విజయనగరం

చంద్రబాబు మళ్ళీ సిఎం అయితేనే స్వర్ణాంధ్ర సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంట్యాడ, ఏప్రిల్ 9: ప్రజా సంక్షేమానికి పాటుపడే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మళ్ళీ సిఎం అయితేనే స్వర్ణాప్రదేశ్ సాధ్యమని జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అన్నారు. తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్న గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి కె. ఎ.నాయుడు విజయనగరం పార్లమెంటు అభ్యర్థి అశోక్ గజపతిరాజుకు మద్దతుగా మండలంలోని బుడతనాపల్లి, గంట్యాడ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం, ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ప్రచార సభలో జడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి పథంలో తీసుకువెళుతున్న చంద్రబాబునాయుడుకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అఖండ విజయం చేకూర్చాలని కోరారు. గ్రామాల అభివృద్ధికే నిరంతరం శ్రమించే నేతలనే ఎన్నుకోవాలని అన్నారు. గజపతినగరం పిహెచ్‌సి అభ్యర్థి కె. ఎ.నాయుడు మాట్లాడుతూ శాసనసభ్యునిగా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని అన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటువేసి తనకు, ఎంపీ అభ్యర్థి అశోక్ గజపతిరాజును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రంధిరామునాయడు, మండల దేశం పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు, బూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు.