విజయనగరం

పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ పల్స్ సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 3: జిల్లాల్లో ఆర్థిక, సామాజిక గణన వివరాలు సేకరించేందుకు పైలెట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహించాలని నిర్ణయించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పి ఠక్కర్ తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రతి జిల్లా నుంచి రెండు పట్టణాలు, రెండుగ్రామాలను ఎన్యుమరేషన్ బ్లాకులుగా ఎంపికచేసి ఆర్థిక, సామాజిక గణన వివరాలు సేకరించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఫైలెట్ ప్రాజెక్టుకింద చేపడుతున్న ఈ కార్యక్రమం విజయవంతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఫైలెట్ ప్రాజెక్టు కింద సర్వే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గత ఏడాది జాతీయ జనాభా గణన చేపట్టామని కొత్తగా మంజూరైన ఆధార్, రేషన్ కార్డుల వివరాలను అప్‌లోడ్ చేసామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లాపరిషత్ సిఇఓ రాజకుమారి, ముఖ్య ప్రణాళిక అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.