విజయనగరం

1 నుంచి ఇ-రవాణా పర్మిట్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, మే 18: ఇ-రవాణా పర్మిట్ విధానాన్ని జూన్-1వ తేదీ నుం చి అమలు చేస్తామని గజపతినగరం మార్కెట్ కమిటీ కార్యదర్శి రెడ్డి అరుణ కుమారి అన్నారు. శుక్రవారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఇ-రవాణా పర్మిట్ విధానం ద్వారా సరుకు రవాణా సులభతరం అవుతుందన్నారు. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన ప్రకటిత ఉత్పత్తులను రవాణా చేయడానికి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ఉత్పత్తులు రవాణా చేసే వాహనం తప్పనిసరిగా ఇ-రవాణా పర్మిట్ కలిగి ఉండాలని అన్నారు. వ్యాపారులు కొనుగోలుకు సంబంధించిన మార్కెట్ రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించి వారికి కేటాయించిన 10సంఖ్య ల పాస్‌వర్డ్ ఉపయోగించి నిర్ణయించిన పోర్బల్ నుండి ఆన్‌లైన్‌ద్వారా ఇ-ర వా ణా పర్మిట్ పొందవచ్చు అని అన్నారు. ఈ పర్మిట్ ఉంటే మార్కెట్ రుసుము చెల్లించారని భావించి చెక్‌పోస్టు వద్ద ఎలాంటి మార్కెట్ ఫీజు చెల్లించకుండా సరుకు రవాణా చేసుకోవచ్చునని చెప్పారు. మార్కెట్ కమిటీ చెక్‌పోస్టు సిబ్బందికి, తనిఖీ అధికారులకు పర్మిట్ చూపాలన్నారు. ఇ-పర్మిట్ లేకుండా సరుకు రవాణా చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. అలాంటి సరుకు రవాణాపై అపరాధరుసుము విధిస్తామని హెచ్చరించారు. అపరాధ రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని చె ప్పారు. ఒకసారి రుసుం చెల్లించి ఇ- రవాణా పర్మిట్ పొందిన సరుకుపై మళ్లీ ఫీజులేకుండా రెండవసారి పర్మిట్ సి స్టమ్ ద్వారా పొంది విక్రయానికి వీలు కలుగుతుందని వ్యాపారులు గమనించాలన్నారు. వ్యాపారులు పర్మిట్ కోసం మార్కెట్ కమిటీకి వెళ్ళవల్సిన అవసరం లే దన్నారు. దీంతో సమయం ఆదా కావడంతో పలు రికార్డులు నిర్వహించాల్సిన బాధ్యత తగ్గుతుందన్నారు. ఆన్‌లైన్ ద్వారా రిటర్న్ దాఖలు పరచాలని తెలిపారు.

‘లైసెన్సుదారులే కేంద్రాలను తెరవాలి’
గజపతినగరం,మే 18: చౌకధరల దకాణాలకు లైసెన్సు కలిగిన వారే దుకాణాలను ప్రతిరోజు తెరవాలని తహశీల్దార్ బి.శేషగిరిరావు అన్నారు. స్దానిక తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రేషన్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ప్రతిరోజూ లైసెన్సు కలిగి ఉన్న వ్యక్తే చౌకధరల దుకాణంను వేలిముద్రలు వేసి ఇ-పాస్ యంత్రం ద్వారా సరుకులను పంపిణీ చేయాలన్నారు. బినామీదారులు, నామినీలు దుకాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరకూడదన్నారు. అలాచేస్తే లైసెన్సులు రద్దు చేయక తప్పదన్నారు.
ప్రతినెలా ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు తప్పనిసరిగా దుకాణాలను తెరిచి ఉదయం, సాయంత్రం సరుకులను పంపిణీ చేయాలన్నారు. అలాగే 28వతేదీలోగా సరుకులు విడుదల కోసం డిడిలు తీసి సరుకులను విడిపించి ప్రతిరోజు స్టాకు బోర్డులో సరుకులు నిల్వ వివరాలను నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సిఎస్‌డిటి వివిఎస్‌ఎన్ మూర్తి పాల్గొన్నారు.

‘అంగన్‌వాడీ సేవలపై అవగాహన కల్పించాలి’
గజపతినగరం,మే 18: అంగన్‌వాడీ సేవలపై ప్రజలలో అవగాహన కల్పించాలని ఐసిడిఎస్ సిడిపివో కె.రమణమ్మ అన్నారు. స్దానిక వెలుగు కార్యాలయంలో సాధికారమిత్రలకు అంగన్‌వాడీ సేవలపై సాధికారమిత్రలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు,బాలింతలకు,పిల్లలకు పౌష్టికాహారంతోపాటు ఫ్రీ స్కూల్ నిర్వహణపై వివరించారు. సేవలలో ఎటువంటి లోపాలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలన్నారు. బాలికలు,మహిళలపై అత్యాచారాలు, అక్రమ రవాణా జరిగితే ఎటువంటి చట్టాలు ఉన్నాయో ప్రజలకు వివరించాలని కోరారు. సాధికారమిత్రలు అంకితభావంతో పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఐసిడి ఎస్ పర్యవేక్షురాలు విద్య,హైమావతి పాల్గొన్నారు.