విజయనగరం

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 21: జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అధికారులు సహకరించి అనుమతులు త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంఎం నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొన్న కలెక్టర్ నాయక్ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులు, పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు, వౌలిక వసతుల కల్పన, భూ కేటాయింపులు అంశాలపై ఆయాశాఖల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకోసం వచ్చిన దరఖాస్తులలో నిబంధనల మేరకు సక్రమంగా ఉన్నవాటిని సింగిల్ డెస్క్ విధానంలో వెంటనే పూర్తి అనుమతులు జారీచేయాలని స్పష్టం చేశారు. వీరికి ప్రభుత్వ నిబంధనల మేరకు వౌలిక వసతులు కల్పించడంతోపాటు రాయితీలు అందేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు ఎక్కువగా జరిగితే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉదయభాస్కర్, పర్యావరణ విభాగం ఇంజనీర్ లక్ష్మీపతి, ఇపిడిసిఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ చిరంజీవిరావు, రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కార్పొరేషన్ అధికారి యతిరాజులు, ఫ్యాక్టరీల ఇన్‌స్పెక్టర్ త్రినాథరావు, రాష్ట్ర ఆర్థిక సంస్థ సీనియర్ మేనేజర్ భాస్కరరావు పాల్గొన్నారు.