విజయనగరం

మే22 వరకూ పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లిమర్ల, ఏప్రిల్ 9: ఎన్నికల విధులకు హాజరయ్యే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు మే 22వ తేదీ వరకూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు అవకాశం ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి గోవర్థనరావు తెలిపారు.మంగళవారం ఆర్ ఓ విలేకరులతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ దరఖాస్తుకు మంగళవారంతో గడువు ముగిసిందన్నారు. ఇంతవరకూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేయని వారు తమ ఓట్లను నేరుగా నెల్లిమర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్‌లోవేయడం గాని, పోస్టల్ ద్వారాగాని తమ ఓటును పంపించొచ్చని వెల్లడించారు. అలాగే బుధవారం ఉదయం స్ట్రాంగ్ రూం వద్ద ఉదయం 7గంటలు నుంచి ఎన్నికల సిబ్బందికి ఇ వి ఎంలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.నియోకవర్గంలో 30 రూట్లకుగాను 35 వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సిబ్బంది వాహనాలను జి పి ఎస్ ద్వారా మోనిటరింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇంతవరకూ ఎన్నికలకు హాజరయ్యే ఉద్యోగులు, ఉపాధ్యాయులు 1153 మంది పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు.126 మంది ప్రయివేటు కళాశాలల అధ్యాపకలను ఎన్నికల విధుల నుంచి తప్పించామని చెప్పారు. వారి స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను నియమించామన్నారు.గురువారం ఉదయం 7గంటలు నుంచి సాయంత్రం 6గంటలు వరకూ ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని అన్నారు. ఈయనతో పాటు ఎంపిడి ఓ కె అక్కారావు ఉన్నారు.

పోలింగ్‌స్టేషన్‌ల పరిశీలన
నెల్లిమర్ల, ఏప్రిల్ 9: నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధిలోని పోలింగ్‌స్టేషన్‌లను కమిషనర్ ఎం రవిసుధాకర్ పరిశీలించారు.మంగళవారం ఆయన పోలింగ్‌స్టేపన్ నెంబర్ 16 నుంచి 35 వరకూ పరిశీలించి వౌలికసౌకర్యాలు ఉన్నాయాలేదన్నది పరిశలించారు.పోలింగ్‌స్టేషన్‌లు వద్ద మరుగుదొడ్లు, తాగునీరు, లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పోలింగ్‌స్టేషన్‌లు వద్ద పారిశుధ్యం మెరుగుపర్చాలని పారిశుధ్య మేస్ర్తిలకు ఆదేశించారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడానికి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు.సౌకర్యాలు లేని పోలింగ్‌స్టేషన్‌వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల సామగ్రి పంపిణీకి సర్వం సిద్దం
* ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె.వి.మురళి

గజపతినగరం, ఏప్రిల్ 9: ఎన్నికల నిర్వహణకు సంబందించిన సామగ్రి పంపిణీ చేయడానికి సిద్దంగా ఉన్నామని గజపతినగరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె.వి.మురళి అన్నారు. మంగళవారం ఆర్వో మురళి విలేఖరులతో మాట్లాడుతూ గజపతినగరం నియోజకవర్గానికి సంబందించి 32 సెక్టార్లకుగాను 16 కౌంటర్లు ద్వారా సామగ్రి పంపిణీ చేస్తామని తెలిపారు. పివోలు, ఏపీవోలు, ఓపివోలకు కేటాయించిన గదులలో నియమకాలు ఉతర్వులు అందిస్తామని చెప్పారు. ఏ పోలింగ్ కేంద్రానికి నియామకం అయిందో చెక్‌లిస్టు అందిస్తామని అన్నారు. 32సెక్టార్లుకు గాను 84 బస్సులు, జీపులు, కార్లు, మినీ బస్సులు ఏర్పాటు చేశామని అన్నారు. సుమారు 1512మంది సిబ్బందికి సామాగ్రి అందజేస్తామని చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా వివిధ కళాశాలలకు చెందిన జాతీయ సేవా పధకం విద్యార్ధుల సేవలు కూడా తీసుకుంటున్నామని అన్నారు. బుధవారం గజపతినగరం జూనియర్ కళాశాలలో 2,337మంది పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అదే విధంగా శాంతిభద్రతల గురించి పోలీస్‌శాఖ వారితో చర్చించామని చెప్పారు. గజపతినగరం, దత్తిరాజేరు, మెంటాడ, బొండపల్లి మండలాల తహశీల్ధార్లు సహకారంతో ఎన్నికలకు సంబందించిన పనులు వేగవంతం చేశామని చెప్పారు. అదే విదంగా సిబ్బందికి సంబందించిన వాహనాలు వివిధ ప్రాంతాలలో పార్కింగ్ చేసేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఆదరించండి ... ఆశ్వీరదించండి!
* టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ నాయుడు
గజపతినగరం, ఏప్రిల్ 9: సార్వత్రిక ఎన్నికలలో తనను ఆదరించి మరలా ఆశీర్వదించాలని టీడీపీ అభ్యర్ధి డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు కోరారు. మంగళవారం గజపతినగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపట్టానని, ఇది కొనసాగాలంటే మరలా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ పధకాలు అమలు చేసి అందరి ఆదరాభిమానాలు పొందుతున్నారని చెప్పారు. జగన్ వస్తే రాష్ట్రం అంధకారం అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కరణం శివరామకృష్ణ, మాజీ మంత్రి పడాల అరుణ, తదితరులు పాల్గొన్నారు.