విజయనగరం

మహిళా సంఘాలకు చేపల చెరువులు : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మే 23: మహిళా సంఘాలకు గ్రామాలలో చేపల చెరువులను గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా కేటాయించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చేపల చెరువుల కేటాయింపు, పారిశుద్ధ్యం, బహిరంగ మలవిసర్జన నిర్మూలన అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో మత్స్యకార సొసైటీలు నిర్వహిస్తున్న చేపల చెరువులను మినహాయించి ఇంకా పంచాయితీల్లో చెరువులు ఉంటే గుర్తించి తీర్మానం ద్వారా గ్రామాల్లోని మహిళా సంఘాలకు వాటిని కేటాయించాలని తెలిపారు. జిల్లాలో నాలుగువేల చెరువుల్లో చేపల పెంపకం లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టంచేసారు. ఏరోజు ఏ గ్రామాల్లో మహిళా సంఘాలకు చేపల చెరువులు కేటాయించిన నివేదికలు ప్రతి రోజు పంపాలని చెప్పారు.ఈసమావేశంలో జడ్పీ సిఇఓ రాజకుమారి, డిపిఓ సత్యనారాయణ రాజు, మత్స్య శాఖ ఎడి ఫణిప్రకాష్ పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పరిశ్రమల రంగం అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ చెప్పారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ థాయిలాండ్ వంటి చిన్న దేశంలో పరిశ్రమల ద్వారా 30శాతం ప్రగతిని సాధించారని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని చెప్పారు. ఇందుకు సత్వర చర్యలు తీసుకోవాలని అన్నారు. పరిశ్రమలు ఏర్పడితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.

చంద్రన్న బీమా-కార్మికులకు భరోసా
గజపతినగరం, మే 23: చంద్రన్న బీమా కార్మికులకు భరోసా లాంటిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కె.ఎ.నాయుడు అన్నారు. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అసంఘటిత రంగ కార్యికుల భరోసాకోసం చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశ పెట్టిందని దీనిని కార్మికులు సద్వినియోగంచేసుకోవాలని అన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్యపై ఆశాఖ డిఇ డి.ఎం.కె. రెడ్డికి పలు సూచనలు చేసారు. వేసవి కొద్దిరోజులలోను గ్రామాలలో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇంకుడు గుంతలను త్వరతగతిన పూర్తిచేయాలని ఎండిఏ అరుంధతిదేవిని ఆదేశించారు. ఇప్పటి వరకు తీసిన ఇంకుడు గుంతలను పూర్తిస్థాయిలో కప్పివేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన ఆయన విలేఖరులతోమాట్లాడుతూ కార్మికులకు చంద్రన్న బీమా ఎంతో ప్రయోజనకరమైనదని చెప్పారు. ఈ బీమా కింద ప్రమాదవసాత్తు మరణిస్తే ఐదు లక్షలు, సాధారణంగా మృతి చెందితే 30వేల రూపాయలు ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. 18-70 ఏళ్లలోపు కార్మికులు తమ పేర్లను సంబంధిత అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని అన్నారు. దీనికి ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదని చెప్పారు. ఈ బీమా పథకంపై అవగాహన సదస్సు గజపతినగరం వెలుగు కార్యాలయంలో మంగళవారం నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పారు. గజపతినగరం పట్టణాన్ని స్వచ్ఛ గజపతినగరంగా మార్చుతామని అన్నారు. ప్రణాళిక ప్రకారం స్వచ్ఛ గజపతినగరం చేయడమే లక్ష్యమని అన్నారు. కార్యక్రమంలో ఎంపిపి గంట్యాడ శ్రీదేవి, ఎంపిటిసి మక్కువ శ్రీధర్, టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్వి రావిశ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు గండ్రేటి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

వడదెబ్బతో ఒకని మృతి
గరివిడి, మే 23: పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద తోపుడు బండి వ్యాపారి సింహాచలం(60) అనే వ్యక్తి వడదెబ్బకు గురై మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రతి రోజులాగే ఇక్కడి సెంటర్ వద్ద కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే సింహాచలం రోడ్డు పక్కన తోపుడుబండి వద్ద నిలబడి ఒక్కసారిగా కూలబడిపోయాడు. పరిస్థితిన గమనించిన చుట్టుపక్కల వ్యాపారులు సపర్యలు చేసి వైద్యానికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. సోమవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో రోడ్డుపై వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే కుటుంబ యజమాని వడదెబ్బకు మృత్యువాత పడడంతో కుటుంబం రోడ్డున పడింది.