విజయనగరం

గోవధను అడ్డుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 21: అక్రమంగా గోవులను వధించే చర్యలకు అడ్డుకట్ట వేసే విధంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు లోగిశ రామకృష్ణ కోరారు. గురువారం పట్టణంలోని పూల్‌బాగ్, జగదంబనగర్, కొత్తపేట, కుమ్మరివీధి, దాసన్నపేట, రింగ్‌రోడ్డు, అశోక్‌నగర్ కాలనీలలో ప్రజలకు గోవధ నిషేధంపై రూపొందించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లోగిశ రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు వందలాది గోవులు, పశుసంపద అక్రమంగా కబేళాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని అచ్యుతాపురం, అలమండ తదితర సంతల నుండి కొనుగోలు చేసిన పశువులను వాహనాలలో జీవహింసకు గురిచేసే విధంగా కుక్కిమరి అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. పశువుల అక్రమ రవాణాను నిరోధించాల్సిన అధికారులు ఆ వైపు కనె్నత్తి చూడడం లేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలే ముందుకొచ్చి పశు సంపదను రక్షించుకునే బాధ్యతను చేపట్టాలన్నారు. పశువుల అక్రమ రవాణా సమాచారం తెలిసిన వెంటనే 100నెంబర్‌కు లేదా సమీప పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మద్దిల సోంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పారావుదొర, రామకృష్ణ, రామానుజం, వెంకటరావు పాల్గొన్నారు.