విజయనగరం

అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించేలా అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఎం ఎం నాయక్ సూచించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులపై సీజన్‌కు ముందుగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి తెలియజేస్తే రైతులకు వీటిని సకాలంలో అందజేసేందుకు వీలు ఉంటుందన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో వ్యవసాయశాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్‌ఫెడ్, ఇక్రిసాట్ అధికారులతో నాయక్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 30 లక్షల వరకు చిన్నకమతాలు ఉండగా, అందులో ఎక్కువ శాతం చెరువుల కింద సాగవుతున్నాయని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల ప్రాజెక్టుల కింద, చెరువుల కింద సాగయ్యే భూముల వివరాలు, నీటి లభ్యత, ఖరీఫ్ పరిస్థితులు, రబీకోసం ముందస్తుగా తీసుకోవల్సిన చర్యలపై అధికారులు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పత్తి, మిర్చి తదితర వాణిజ్య పంటల సాగుకు, చిరుధాన్యాల సాగుకు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఎక్కువ దిగుబడులు ఇచ్చే కొత్త వంగడాలను రైతులు వినియోగించేలా చూడాలని, అవసరమైతే రైతులను వ్యవసాయ పరిశోధన కేంద్రాలకు తీసుకువెళ్లి శాస్తవ్రేత్తలతో అవగాహన కల్పించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే నివారణకోసం రెయిన్ గన్‌లను ముందుగానే సమకూర్చుకోవాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన కింద జిల్లాలో 1379మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించడాన్ని ప్రస్తావిస్తూ ఎక్కువ మంది రైతులు ఈ పథకంలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏడాది రైతులకు 1200కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యంగా తీసుకోగా ఇప్పటి వరకు కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేయడాన్ని ప్రస్తావిస్తూ రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ లీలావతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ రామారావు, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ రమణి, ఆగ్రోడైరెక్టర్ నందు, విత్తనాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ నాగసాయి, ఇక్రిసాట్ శాస్తవ్రేత్త డాక్టర్ తిరుపతిరావు పాల్గొన్నారు.
బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలి : సాగునీటిని పొదుపుగా వాడుకుని అధిక దిగుబడులు సాధించేందుకు రైతులు బిందుసేద్యాన్ని ఆచరించేలా ప్రోత్సహించాలని కలెక్టర్ ఎంఎం నాయక్ సూచించారు. కలెక్టరేట్‌లో తన కార్యాలయంలో ఎపిఎంఐపి, ఉద్యానశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మామిడి, జీడిమామిడి, చెరుకు, పత్తి, ఆయిల్‌పామ్, ఉల్లి తదితర పంటలను బిందుసేద్యం ద్వారా పండించడం సులువని తెలిపారు. బిందుసేద్యం ద్వారా ఈ పంటలను తక్కువ తడులతో పండించవచ్చని, ఎరువుల వినియోగం, కరెంటు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. బిందు సేద్యం చేసే రైతులకు అవసరమైన పరికరాలను రాయితీపై అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఎక్కువ మంది రైతులను బిందుసేద్యంపై మక్కువ చూపేలా చూడాలన్నారు. ఉద్యాన పంటలు, బిందుసేద్యంపై అనుకూలంగా ఉన్న రైతులను ఎన్టీఆర్ జలసిరి పథకంలో చేర్చి అన్ని ప్రయోజనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. సమావేశంలో ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ పాండురంగ, ఉద్యానశాఖ అసిస్టెంటు డైరెక్టర్ లక్ష్మి పాల్గొన్నారు.