విజయనగరం

కమ్ముకున్న మేఘాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూన్ 3: రోహిణి ఎండలతో ఠారెత్తిపోతున్న విజయనగరం జిల్లా ప్రజలు శుక్రవారం వాతావరణ చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు. తెల్లవారుజాము నుంచే ఆకాశం మేఘావృతమయి కొద్దిసేపు తుంపర వర్షం కురిసింది. ఆ తరువాత వర్షం ఆగిపోయినా చల్లగాలులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అడపాతడపా ఉరుములు, మెరుపులతో రోజంతా వాతావరణ చల్లగా మారింది. 10రోజుల నుంచి రోహిణి ఎండలతో విజయనగరం జిల్లాప్రజలు వేసవి తాపాన్ని భరించలేక అల్లాడిపోయారు. గడచిన నాలుగురోజుల నుంచి అయితే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఎండతీవ్రతతో జనాలు ఇళ్ల నుంచి ఉదయం పూటే బయటకు రావాలంటే భయపడవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు వాతావరణం చల్లగా ఉండటంతో ప్రజలు ఈ రోజుకు హమ్మయ్య అనుకుంటున్నారు. జిల్లాలోని కొత్తవలస, శృంగవరపుకోట, బొబ్బిలి, పార్వతీపురం, నెల్లిమర్ల, గజపతినగరం, సాలూరు తదితర ప్రాంతాల్లో తుంపర వర్షం, వాతావరణ చల్లబడటం కొనసాగింది.