విజయనగరం

ఎన్నికల హామీలు పక్కదోవ పట్టించేందుకే దీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 2: అధికారం చేజిక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకే నవనిర్మాణ దీక్ష పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయ చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు యడ్ల ఆదిరాజు ఆరోపించారు. ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైన విషయాన్ని ప్రజలు చర్చించుకోకుండా నవనిర్మాణ దీక్షల పేరిట రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని విమర్శించారు. గురువారం జిల్లాకాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆదిరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు అనుకూలంగా రెండుసార్లు పార్టీ ద్వారా చంద్రబాబునాయుడు లేఖలు ఇప్పించారని, విభజన అనంతరం మాటమార్చి కాంగ్రెస్ పార్టీపై, యుపి ఎ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసారని అన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏమి కావాలో తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశాన్ని చంద్రబాబునాయుడు బహిష్కరించి సమస్యను జఠిలం చేసారని చెప్పారు. విభజన తరువాత రాష్ట్రానికి ఏమి కావాలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ఇప్పటికీ స్పష్టంగా చెప్పడంలేదని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబు సమైఖ్యాంధ్ర ఉద్యమాలు జరిగిన ప్రదేశాలలో నవనిర్మాణ దీక్షలు నిర్వహించడం ద్వారా పాతగాయాలను గుర్తుచేయడం మంచిదికాదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఇపుడు కోరుకుంటున్నది, ప్రత్యేక హోదా తప్పా దీక్షలు కాదని తెలిపారు. టిడిపి మహానాడులో సామాజిక న్యాయంపై గొప్పలు చెప్పిన రెండురోజులకే పెట్టుబడిదారులకు రాజ్యసభ స్థానాలు కట్టిబెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో పార్టీనాయకులు జగన్మోహనరావు, కరీం, అప్పారావు, పైడిరాజు పాల్గొన్నారు.