడు బి. శ్రీనివాసరావు, సిబ్బంది,తోటి విద్యార్థులు విద్యార్ధి రవితేజను అభినందించారు.