విజయనగరం

ఉద్యోగ నియామకాల్లో దళారుల మాటలు నమ్మవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 31: ఉద్యోగాల నియామక విషయంలో నిరుద్యోగులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా ఎస్పీ కాళిదాసు సూచించారు. ఇటీవల కాలంలో కొందరు వ్యక్తులు నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, పోలీసు శాఖలతోపాటు విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయిన సందర్భంలో ఆయా శాఖల, కంపెనీల ఉన్నతాధికారులు తమకు సన్నిహితులంటూ నిరుద్యోగ యువతకు మాయమాటలు చెప్పి నమ్మిస్తున్నారని తెలిపారు. డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఖాయమంటూ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం నిబంధనల మేరకు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పారదర్శకంగా జరుగుతాయని, ఈ విషయంలో దళారులు చేసేది ఏమీ ఉండదని అన్నారు. ప్రతిభ కలిగిన యువకులకు ఉద్యోగం వచ్చిన సందర్భంలో వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఉద్యోగాల నియామకాల విషయంలో నిరుద్యోగ యువత దళారాలు మాట నమ్మి మోసపోవద్దని చెప్పారు.