విజయనగరం

చెరకు రైతుల బకాయి చెల్లింపులకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జామి, జూన్ 23: చెరకు రైతులు బకాయి చెల్లింపులకు చర్యలు చేపడుతున్నట్లు ఫ్యాక్టరీ ఎండి డి.నారాయణరావు తెలిపారు. 2016 సంవత్సరానికి చెరుకు రైతులకు 22కోట్ల 20లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు 21కోటి 66లక్షల రూపాయలు చెల్లించామని తెలిపారు. ఇంకా 54లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు. ఫ్యాక్టరీ పర్సన్ ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్ ఎంఎం నాయక్ చొరవతో మొత్తం పేమెంటు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఫ్యాక్టరీలో ఇంకా 55వేల క్వింటాళ్లు పంచదార బస్తాలు నిల్వ ఉందన్నారు. ప్రస్తుతం పంచదార బస్తారేటు 3,400రూపాయలు ఉందని చెప్పారు. ఇటీవల విశాఖ డెయిరీకి మొలాసిస్‌ను టన్నుకు 7010 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశామని అన్నారు. ఈ ఏడాది చెరుకు దిగుబడి పెరిగే అవకాశం ఉందని, ఈ రెండు నెలల్లో 950 ఎకాలలో రైతులు ప్లాంటేషన్ వేశామని తెలిపారు. ఇంకాచాలాచోట్ల చెరుకు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. చెరుకు పండించే రైతులకు ఎన్టీఆర్ జలసిరి కింద సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేయాలని 145 దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు.