విజయనగరం

స్మార్ట్ పల్స్ సర్వేకే కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం
విజయనగరం, జూలై 21: స్మార్ట్ పల్స్ సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సాంకేతిక సమస్యల కారణంగా తరచూ అంతరాయాలు ఏర్పడడంతో అధికారులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈసమస్య కేవలం విజయనగరం జిల్లాకే కాకుండా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఏర్పడిందని అధికార వర్గాల సమాచారం. స్మార్ట్ పల్స్ సర్వే సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా ఏర్పడుతున్న సమస్యలు, నివారణ చర్యలు, సర్వే నిర్వహణలో జాప్యానికి ఇతర కారణాలపై చర్చించేందుకు గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎన్యుమరేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుండగానే మధ్యమధ్యలో మాట ఆగిపోవడం, వీడియో కనబడకపోవడం తదితర సాంకేతిక సమస్యలతో ముఖ్యమంత్రి ఏమి మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి తలెత్తింది. ఈ సమస్యపై జిల్లా అధికారులు సిఎం వీడియో కాన్ఫరెన్స్‌ను పర్యవేక్షిస్తున్న విజయవాడలోని అధికారులకు ఫోన్ చేసినా ఫలితం లేకుండా పోయింది.
సర్వే ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
కాగా వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్మార్ట్ పల్స్ సర్వేను వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో ఏర్పడే సాంకేతిక సమస్యలను శాఖల అధికారులు వెంటనే పరిష్కరిస్తారని చెప్పారు. సర్వే నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బంది, ఎన్యుమరేటర్లపై కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఇ-ఆఫీసు కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 16వేల కుటుంబాలను సర్వే చేసి వారి వివరాలను వెబ్‌సైట్‌కు అనుసంధానం చేశారని చెప్పారు. సర్వే నిర్వహణలో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జితేంద్ర, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత పాల్గొన్నారు. కాగా ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ నాయక్ జిల్లాలోని అన్ని మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే నిర్వహణలో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎన్యుమరేటర్లు ఉదయం తొమ్మిది గంటలలోపు ఆన్‌లైన్‌లో లాగిన్ కావాలన్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. సర్వే నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలపై ఎన్యుమరేటర్లు అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్ రోజుకు 20 కుటుంబాల వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టాలన్నారు.