విజయనగరం

ప్రత్యేక హోదాకై అఖిలపక్షం ఒత్తిడి తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం అఖిలపక్షంతో కలసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వామపక్ష నాయకులు సూచించాయి. ఆదివారం సిపిఎం కార్యాలయం ఎల్‌బిజి భవన్‌లో విలేఖరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి పి.కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ప్రభుత్వం తాత్సార ధోరణిని తీవ్రంగా ఖండించారు. రాజ్యసభలో ప్రైవేటు బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ ఇచ్చిన సమాధానం ఆంధ్రరాష్ట్ర ప్రజలను తీవ్రనిరాశకు గురి చేసిందన్నారు. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, రాజ్యసభలో ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ అమలులో కేంద్ర ప్రభుత్వం అసలు బండారం బయటపడిందని అన్నారు.
ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్, గిరిజన యూనివర్సిటీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని గమనించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు అఖిలపక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా అంశంపై మీనమేషాలు లెక్కించకుండా పోరాటానికి సిద్ధం కావాలన్నారు. చంద్రబాబు లావాదేవీలు, అవినీతి అక్రమాలు వ్యవహారాలతో కేంద్రంపట్ల మెతకవైఖరి విడనాడాలన్నారు. ప్రత్యేక హోదా అంశంపై 2వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు టి.వి.రమణ పాల్గొన్నారు.