విజయనగరం

పోలింగ్ కేంద్రాల పరిశీలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూసపాటిరేగ, ఏప్రిల్ 9: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు గడువు ఒక్కరోజే ఉండడంతో మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎండీవొ వేంకటేశ్వరరావు సిబ్బందితో కలసి మంగళవారం పరిశీలించారు. మత్స్యకార గ్రామమైన పతివాడ బర్రిపేట గ్రామంలో ఉన్న పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పతివాడ, రోలుచప్పుడి గ్రామాలలో ఉన్న పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద విద్యుత్ సదుపాయంతోపాటు త్రాగునీరు, బారికేడ్లు వంటి సదుపాయాలను తప్పనిసరిగా నిర్వహించాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. అలాగే ప్రతి పంచాయతీకి మండలంలో 27 పంచాయతీలు ఉండగా ప్రతి పంచాయతీకి దివ్యాంగుల కోసం వీల్ చైర్లను ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఓటింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు వివరాలను మండలానికి నివేదించేలా సిబ్బంది సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ స్థాయి సిబ్బంది కూడా పాల్గొన్నారు.
బిఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలి
బొండపల్లి, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బూత్‌స్ధాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని తహశీల్ధార్ పి.లక్ష్మీదేవి కోరారు. మంగళవారం స్ధానిక తహశీల్ధార్ కార్యాలయంలో ఆమె బి ఎల్‌వోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా జరగాలని ఆదేశించారు. విలేఖరులకు ప్రత్యేక వాహన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓటర్లకు నీడ, నీటి వసతులు కల్పించాలని అన్నారు. పోలింగ్ బూత్‌ల వద్ద నియమ నిబంధనలు పాటించాలని, అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో ఆర్. ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి సదుపాయాలు
గజపతినగరం, ఏప్రిల్ 9: పోలింగ్ కేంద్రాలలో సిబ్బందికి సదుపాయాలు కల్పించాలని స్ధానిక ఎంపిడివొ జయమాధవి అన్నారు. మంగళవారం మండలంలోని మధుపాడ, మరుపల్లి, గంగచోళ్లపెంట, పట్రువాడ, సాలిపేట గ్రామాలలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎంపిడివొ జయమాధవి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
ఎన్నికలలో హాజరయ్యే సిబ్బందికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఓటర్లకు అన్ని రకాల సౌకర్యాలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మండల పంచాయతీ విస్తరణ అధికారి జి.జనర్ధానరావు తదితరులు పాల్గొన్నారు.

గర్భిణీలకు ప్రతి నెల ఉచితంగా పౌష్టికాహారం పంపిణీ
పూసపాటిరేగ, ఏప్రిల్ 9: పూసపాటిరేగ పిహెచ్‌సి పరిధిలో ఉన్న గర్భిణీలకు ప్రతి నెల తొమ్మిదవ తేదీన పౌష్టికాహారాన్ని అందిస్తామని సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు డి.రామారావు వెల్లడించారు. అందులో భాగంగా పిహెచ్‌సి పరిధిలో ఉన్న గర్భిణీలు ఆరోగ్య పరీక్షలు చేయించుకునేందుకు రావడంతో సత్యసాయి సవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పౌష్టికాహారాన్ని పిహెచ్‌సి వైద్యాధికారి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు బి. రామారావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల తొమ్మిదవ తేదీన ఎంతమంది ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడానికి వస్తే అంతమందికి పౌష్టికాహారాన్ని అందించేందుకు తమ సేవా సంస్థ సిద్ధంగా ఉందని అన్నారు. తాజాగా 70మంది గర్భిణీలు ఆరోగ్య పరీక్షలకు రాగా వారందరికీ ఉచితంగా భోజనసదుపాయాలు కల్పించడమేకాకుండా అదనంగా ఎంతమంది వస్తే అంతమందికి కూడా అన్నదాన సదుపాయాన్ని కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి సిబ్బంది శాంతి స్వరూప్, హెల్త్ అసిస్టెంట్ రమణ, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.