విజయనగరం

వరి విత్తనాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తవలస, జూన్ 3: మండలానికి వరి విత్తనాలు వచ్చాయి. ప్రభుత్వం నుండి లైసెన్సు పొందిన మోదిమాంబ ఆగ్రో ఏజెన్సీ 17.5 టన్నుల విత్తనాలు వచ్చాయని ఏజెన్సీ యజమాని నాయుడు తెలిపారు. పది టన్నుటు స్వర్ణ, ఐదు టన్నులు 1001, 2.5టన్నులు సాంబామసూరి విత్తనాలు వచ్చాయని చెప్పారు. మరో రెండు రోజులలో మరిన్ని విత్తనాలు వస్తాయని తెలిపారు. వ్యవసాయాధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు కావలసిన విత్తనాలను సిద్ధం చేసామని వారం రోజులలో మొత్తం సరుకు ఏజెన్సీకి వస్తుందని చెప్పారు. విత్తన రేట్లు రెండు రోజులలో వెల్లడిస్తామని తెలిపారు. రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకోవాలని కోరారు. సోనామసూరి రకం తక్కువగా ఉన్నాయని, నెల్లూరు సన్నాలు, 1010, 1175రకాలు వరి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కొత్తవలస గేటులోపల విత్తనాల షాపు ఉందని రైతులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.