విజయనగరం

చేనేత సొసైటీలను బలోపేతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), మే 17: కేంద్ర ప్రభుత్వం ఖాదీ, గ్రామీణ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు ఆర్థికంగా చేయూతను ఇవ్వాలని జిల్లా బిజెపి నాయకులు కేంద్ర ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సభ్యుడు జి.చంద్రవౌళికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సభ్యుడు చంద్రవౌళిని పట్టణంలోని జడ్పీ అతిథి గృహంలో కలసి చేనేత సొసైటీలు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా బిజెపి మాజీ అధ్యక్షుడు శివప్రసాద్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ముద్దాడ మధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు చంద్రవౌళి మాట్లాడుతూ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద దక్షిణ భారతదేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 180కిపైగా చిన్న పరిశ్రమలు ఉన్నాయని, వీటిని అభివృద్ధి చేయడంద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపాధి కల్పన నిరుద్యోగులకు లభిస్తుందని అన్నారు. 24 గంటలు విద్యుత్‌ను అందిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోడీ స్థానంకల్పించారని చెప్పారు. నిరుద్యోగ యువత బోర్డు సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కుసుమంచి సుబ్బారావు, మంత్రిప్రగడ విద్యాస్వరూప్, రామచంద్రరావు, భాషా పాల్గొన్నారు.