విజయనగరం

మావోల కదలికలపై అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్కువ, జూలై 21: మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని ఒఎస్‌డి వెంకటప్పలనాయుడు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిఆర్‌పిఎఫ్ వసతి గదులు, భోజనం వాటిని పరిశీలించి ఏజెన్సీలో మావోయిస్టుల కదలికలపై సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జగన్మోహనరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లో రికార్డులు పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మావోయిస్టుల కదలికల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. మావోయిస్టులు ఈనెల 28 నుంచి వచ్చేనెల 3వతేదీ వరకు మార్కియర్స్ వారోత్సవాలు జరుపుతున్న నేపధ్యంలో వారి ఉనికిని చాటుకోకుండా అప్రమత్తం అయ్యామన్నారు. ఏజెన్సీలో ముందు జాగ్రత్తలతో సిఆర్‌పిఎఫ్ బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నామన్నారు. మావోలు ఎటువంటి చర్యలకు పాల్పడినా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గిరిజన గ్రామాల్లో యువతను ఆకర్షించి వారి బంగారు భవిష్యత్‌ను పాడు చేస్తున్నారన్నారు. యువత వాస్తవాలు తెలుసుకొని జనావాసంలో కలవాలని కోరుతున్నారు. జనావాసంలోకి వచ్చేవారికి మంచి భవిష్యత్ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, పోలీసు సిబ్బంది, సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.